Musi-TV Presents..Telangana Media » AndhraJyothy

పోరాడితే పోయేదేమిటో?
- అల్లం నారాయణ

ఔ ను కామ్రేడ్స్‌.దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉంది. ఒకటా రెండా.. నూటపదకొండు సమస్యలచిక్కుముడుల మధ్య చిక్కుపడిన దారపు ఉండలా ఉంది. దరిద్రంగా ఉంది. రైతులు నాగేటి చాళ్ళలో మృత్యుసేద్యం చేస్తున్నారు. పేదలు పేదలుగానే, ధనికులు మరింత ధనికులుగానే… ఉన్నో డు ఉన్నతికి,లేనోడు అధఃపాతాళానికి పోతానే ఉన్నారు. నిజమే కామ్రేడ్స్‌…కమ్యూనిస్టుపార్టీ పుట్టి దశాబ్దాలు గడిచిపోయినా, ఏదీరాలేదు. ఏదీపోలేదు. సోషలిజం వీధుల్లో మూర్ఛనలు పోతూనే ఉన్నది. వరల్డ్‌బ్యాంక్‌ తోలుబొమ్మలాటలో ఏలికలు తైతక్కలాడుతూనే ఉన్నారు. కొంత నెత్తుటి తర్పణా జరిగింది. కొన్నివేలమంది వీరులూ మరణించారు.

ప్రపంచం కదలని మెదలని నిశ్చలతలోనూ లేదు. అది ప్రవహిస్తూనే ఉంది. ప్రపంచకార్మికులు ఏకం కానేలేదు. పెట్టుబడిదారీ కోటగోడలు కూలిపోనూ లేదు. సామ్రాజ్యవాదం బలహీనమైన లింకూ తెగిపోలేదు.నిరామయ ప్రపంచం. ఒక బందగీ… ఒక దొడ్డి కొమరయ్య, ఒక చాకలి ఐలమ్మా, ఒక వీరుడు మరణించాడు. వేనవేల వీరు లూ ప్రభవించారు. ఒక తెలంగాణ నెత్తురోడింది. కానీ అది ఓడిపోయింది. అదొక అంతర్గత వలసయింది. ఔను నిజం కామ్రేడ్స్‌. దేశం క్లిష్టపరిస్థితుల్లోనే ఉంది. ఏదీ మారలేదు. తెలంగాణలోనూ సవాలక్ష సమస్యలున్నాయి. అనేకానేక సమస్యలతో సతమతం అవుతోంది. ఔను నిజమే కదా! కేసీఆర్‌కు ఆ సమస్యలు పట్టవు. ఆయనకు కావలసింది ఒక్కటే కదా! తెలంగాణ. అది సమస్యలున్న తెలం గాణ అయినా సరే ఆయనకొక తెలంగాణ కావాలె.

నిజమే. ఆయన కమ్యూనిస్టు కాదు గదా! నూటొక్క సమస్యలతో సతమతమయ్యే కామ్రేడ్‌ కాదు గదా! తెలంగాణల ఏమి జరుగుతున్న దో ఆయనకెందుకు? ఆయనకు మంచిదో, చెడ్డదో, లంగదో, దొం గదో? తెలంగాణ కావాలె. జై తెలంగాణ అందామంటే కుడి ఎడమల కమ్యూనిస్టులకూ సవాలక్ష సమస్యలాయె. తెలంగాణ అం దామంటే విశాలాంధ్ర ఏమయిపాయె. అలవాటయిన ప్రాణం కదా. కార్యక్షేత్రం తెలంగాణాయె. నెత్తురుడొల్లాడింది తెలంగాణలనేనాయె. దేశమంతటా భాషా ప్రయుక్త రాష్ట్రాలు రెండో మూడో.. అయిదో అయినా పర్వాలేదు. కానీ ఇక్కడ మాత్రం కాకూడదు కదా! ఎందుకంటే తెలంగాణల ఒక మజా ఉంది. హైదరాబాద్‌ల కూడా ఒక మజా ఉంది. బిర్యానీలాంటి భూములు. రియల్‌ ఎస్టేట్‌.కళ్ళముందర రంగారెడ్డి కబ్జా అయింది. చూస్తూ ఉండగానే హైదరాబాద్‌ తెలంగాణకు మాత్రం పరాయిదైపోయింది.

భాషలేదు, యాసలేదు. మొత్తానికి కూలిపోయిన ఇరానీ హోటల్లో, విస్తరించిన రోడ్డుపక్క కుంచించుకుపోయిన అడ్డాల్లో తెలంగాణ ఆత్మ ఇరుక్కుపోయింది. అదే మజా. మాల్స్‌ మజా. ఫ్రెష్‌ల మజా. జీవీకేలూ, జీ ఎమ్మార్‌లూ, దర్శినీ లూ, మెస్‌లూ… ఆంధ్రభోజనం దొరకబడును. ఇడ్లీలు, దోసెలు, కర్రీపాయింట్లు… అంతా అమ్మబడును, కొనబడును. అమ్ముడుపోయి ఆగమైపోయింది తెలంగాణ. ఎవరి ఊరిలో వాడు పరాయి కావడం, ఎవడిభాష వాడి ఊరిలో అర్ధం కాకపోవడం, బిక్కుబిక్కుమంటూ ఒదిగి మూలకు ముడుచుకుపోవడం గదా అస లు తెలంగాణ సమస్య. ఏలికలెవరైనా, పాలితులు ఎవరైనా, పాలకులు ఎవరైనా తెలంగాణ మాట చెల్లని స్థితి కదా భాషాప్రయుక్తరాష్ట్రమంటే.

భాష ఆదాన ప్రదానాలు… ఒక ప్రాంతపు భాషను (యాసకూడా) పూర్తిగా కునారిల్లజేయడమే కదా విలీ నం అంటే. కాడిమోసం చేసింది.కాడెద్దు మోసం చేసింది. చెయ్యిచ్చింది కాంగ్రెస్‌. చెన్నారెడ్డి, మదన్‌ మోహన్‌, మల్లికార్జున్‌… ఎవరి పేరయితేనేం? తెలంగాణ నలభై ఏళ్ళకిందట దగాపడింది.చివరికి ఇవ్వాళ్ళ కాకా అదే పని చేస్తున్నడు. ఉప్పునూతలా, ఎమ్మెస్సార్‌, చిన్నారెడ్డి,జీవన్‌రెడ్డి… తెలంగాణ ఒక ప్రయోగశాల. ఒక ఓటు, రెండు రాష్ట్రాలన్న బీజేపీ ఒకసారి ధోకా ఇచ్చింది. ఇప్పుడు ఇక కండ్లు తెరిచింది. మా… కాదు కాదు మూర్క్సిస్టులు, ‘నో’ డెమోక్రసీలు సరే సరి. కానీ కామ్రేడ్స్‌…తెలంగాణ అంటున్న మీకు మాత్రం దేశంలోనూ, తెలంగాణలోనూ ఉన్న అనేక సమస్యలు గుర్తుకొస్తాయి. కానీ, ఆగమైన తెలంగాణ గుర్తుకురాదు.

పోలవరం కడ్తుంటే పోతున్న గిరిజన ప్రాంతాలు గుర్తురావు.పోతిరెడ్డి పాడు గుర్తుకురాదు. 610 జీవో అమలు కాకపోవడమూ గుర్తుకురాదు. సకల రక్షణల ఉల్లంఘనలూ గుర్తుకురావు.యాభై సంవత్సరాల దగా పోరాటానికి ఒక అంశమూ కాదు. ఎందుకు కామ్రేడ్స్‌ మొహమాటాలు. తెలంగాణ మీకోసం నెత్తురు ధారవోసిన నేల. కమ్యూనిజం కోసం కదనరంగాన దూకి నైజాం బూజు వదిలించిన నేల. మీ తుపాకులకు భుజమిచ్చిన నేల. ఊరూరా ఎర్రని స్థూపాలతో, వాడవాడనా తమ ప్రాణాలను పూచిక పుల్లల్లా అర్పించిన అమరవీరుల నేల. చరిత్రను శ్వాసించిన నేల. చరిత్రను శాసించిన నేల. కానీ… అది తల్లడిల్లుతున్నది. మూడువేల గ్రామాల్లో ఎర్రజెండాలెగరవేసి,నేలను విముక్తం చేసిన ఈ తెలంగాణప్రజలకు ఇదేమి దరిద్రం.

దేశమంతటా లేని నదీజలాల మళ్ళింపు, వనరుల మళ్ళింపు,భాష యాసలమీద, సంస్క­ృతిమీద పెత్తనం, ఉద్యోగాలు దొరకని వైనం. స్తన్యం దక్కని శిశువు తెలంగాణ. అవును కామ్రేడ్స్‌… దేశానికి సమస్యలున్నాయి. తెలంగాణకు అదనంగా అదనపు సమస్యలున్నాయి. అన్నింటికీ ఎర్రజెండాలెత్తి కదనరంగంలోకి దూకి, వీధులు ఎరుపెక్కించే కామ్రేడ్స్‌… ఈ ఒక్క తెలంగాణ కోసం మాత్రం అటుగాని, ఇటుగాని సందిగ్ధం ఏలకలిగినో చెప్పగలరా? పోరాడకుం డా తెలంగాణలో చోద్యం చూస్తామనడం న్యాయమా? పోరాడేవాళ్ళకు తెలంగాణ ఒక్కటే… పోరాట వారసత్వమూ ఒక్కటే. కానీ… మీరే అటు ఇటుగాని హృదయముతోనీ…కమ్యూనిస్టులుగా… తగునా? తెలంగాణకోసం పోరాడితే పోయేదేమిటో?

కూలిన గులాబీ తోట
- అల్లం నారాయణ

ఏటా కోటీ ఇరవైలక్షల మంది నీ గులాబీతోటను తొక్కుకుంటూ తోసుకుంటూ ఎగిరిపోతారిక లోహవిహంగాల రెక్కలపైన. నీ ఎకరం గులాబీ తోట పక్కవాళ్ళ వందలాది ఎకరాల చేనుచెలక, ఆ పక్కవాళ్ళ కూరగాయల మళ్ళను మాయం చేసి నాలుగున్నర కిలోమీటర్ల పెట్టున వేసినారు చూడు… అది రన్‌వే. అతి పొడవైనది. అదొక కొండచిలువకూడా. దానికడుపులో దాగున్న నీ గులాబీతోట, వేల ఎకరాల తోటలు వాడిపోయినయ్‌. ఆవుల చంద్రమ్మా, సుభద్ర, రాజవ్వ, మల్లవ్వ, రాజపోషవ్వ పేరేదైతేనేం భూమి పుత్రికా. ఎవరో ఒకరు ఎగిరిపోవడానికి నేలమీద వేళ్ళూనుకున్న మీలాంటి లక్షలాదిమంది నేలబంధం తెగిపోవడం ఎవరికి మాత్రం ఎందుకు పడుతుంది లక్ష్మక్కా! తలకిందులుగా చూసినప్పుడు కదా… కొంచెమైనా అసలు సత్యం బోధపడేది.

ఎవరికుందంటావ్‌ అంత ఓపికా, తీరికా… ఊపిరి సలపని అభివృద్ధిలో ఆగమైన బతుకుల మూల్గులు ఎవరు వింటారు? పల్లె మూలుగలను పీల్చే నల్లని తారురోడ్డు స్వప్నం ముందు.. నీ కలలు ఎలా నిలబడతాయి చంద్రమ్మా, ఇస్మాయిల్‌ ఖాన్‌కా బీబీరసూలమ్మ… అంతా ఒక పాముచుట్టుకుంటున్నట్టు…దివారాత్రులు మళ్ళు తీసి..నీరుపెట్టి, ఆకుతుంచి అలం ఏరి, మళ్ళు చేసి,దళ్ళు వేసి పూయించిన గులాబీ తోటను గురించి కానీ, రెక్కలు మొలిచిన శంషా బాధలో నీ నోటికాడి ముద్దజారిపడి, రెక్కలు కూలు తున్న చప్పుడు కానీ ఎవరైనా వింటారా? ఎ-380 శబ్దం… అదట్లా రెక్కలల్లారు స్తూ, నేలకు దిగుతున్నప్పుడు గుండెల మీదుగా బుల్డోజర్లు దొర్లుతున్న చప్పుడు ముందు నీ అన్నార్తుల కేకలు అరణ్య రోదనలే కదా! అభివృద్ధి అంటే ‘హై’దరా బాద్‌ అంటే బుల్డోజింగ్‌ కూడా కదా!

ఏదీ ధ్వంసం కాకుండా ఏదీ నిర్మించడం కుద రదు కదా! నువ్వూ నీతోపాటు పదూళ్ళ జనం, నీ గులాబీతోట, దోసకాయమడి, టమాటాపంట, కొత్తిమీర, ఉల్లినార, పుదీనా తోటలతో పాటు మనుషుల కాళ్ళూ రెక్కలు, కపా లాలు, కంకాళాలు తొక్కుకుంటూ విరుచుకుపడి కూలగొడ్తు న్న బుల్డోజింగ్‌ కదా అభివృద్ధి అంటే. అభివృద్ధి పదఘట్టన ల్లో బొక్కలు ఫెళ్ళున, ఫెటిల్లున విరుగుతున్న చప్పుడు. అమా యకపు పుడమితల్లీ ఆవుల చంద్రమ్మా…నీ గురించి, నీతోపాటు అభివృద్ధి కింద నలిగి నీలిగిన వాళ్ళ గురించి ఎందుకు? ఎవరు మాత్రం మాట్లాడతారు. ఎవరు మాత్రం ఒక క్షణం రెప్పపాటు గా ఆలోచించాలి. హైటెక్‌ సిటీకింద, ఆవులమందల అసలు మాదాపూర్‌, ఫిల్మ్‌సిటీ కింద ఆ కొసనుంచి ఈ కొసదాకా వాగులు, వంకలు, చెరువు లు,దొరువులు నగరం చుట్టూ అభివృద్ధి ముకుతాడుగా చుట్టుకున్న కొండచిలువ రింగురోడ్డు ఎందరిని నిర్వాసితులను చేసిందో? ఎవరికి చెప్పుకోగలం?

మీరు వేలకు అమ్ముకుంటే వారు కోట్లకు అమ్ముకుని కొల్లగొట్టిన దానిపేరే కదా అభివృద్ధి? రియల్‌ మాయ. అయినా మట్టిని నమ్ముకున్న వాళ్ళు మీరు. చేతికి మట్టి అంటకుండా మట్టినీ, మనసునూ అమ్మే బేహా రులు వాళ్ళు. కొంత తనదీ, కొంత మందిదీ (షేర్‌ మార్కెట్‌) కొంతెందుకు అంతా సర్కారువారు ధారవోసింది. అంతా కలిసి లెక్కిస్తే ఆకాశంలో గిర్రున విమానాలు ఎగరేసే వేలకోట్లు. నీలా… నీలాంటి మరికొందరిలా రోజూ రెక్కలుముక్కలు చేసు కునే శ్రమజీవుల్లా… డొక్కలు మాడ్చుకుని, సున్నితమైన గులా బీలు పూయించి అమ్ముకోవడమెందుకు? అభివృద్ధి చాలా సులభం. ఆ అభివృద్ధి గురించి నీకు తెలీదు కదా! గాలిలో నోట్ల రెపరెపలు. షేర్‌ బజార్లో షేర్‌ వాటాలు. బ్యాంకుల్లో అప్పులు. గాలిలో కోటానుకోట్ల సంపద. అందుకేనమ్మా.. ఆవుల చంద్రమ్మా… ఏం పనిచేయగలరు మీరు.

రెండు రెక్కలు తప్ప మరి లేనివాళ్ళు. చెమట ఒడవడం తప్ప రానివాళ్ళు. గొడ్లుకాసుకుని బతికేవాళ్ళు. కొండొకచో గొడ్లలాంటి జీవితం కలవాళ్ళు. ఈ సుందరమైన… సువిశాలమైన.. అతి పొడ వైన..అద్దాల గాలి మోటార్ల అడ్డాలో పాయఖాన్లు కడుగు తారా! పాచి ఊడుస్తారా? ఏం చెయ్యగలరు మీరు? ఇక ఉద్యో గాలు అంటారా! ఏమివ్వగలరు? కభి అల్విద నా కెహనా! బేగంపేట, రసూల్‌పురా, సనత్‌ నగర్‌, మోతీనగర్‌, జెకే కాలనీ పేరు ఏదైతేనేం! అర్థరాత్రి గుండెలమీదుగా వెళ్లే ఆ శబ్దాలిక వినిపించవు. బహుశా ఆ కిలోమీటర్‌ పొడవూ రాహదారికి ఇరువైపులా విస్తరించిన బేగంపేటకు వెళ్ళేదారి మూగవోతుంది. ఆ రోడ్డు వెంట మనీ ఛేంజర్స్‌, కిరాయికార్లు, ఆటోలు నడిపేవాళ్లు, టికెట్‌ బుకింగ్‌ చేసేవాళ్లు, ఊడ్చి, తూడ్చి బేగంపేట ఎయిర్‌పోర్టు అద్దాల మేడలా మెరిపించినవాళ్లు… వీడ్కోలు… మిత్రులారా ఇన్నాళ్లు మీ తలల మీదుగా ఎగురుతూ దూసుకుపోయే గాలిమోటర్ల చప్పుడిక దూరమైపోయింది.

శబ్దానికి సెలవు. గాలిలో తేలిపోయే ఆ అందీ అందని చందమామ గాలిమోటర్‌ మీ పిల్లల గోరుముద్దల ఆశ ఇంకెంతమాత్రం కాబోదు. బతుకు ఇగిరిపోయింది, ఎగిరిపోయింది. చిలుకలో ప్రాణం ఎగిరిపోయినట్టు హఠాత్తుగా బేగం పేట చుట్టుపక్కల బతుకూ నిశ్శబ్దం గా ఎగిరిపోయింది. కారు నడిపినవాడా… ఆటో తోలినవాడా… బతుకం తా ఆశనిరాశల లాంటి శబ్ద నిశ్శబ్దాల మధ్య గడిపినవాడా.. సలీమ్‌! నీ బతుకిక కూలిపోయింది. నిజాం కోడలు బేగంపేటలో బతుకు పునాదిరాయి వేస్తే.. ఇందిరాగాంధీ కోడలు ఆ బతుకుసమాధిని శంషాబాద్‌లో పేరుస్తున్నది. అయినా నిర్వాసితులు ఒక్కరా! ఇద్దరా! గోదావరిఖని రాజపోశవ్వా… బెల్లంపల్లి ఊరును ముంచిన ఓపెన్‌ కాస్ట్‌ గనిలో నలిగిన రాజయ్యా! సత్యవీడు, కాకినాడా, హైదరాబాద్‌లో మామిడిపల్లి ఏదో ఒక ‘గూడ’ అంతటా ఒకటే కథ.

ఎల్లంపల్లిలో మునుగుతున్న కోటిలింగాల, పోలవరంలో మునుగుతున్న కోయల దేవుడు, ఊర్ల కు ఊర్లు పెకిలించే అభివృద్ధి ముందు, దాని బుల్డోజర్‌ స్వభా వం ముందు మోకరిల్లి మూల్గుతున్న చంద్రమ్మా… తలకిందులుగా చూస్తే తప్ప నీ కూలిపోయిన గులాబీతోట జీవం ఏమి టో? దాని ప్రాణం ఏమిటో అర్థం కాదు. కభి అల్విద నా కెహనా… చంద్రమ్మా సుడులు తిరుగుతున్న నీ దుఃఖమూ… భూమిపుత్రుల శోక మూ ఒక్కటే… అది మంది శోకం. మంద మంటలైనప్పుడు.. అదొక ఉప్పెన కూడా.. ముంచెత్తే ఉప్పని కన్నీటి ఉప్పెన…

తాజా మృత్యుగీతం
- అల్లం నారాయణ

ఫ్రెష్‌.. రిలయన్స్‌ ఫ్రెష్‌..కాదు.. ఇప్పుడు రైతులను తవ్వి తలబోసుకుంటున్న మాజీ ఏలికగారి హెరిటేజ్‌ ఫ్రెష్‌ కూడా కాదు. నెత్తిన ఫ్రెష్‌గా తలపాగాతో, కంకాళాల మీద కూచొని తాజాగా రైతు ప్రవచనాలు వల్లిస్తున్న ‘మెస్సయ్య’ గురించీ నేను మాట్లాడడం లేదు. తాజా గా మరణించిన నాగలి మోసిన క్రీస్తురైతు గురించి చెబుతు న్నా. 60వేల కోట్ల రుణాల మాఫీకి ముందే బంధవిముక్తుడైన ఒక కరీంనగర్‌ రైతు ‘ఫ్రెష్‌డెత్‌’ గురించిన వారెంట్‌ ఇది. బహుశా ఇప్పటికిప్పుడు.. ఒకరు రాజీనామా చేస్తే మరొకరికి ‘డెత్‌వారెంట్‌’ అవుతుందన్న విషయమూ మాట్లాడడం లేదు. 60 వేల కోట్ల రుణాల మాఫీ తాజా ఆత్మహత్యలనెందు కు ఆపలేదన్నది జవాబులేని ప్రశ్న కూడా కాదు. అతను పత్తి పండించనప్పుడు పత్తి ధరలు వెలుగులు చిమ్మింది. అతను మిర్చితో విసిగిపోయినప్పుడు మిర్చి ధర ‘రెడ్‌’ మార్క్‌ దాటింది.

వరిధాన్యం గుత్తులు గుత్తులుగా, కంకు లుకంకులుగా భాసిల్లుతున్నప్పుడు మార్కెట్‌లో ధరకూ, షావుకారు అప్పుకింద జమకట్టుకున్న ధరకూ మధ్య ఒక పూడ్చరాని అగడ్త మిగిలింది. ఏం చెయ్యమంటావ్‌ చావక.. సేద్యం ఒక జీవితం. పొద్దున మొదలైతే నిద్దురరాత్రి దాకా సాగే యజ్ఞం. రెక్కలు ముక్కలయినప్పుడు..ఖాళీ గిన్నెలు..గింజలేని గుమ్ములు..నోటీసులు..నోటీసులుగా విస్తరించి న అప్పులు. అవమానాల, ఛీత్కారాల, అమ్మా ఆలి శీలశంకల కారుకూతల వడ్డీ వ్యాపారి భూతం. పోనీ ఏం చేయమంటారో చెప్పండి. ఒక స్వామినాథన్‌, ఒక జయతీఘోష్‌, ఒక చిదం బరం, ఒక మన్మోహన్‌సింగ్‌, ఒక మాంటెక్‌ సింగ్‌ అహ్లూవాలియా. కృత్రిమ తలపాగా చుట్టుకుని పత్రికల బ్యానర్లు కొనుక్కొని పళ్ళికిలిస్తున్న ఒక ‘పెద్దాయన’… అవును ఒక పి.వి.నరసిం హారావు కదా ఆద్యుడు. అవును కదా… ప్రపంచమంతా తొమ్మిదోనెంబరు సూచీ దాటి అభివృద్ధివేపు పరుగెడ్తున్నప్పుడు వ్యవసాయం కునారి ల్లి రెండు సూచీ దగ్గర కుప్పకూలబడి మూల్గుతున్న సంగతి లో అసలు మర్మం దాగున్నది.

పంటపొలాల్లో చెమటానెత్తు రూ కలికలిచేసుకొని కూడా… బురదబుక్కి బురదతాగి మట్టి లో మట్టిగా మారిన పంటపొలాల్లో రైతుల గురించి మాట్లాడమంటే మీరు అయిదేండ్లకోసారి అదనుమీద పదునుగా కోసుకునే ఓట్లుకాసే పంటపొలాల గురించి మాట్లాడుతుం టారు. అసలు మర్మం ఇది కదా! సంస్కరణలు కదా మొదటికి మోసం తెచ్చింది. గొప్పగా చంకలు గుద్దుకున్న ఈ మన్మోహన్‌లూ, మాంటెక్‌సింగ్‌లూ, ప్రపంచబ్యాంకు తైనాతీలకు ప్రతినిధులుగా ఉన్న అన్ని రకా ల ఏలికలూ కదా ఈ మోసపూరిత కపట ప్రణాళికలు తెచ్చిం ది. నూటికి డెబ్భైమందికి పూటకింత ముద్దపెట్టే వ్యవసాయ సమాజాన్ని, సంక్షోభంలో నిత్యం చావురేఖలమీద కదలాడే… నిత్యం సర్కస్‌ తీగలమీద సాములు చేసే వ్యవసాయ సమాజాన్ని నెలలు నిండకముందే అగ్రదేశాల బాణీలకు అడుగులు కలిపే నాట్యకత్తెను చేసింది. ఎరువులేవి దేవరా! సబ్సిడీలేవి? ఎప్పుడు ఎత్తేశారు. విత్తనాలేవి దేవరా? ఏ బహుళజాతి మోన్‌శాంటోలు మింగాయి.

పురుగుల మందు డబ్బా ఎప్పుడు చావును మోగించే మృత్యుపేటిక అయింది. ఎక్కడ ఇరుక్కున్నాడు రైతు? చివరకు కోతమిషన్‌, దున్నే యంత్రం.. యంత్రభూతముల కోరలు తోమిన మిడిమేళపు కోండ్రెడు వ్యవసాయం. ఏలికలరా! సంస్కరణ ప్రగతి పథాన అంకెలు అంకెలుగా, కోట్లు కోట్లుగా విస్తరించిన అవధూతలా రా! ఎక్కడ చిక్కుపడిపోయింది నాగేటిచాలు. జనుము వేసి.. తొక్కి… పెసరవేసి.. మినుమువేసి… పంటమార్చి… ఏమా ర్చి… కోండ్రెడు దున్నుకొని కడుపు కొఠీర నింపుకున్న రైతు ఏడపోయాడు. నాకొక రుణమివ్వండి…బాంచెన్‌ కాల్మొక్తా. లేదా నాకొక ఉరితాడివ్వండి. రుణం దొరకలేదా! ఛలో… ఉన్నాడు కదా షావుకారి. వడ్డీకి వడ్డీ వడ్డీకి వడ్డీ.. మేక తోకకు మేక తోకకు… అంతూదరీ లేని యాతన… ఆత్మగౌరవంతో నూ, భూమిని రెండుగా చీల్చి బువ్వపంచిపెట్టిన తలబిరుసు పొగరుతోనూ… తంగెళ్ళు పీకి.. అదను చూసి…చదును చేసి.. నల్లబంగారు నేలల పచ్చటి మొక్కల సృజన చేసిన సజీవ క్రియాశీలి.. సృజనశీలి. తెగువతోనూ, ఏపుగా పెరిగిన మొక్కలా… సూర్యునికేసి నిటారుగా నిలబడిన మొఖంగల ధీరోదాత్త రైతు.

ఒక్క మాటకు కుంగిపొయ్యి, దీనుడై, హీనుడై, ప్రైవేటు అప్పు అతని చావుకొచ్చింది. లెక్కలు తెమలని, జమాకూడిక కలవని సరిహద్దురేఖలయి…అవమానం… ఆక్రోశం… ఏం చెయ్యమంటారు. చావులెక్కల్లోనూ మతల బుంది. చచ్చేది వేలల్లో…చూపేది వందల్లో… ఏం చెయ్యమంటారు రైతును. పొయిలో పిల్లి లేవలేదా? పర్వాలేదు. కానీ పంట చేతికి రాలేదు. ఊరు రాజీవ్‌ పనిపథకానికి ఎలబారింది. పత్తిచేలోనే ఇగిలిస్తున్నది. వరిధాన్యం ముదిరి జలజలా కన్నీళ్ళై రాలుతున్నది. ఎవరు చేస్తా రీపని? ఆకలికి అందనిది, పోకడకు పొందనిది. ఎక్కడ చిక్కుపడ్డావు తండ్రీ… ఈ డబ్బు జలతారు పరదాల ప్రపం చంలో. మాఫ్‌..బారాఖూన్‌ మాఫ్‌…. నిన్న పచ్చని పంటపొలమైంది.

నేడు మహమ్మారి సెజ్‌ అయింది. ఏడువందల స్థానంలో ఉన్నవాడు నేడు మూడోస్థానం లోకి ఎగబాకాడు. కూరగాయలు టోకున కొని ‘ఫ్రెష్‌’గా చిల్లరలో అమ్మేవాడు కొఠీర్లునింపుకున్నాడు. రైతు రాజ్యం గురించి ఏలికా…మాజీ ఏలికా ఇద్దరూ కలవరిస్తున్నారు. ఆ ఇద్దరు విచిత్ర సోదరుల ఆస్తి ఒక బడ్జెట్‌ పొడుగంత విస్తరించింది. ఉక్కుపరిశ్రమలో కాకలు తీరినవాడు లక్ష్మీ పుత్రుడయ్యాడు. భారత్‌ వెలిగిపోతున్నది. వాజపేయి హయాంలో వెలిగిపోయింది. ఇప్పుడు మరింత వెలిగిపోతోంది. శంషాబాద్‌కు రహదారి వేసి మరీ విమానాలు దింపి…మరీ దోచుకోమంటున్నది.

కూరగాయలు పండించలేనివాడు ఎకరాపదిలక్షలకు అమ్ముకుంటే, దళారిగాడొకడు దాన్ని పదికోట్లకు అమ్ముకుని ఫోర్బ్స్‌జాబితాలో నాలుగోస్థానంలో నిలిచాడు. జీవీకేలూ, జీఎమ్‌ఆర్‌ ప్రాపర్టీలూ… ఎంత గర్వకారణం తెలుగుజాతికి. పొగడరా….నీ తల్లి… తెలుగు భారతిని. కానీ మిత్రులారా! ఫ్రెష్‌… తాజాగా మరో శవం. అది బలవన్మరణం. బహుశా ఏ సమాజంలో నూ ఉండదు. వానల్లు కురిశాయి. ప్రాజెక్టులు తళతళలాడాయి. పంటలు పండాయి. అంతా సుభిక్షంగా ఉంది. ఒక్క రైతు ఆత్మహత్య తప్ప. అదీ 60వేల కోట్ల రుణాలమాఫీ తర్వాత ఆ రైతుకు రుణం తీరిపోయింది. బహుశా అదీ… అసలు విషాదం. జై భారత్‌, జై హింద్‌, జై ఆంధ్ర, జై తెలంగాణ…. ఇంకా ఇంకా… అదొక్కటే సశేషం.

జనవనం మనాది
- అల్లం నారాయణ

కన్నెపల్లి అడవిలో దాగున్న రహస్యం. ములుగు రోడ్డు పంటపొలాలను మోసుకుంటూ, గోవిందరావుపేట, పసి రె దాటితే నార్లాపూర్‌ మలుపు రోడ్డు విస్తరించి ఉన్నది. నీటి వనరున్నచోట కాకాతీయుల కళాశిల్ప వైభవంగా చరిత్రలో విలసి ల్లిన గుడికి దూరంగా రోడ్డు. రామప్పలేక్‌. రెండు కొండలు అటూ ఇటూ సమున్నతంగా నిలుచుండగా మధ్యలో పురా విశ్వాసాల మట్టికట్ట. జల సముద్రం. రోడ్డుపొంట దూరంగా బ్యాక్‌ వాటర్స్‌. కొంచెం నల్లగా, నీలిగా ఆ నీటి వనరు అధరువు గా అక్కడక్కడా పచ్చటి పంట పొలాలు. గోవిందరావుపేట, పసిరెలు రెండూ తొలి వలస ప్రాంతాలు. బహుశా ఈ గిరిజన సమూహాల్లోకి, మేడారం జాతర సాన్నిహిత్యంలోకి వచ్చిన ఈ ఆంధ్ర ప్రాంతపు వలసలు రామప్ప చెరువు ఆయకట్టు వల్ల వచ్చి ఉంటాయి. నార్లాపూర్‌ అటవీ పరిమళం అడవి విస్తరించిన మేరా. కొట్టేసిన చెట్ల ఖండిత మొండాలు.

అడవి ఖాళీ అయ్యిం దన్న దానికి సూచిక. అడవిలోనికి చొచ్చుకుపోయిన నాగరికతా చిహ్నం రోడ్డు. అటూ ఇటూ తలలూపుతు న్న పలుచటి చెట్లు. దూరంగా చిలుకల గుట్ట. అదే మేడారం. కోట్లాది గిరిజనుల నమ్మకం రెండేళ్ళకో సారి పునరుత్థానం పొందే కూడలి. చరిత్ర కు ఒక జాతర అది. సాహసంవల్ల దేవతల యిన తల్లీ కూతుళ్ళు సమ్మక్క-సారలక్కల పురాత్మల జ్ఞాపకాన్ని మదిలో నిలుపుకునే మనాది అది. కాకతీయ రాజులపై కప్పం కట్టలేని పగి డిగిద్దరాజు కత్తి దూసిండు. సమ్మక్క భార్య. సారలక్క, జంపన్న కూతురు, కుమారుడు. కాకతీయుల సేనలు దాడి చేస్తే వీరోచితం గా పోరాడి పగిడిగిద్ద రాజు వీరమరణం. సమ్మక్క నిలబడ్డది. జంపన్న ఓటమి అంచులో కత్తితో పొడుచుకుని జంపన్న వాగులో వీరమరణం పొందాడు. సమ్మక్క, సారలక్కలు చిలుకల గుట్టపైకి అదృశ్యమ య్యారు. సమ్మక్క అదృశ్యం అయిన చోట కుంకుమ భరిణ, మూలికలు. క్లుప్తంగా ఇదీ చరిత్ర.

జీవించి ఉండి, రాచరికంపై కలెబడి నిలబడిన పురాయోధులు, యోధురాళ్ళ కథ ఇది. ఇప్పు డు వాళ్ళు దైవాలు. చరిత్ర వారసత్వం కోటి జనాల జాతరగా రూపొందిన ఒక వైచిత్రి సమ్మక్క జాతర. ఒక చిన్న ఊరికి, ఆ ఊరును ఆవరించిన అడవికి రెండేళ్ళ కోమారు తరలి వచ్చే లక్షల జనం. దేనికోసం వస్తారు. శివసత్తులై తూలి దేన్ని పలవరిస్తారు. ఏం మొక్కుకుంటారు. ఏ కోర్కెలు తీర్చమంటారు. ఏ పోరాట వారసత్వాన్ని పొందుతారు. రెండు సంవత్సరాల కోసారి దేనికోసం సమూహ సంద్రమై జనం ఎందు కు ఉప్పొంగుతారు. అదొక సామూహిక జ్ఞాపకమా? ఒక చరి త్రా.. ఒక నమ్మకమా! సమ్మక్క-సారలక్కలు విగ్రహాలు కాదు. రెండు గుర్తులు. రెం డు ప్రతీకలు. రెండు గద్దెలు. ఒక కుంకుమ భరిణ. ఈరెండు చిహ్నాలకు ‘బంగారం’ కొబ్బరికాయ, గొర్రెపిల్ల, మేకపోతు, కోడి పిల్ల, కొబ్బరికుడుక, కంకబియ్యం, ఒడిబియ్యం. అంతే మొక్కు అయిపోతుంది. ఏం మొక్కుకుంటావో నీ ఇష్టం. ఇక ప్రారంభం సంబరం.

తాగు, తిను, పూనకంవస్తే తూలు. జంపన్నవాగులో పవిత్ర స్నానమాడు. ఇదీ కథ. జరుగుతున్న కథ. మానవుడి తొలి విశ్వాసం ‘టోటెమ్‌’ ఒక చెట్టునో, పుట్టనో ఆరాధించే ప్రాకృతిక మానవుడి ఆరాధ్య దైవం ప్రకృతి… మేడా రం జాతర. ఒక ప్రకృతి ఆరాధన. ఒక తొలి సంస్క­ృతి కొనసా గింపు. తెలంగాణ ప్రాంతానికే ప్రత్యేకమైన చారిత్రక పండుగ. అట్లని అది తెలంగాణ మర్యాదస్తుల పండగ కూడా అనలేము. గిరిపుత్రుల పండగ. ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, ఒరిస్సా ఆనుకొని దండకారణ్యంగా భాసిల్లుతున్న గిరిజన ప్రాంతాల కోయల పండుగ అది. మేడారం జాతర ప్రాంతాల పొడవునా ఇంటికో సమ్మ య్య, సమ్మక్క, జంపన్న ఇవీ చిహ్నా లు.

కానీ….. జంపన్న వాగులో బోర్లు పైకి ఎగ జిమ్మి మెట్ల మీదుగా తలలపైకి పొంగుతున్న పంపులు విరజిమ్ముతు న్న నీళ్ళు. మొన్న మొన్ననే కట్టిన పూర్తికాని వంతెన. సమ్మక్క- సార క్కల గద్దె చుట్టూ ఇనుప కంచె. సోలు పున భక్తులు తరలేందుకు లేన్లు. సమ్మక్క-సారక్కలను దాచివేస్తున్న కట్టడం. రోడ్డు పొడవూ బార్లు తీరే దారులయ్యే గూడు బండ్ల బదులు అడవి బందున విడిది చేసిన కారుల బారులు, లారీలు, గుడారాలు. దుకా ణాల ముందు సోకులు పోతున్న ‘నిబ్‌’లు, క్వార్టర్‌ సీసాలు. ప్లాస్టిక్‌ గ్లాసులు. కోకోకోలాలు. ఫాంటా… ఫాంటసీలు. తన కొడుకును సినిమాల్లోకి ఆకర్షిస్తూ కన్నుకొడ్తున్న కమెడియన్‌ బాబూమోహ న్‌ ఫ్లెక్సీ. తెలంగాణ తల్లి నటనతో వీరోచిత, రౌద్ర, రూపపు ఫ్లెక్సీతో దారిపొడవూ ఆహ్వానాలు. రోడ్డు పక్కనే తాగి తూలుతు న్న ఒక అభాగ్యుడు. దోసె.. వడ.. ఇడ్లీ.. ఇక్కడ ఆంధ్రభోజనం పెట్టబడును.

ఇవ్వాళ ముఖ్యమంత్రి, రేపు మాజీ ముఖ్య మంత్రి రాక. తాడ్వాయి నుంచి మేడారం దాకా, పసిరె నుంచి మేడారం దాకా ట్రాఫిక్‌ జామ్‌.. అయి పోయిందా.. బహుశా ఈ జాతర కోసం కొంచెం చట్టి ముక్కులు, పొట్టి నడకలు గల కోయలు ఇక కనుమరుగుకావచ్చు. బహుశా ఈ జాతర కోటాను కోట్ల జనం లో గిరిజనులకన్నా నాగరికులే మందగా మూగవచ్చు. బహుశా ఇక్కడ అతిథి గృహాలు రావ చ్చు. హోటళ్ళూ రావచ్చు. అభివృద్ధి తన నగ్న స్వరూపంలో రెండు ప్రపంచాల స్వభావంతో నిలువె ల్లా జంపన్న వాగులా ప్రవహించొచ్చు. అప్పుడిక జంపన్న రక్తం తో, జంపన్న వాగై ప్రవహించిన సంపంగి వాగు ఇంకి పోవచ్చు. అదీ వర్తమానం. ఒక్క నమ్మకం కోసం కోటొక్క పరిసె జనవ నం అవుతున్న ఒక అపూర్వ పురా ఆత్మల జ్ఞాపకానికి మోకరిల్లేదే మేడారం జాతర. అదొక ప్రాణమై ప్రవహించే శాశ్వతయాది.

సృష్టికర్తల విలాపం
- అల్లం నారాయణ

త్రిశంకు స్వర్గం. ఇంకా అయిపోని తాండవం. ఉత్త తాపడాల తో ఏమి ఒరుగుతుంది. ఉత్త పూతలతో ఏ రోగం నయమవుతుందని? అంతం కానిదిది. ఆరంభం కూడా కాదు. చాలా దూరం గడిచి వచ్చిన తర్వాత చేతివృత్తుల చేతులిరగడం గురిం చి కదా…చితి చింత. సిరిసిల్ల గుల్లగుల్లయిపోయి, వాకిళ్ల మొలచిన రాళ్లబండలైపోయిన బతుకుల్ల అగ్గిమల్లే ఎట్లా పుట్టిందో? ఎన్నని చెప్పను. ఏది మొదలు…ఏది కొస. బీసీల గురించిన ప్రవచనాలు పలుకుతున్న మహాత్ములారా! బాబూ! తొంభైమూడు కులాల పేరుపేరునా చదివినందుకు ధన్యవాదాలు. కానీ వాళ్లేం చేస్తారో? ఏమి చేసి బతుకుతారో? వాళ్ల బతుకు ఏ సర్కర్‌తీగలు తెగిన వీణలయ్యాయో? తెలుసా! పురి తప్పిన దారం ఎక్కడ తెగిపోతుందో? కూలిపోయిన మగ్గా న్ని అడుగు.

మాసిపోయిన బతుకును దారాన్ని అడుగు. నఖాసోడు ఏమి చేస్తడో! నపారోడు ఏమి చేస్తడో? గౌండ్ల ఏమి చేస్త డో? బైండ్ల ఏమి చేస్తడో? ఎవరి సుత్తి ఏ బండమీద రాగాలు పలుకుతుందో? ఎవరి పనిముట్టు ఏ అద్భుతాల గనులు తొలిచి ఏ సంస్క­ృతులు నిర్మించిందో? ఎవరి స్వేదం ఏ తిండిగింజను మంది నోట్లోకి చేర్చిందో-తెలుసా? నిజమే ఏ చెట్టు లెక్కినవాడు, ఏ గుట్టలెక్కినవాడు, గొర్లు కాసినవాడు, బర్లు గాసినవాడు, పశుపక్ష్యాదులను మచ్చిక చేసుకుని ప్రపంచానికిచ్చినవాడు, తొలి విత్తనం నాటినవాడు, తొలి దుక్కుదున్నినవాడు, తొలి కర్రుని కనిపెట్టినవాడు, బండిగీరెను చేసినవాడు, ఎర్ర ని నిప్పులో ఇనుమును వంచి ఇంధ్ర ధనస్సు లు చేసినవాడు, ఆయుధం అందించినవాడు, ఎందుకిట్లా విస్మ­ృతిలో, ఆత్మహత్యల్లో బతుకు సింగిడీలు ఆరిపోయిన దృశ్యాల్లో అంతమైపోతున్నాడో ఏమైనా తెలుసా! బాబూ!

ఒక గొర్రె పిల్లను భుజం మీద వేసుకున్న వాడా! నువ్వు ఏసు క్రీస్తువు కాగలవా?ఒక గొం గడిని అలంకారంగా ధరించిన వాడా! నువ్వొక గొల్లవాడివి కాగ లవా? ఒక కుమ్మరి సారె తిప్పిన వాడా! అదెన్నడో పురా వస్తు వయిందన్న జ్ఞానం కలదా! ఇప్పుడేమిస్తారని. చేతివృత్తుల సడుగులిరిసినవారెవరు?ఇప్పుడు మలాంపూతల ప్రవచనాలు పలుకుతున్నదెవరు? ఏ మార్కెట్‌ శక్తులు, ఏ పెట్టు బడిదారీ సామ్రాజ్యాలు ఎవరినడ్డి విరగకొట్టాయో! ఎవరినడిగి లెక్కలు తేల్చాలి.

చంపినవాడు, నష్టపరిహారం చెల్లించిన వాడూ ఒకడే గదా! అతను ఏ కులమైతేనేమి? స్వాతంత్య్రం రాకమునుపే ఏ పత్తి చేలు ఎవరికోసం పుట్టా యి. ఏ నేతగాని ‘మస్లిస్‌’ గుడ్డ ఎవరి పడకటింట సొగసులు పోయింది. సన్నటి తీగల గుడ్డలు నేసిన ఏ నేతగాడు ఎక్కడ బొంద తవ్వుకున్నాడో? తెలుసా! మహాత్ములారా! పుట్లకొద్దీ జనం కోటొక్క పరిసెగల భారతదేశంల వ్యవసాయమూ, ఆధారిత వృత్తులు అడుగంటిందెన్నడు? ఎవరి కోసం నల్లమందు పూలు పూసినట్టు? సాంప్రదాయ వ్యవసాయ సమాజాలలో చలినీళ్లకు తోడైన వృత్తుల వేడినీళ్లు ఎన్నడావిరైపోయాయి.

ఇప్పుడు బీసీ లకు, దళితులకు చేతుల్దితీసి మూతుల్ల పెట్టడానికి పోటీపడ్తున్న పెద్దలారా? కమ్మరి కొలిమి, సాలెల మగ్గం, చాకలిరేవు, మంగలి గద్దె, వడ్లధాతి, కుమ్మరి సారెలు ఎప్పుడు కూలిపోయినాయో… ఒరంజెక్కిన వాడూ, ఒడ్లు మలిచినవాడూ, భూమిని తలకిందు లుచేసి బువ్వ పంచినవాడూ… సహస్ర వృత్తులు, సమస్త చిహ్నా లు ఏ పెట్టుబడుల, ఏ సామ్రాజ్యాల, లాభనష్టాల ఖాతా పుస్తకా ల్లో కూలిపోయిన మరకలయిపోయిన, మరిచిపోయిన ఆశ్వాసా లైనాయో! తెలుసా? మూలం వెదకమంటున్నా… గాంధీకి జై… ఇప్పుడు కడుపు మాడినోడు.. కాలజ్ఞానం తెలిసినవాడు… రాకాసి బల్లిలా మింగు తున్న సమస్త జాతుల శత్రువు, సమస్త వృత్తుల శత్రువు, సమస్త మానవాళిశత్రువు మార్కెట్‌ మహమ్మారికి మూలధాతువులిచ్చిన పెట్టుబడి సామ్రాజ్యాలు కాదా!

లాభాల మైమరపులో మానవ జాతి సహస్ర సృజననూ చేవగార్చిన మహాసామ్రాజ్యాలు కాదా! మీరంతా అబ్బురపడుతూ, ఆకాశంకేసిచూస్తూ, నేలవిడిచి గాలి లో తేలుతూ… కంప్యూటర్‌ డబ్బాల గురించి డబ్బాలు కొడ్తున్న వాళ్లుకాదా! జీవంలేని సేవల్లో జీవాన్ని, మనిషి జీవనాన్ని, వేద నను చంపినవాళ్లు కాదా? ఇక కులవృత్తులు ఎక్కడ?చేతివృత్తులు ఎక్కడ, చెట్టెక్కేవాడె క్కడ? బతుకును చేదేవాడెక్కడ… మిస్టర్‌ క్లింటన్‌ తొత్తులు, మిస్టర్‌ బుష్‌ తొత్తులకు, అమెరికాలు, లండన్‌లు, జర్మనీ లు, జపాన్‌లు ఆదర్శాలయినవాళ్లకు… యూరోప్‌ డాలర్‌కు, అమెరికా డాలర్‌కు, దాసోహమంటున్న వాళ్లు… ఇప్పుడిక సహస్ర వృత్తుల, సమస్త చిహ్నాల ప్రతినిధులకు ఏమి వ్వగలరు. మళ్లీ గాంధీకి జై… ఆయన గ్రామ స్వరా జ్యం గురించి మాట్లాడారు. అవును నిజమే ఒకగ్రామం ఒక యూనిట్‌గా ఎట్లా స్వయం గా బతుకగలదో? వ్యవసాయం, చేతివృత్తి, కులవృత్తి ఎట్లా మమేకమై బతుకుతాయో అతనే చెప్పాడు.

అంబేద్కర్‌కీ జై! వ్యవసాయం, ఇతర వృత్తులు, దళితులూ, బీసీ లు, వారి మూలాలు, వారి జీవనాల అసలు స్వరూపం విడ మర్చి చెప్పాడు. కానీ…. స్వాతంత్య్రం వచ్చినదాదిగా ఒక పద్ధతి ప్రకారంగా గ్రామ స్వరాజ్యాన్ని గంగలో కలిపి, గాంధీ బోధ నలు తుంగలో తొక్కి, అమెరికాలకూ, అగ్రరాజ్యాలకూ దాసోహ మైన వారికి ఈ వృత్తుల మీద బతికే బీసీలు, దళితుల గురించి మాట్లాడే అర్హత ఉంటుందా? కంప్యూటర్లూ .. కఠిన జీవితాలూ ఒకే చట్రంలో ఇమడగలవా? ఎన్నడన్నా కులసమాజం ఒకటి ఉందని, ఈ కుల సమాజాలే భారతదేశంలో వర్గాల అంతరాల దొంతరలు సృష్టించాయని ఎవ రైనా గుర్తించారా?

కుల వృత్తులను, ఎస్సీలను, బీసీలను గుర్తించే దెవరు? వారి సంఖ్యఎంత, వారికి సంపద ఎంత? వారికి ఒక రిచ్చేదేమిటి? వారుపుచ్చుకునేదేమిటి? దామాషా పద్ధతిలో రాజ కీయాధికారం పంచగలరా! ఇన్నెందుకు ముఖ్యమంత్రీ, మాజీ ముఖ్యమంత్రీ! 70 శాతంగా ఉన్న దళితులకూ, బీసీలకూ అధికారం పంచి ఇవ్వగలరా? సృష్టికర్తలకు ఎందుకీ బిచ్చాలు, ఎందుకీ వరాలు. ఎందుకీ ఆశలు, బాసలు.. వాళ్ల ప్రపంచం ఎప్పుడో కూలిపోయింది. ఇక జరగాల్సింది పునర్నిర్మాణమే.

నోర్మూసుకోండి…
- అల్లం నారాయణ

ప్రపంచ బ్యాంకు రుణాలొస్తు న్నాయి. అభివృద్ధి పధాన పయనిస్తున్నప్పుడు ఇందిరమ్మ ఇళ్లు తీసుకోండి, నిధులు పారుతున్నప్పుడు కాసుల గలగలతో అభివృద్ధి పధంలో మాత్రమే నడవండి… అందాకా…. కాస్త నోరు మూసుకోండి.

కొంచెం నోరు మూసుకుంటారా! ఆవల చాలా అభివృద్ధి చెయ్యాల్సి ఉన్నది. భూమిని చాప చుట్టాల్సి ఉన్నది. ఈ మహానగరం చుట్టూ రింగురోడ్డు మహాసర్ప పరిష్వంగాన్ని బిగించాల్సి ఉన్నది. కొంచెం ఆ గొణగడం… సణగడం ఆపుతారా! బుల్‌డోజ్‌ చేస్తున్న అభివృద్ధి పథ ఘట్టన ల్లో రణగొణ, గణగణ గంటల మోతల మధ్య మాటలెందుకు? వీరప్ప మొయిలీ కర్ణాటక అయినా ఆయనకు తెలంగాణ నాడి బాగా తెలుసు. తెలంగాణ ఆత్మలు మాట్లాడుకుం టున్న ఘోషలూ తెలుసు. అందుకే ఛీ అని కొందరు పనిలేని వాళ్లు ప్రేలాపనలు చేసినా తెలంగాణకు రెండో ఎస్సార్సీయే పరిష్కారం అంటే అని వుండవచ్చు కాక.

అయినంత మాత్రాన. మీకేం తెలుసు. ల్యాంకోహిల్స్‌లో నూరంతస్థుల మేడమీద మేడకట్టి హైదరాబాద్‌ నగారాన్ని సుందరనం దనంగా చేస్తున్న లగడపాటి రాజగోపాల్‌.. విజయవాడ నుంచి వస్తేనేమి అయనకూ తెలంగాణ గురించి స్పష్టమైన నూరంతస్థుల ఎత్తుగల ఉన్నతాభిప్రాయాలున్నాయి. ఆయన మాటలు వినపడడంలేదా ఎందుకీనస. రవీంద్రనాధ్‌రెడ్డి అనే కడపమేయర్‌ క్రాంతి దర్శి. ఆయనకు కూడా తెలంగాణ మీద ఎంతప్రేమో చూడండి.

తెలంగాణ వస్తే మావోయిస్టుల రాజ్యం వస్తుందని ఆయన ఎంత భవిష్యత్‌ వాణిని వినిపిస్తున్నారో వినపడడం లేదా కడప అయినందువల్ల ఆయనకు తెలంగాణ సమస్యలు ఎక్కువ అర్థ మవుతాయి కాదంటారా ! కడప కదా ‘ఫ్యాక్షనిజం’ తెలిసిన మని షి కనుక నక్సలిజం వద్దంటారు. నక్సలైట్లు రాజ్యానికి వస్తే… రింగురోడ్డు వస్తుందా? వేల వేల ఎకరాల్లో ‘సెజ్‌’లు వస్తాయా? పాపం పేద పేద సారీ.. సారీ.. పెద్ద పెద్ద కంపెనీలు ఇన్ఫోసిస్‌లు, సత్యంలు, మేటాస్‌లు, పోలారిస్‌లు, మైక్రోసాఫ్ట్‌లు, ఛప్పన్నారు కంపెనీలకు అడిగినా అడగకున్నా భూములిచ్చి అభివృద్ధి చెయ్యగలరా? అసలు అభి వృద్ధి అంటే వారికి తెలుసా! అంతెందుకు! సరే! విజయవాడ లగడపాటీ, కడప రవీంద్ర నాథ రెడ్డీ అట్లా ఉంచండి.

పేరుకు ‘చిన్నా’రెడ్డి అయినా పెద్ద మనసుతో ఆయన ఎట్లా ఉన్నారో? టీఆర్‌సీసీసీ పెట్టిందెవరు? ఆయనే. చంద్రబాబు రాజ్యంలో ఉన్నప్పుడు తెలంగాణకు జరు గుతున్న అన్యాయాలపైన కత్తులు దూసి, సాముగరిడీలు చేసిం ది చిన్నారెడ్డికాదా? అభివృద్ధి పథంలో ఒక చిన్న మంత్రి పదవి ఇచ్చేసరికి ఆయన కళ్లు తెరుచుకోలేదా! ఒక్క మంత్రి పదవి ఎట్లా అభిమృద్ధికి రాచబాటలు వేస్తుందో? చిన్నారెడ్డిని అడగండి. ఆయన మాట్లాడిందాంట్లో అర్థం పర్థం వుంది. పనికిమాలిన మాటలు ఎందుకు మాట్లాడతారు? ఏదో ఒక ఎముక దొరకకపోతుందా? తెలంగాణ తలనొప్పి ఎందుకు.

జీవన్‌రెడ్డి కరీంనగర్‌జిల్లా నాయకుడుకాదా? ఒకప్పుడు ఆయనకు కూడా తెలంగాణ ఎంత ఆవేశపూరిత మైన, అభాగ్య ప్రాంతంగా కనిపించింది. తెలంగాణ ఆకాంక్షల నిప్పురవ్వలో ఆయన ఎంతజ్వలితజ్వాలగా ఉండేవారు. ఇప్పుడు చూడండి. రంగారెడ్డిలో నూరంతస్థుల అభివృద్ధి. కరీం నగర్‌లో, ఆదిలాబాద్‌లో… అంతెందుకు తల్లి పాలింకిపోయిన పాలమూరులో శరవేగంగా జెట్‌ను తలపిస్తూ దూసుకుపోతున్న అభివృద్ధి ఆయనకు ‘ఏదైతేఉన్నదో’ కనబడ లేదా? తేడా చూడండి. ఒక్క మంత్రి పదవితో ఎంత కళ్లు విచ్చుకుంటాయో! మీరంతా కళ్లు మూసుకు పోయిన వాళ్లు.. అందువల్ల ఇప్పుడన్నా నోళ్లుమూసుకోండి.

తెలంగాణ అంటారా! అది ఎప్పుడైనా వచ్చిందా.. ఎన్నేళ్ల నుంచి బూర్గుల రామకృ ష్ణారావు గుర్తున్నారా! నెహ్రూ దగ్గరికి వెళ్లే దాకా… ఆయన కూడా ఏమన్నాడో మీకు తెలు సా! తెలంగాణ ఆంధ్రలో కలవడం నా బొంది లో ప్రాణం ఉండగా జరిగే పనికాదని.. ఏమ యింది తర్వాత. 1969 గుర్తున్నదా! మూడు వందలా డెబ్బై మంది చనిపోయారు కదా! ఏమయింది. చెన్నారెడ్డి సాబ్‌ గుర్తున్నాడా! ఏమయింది. ఇందిరాగాంధీ కాలం. తెలంగా ణ వచ్చిందా ఇక 2004 అంటారా! అవును అభివృద్ధి నిరోధక ప్యాంటుధారి, చంద్రబాబు పంచెధారులు రైతులకు వ్యతిరేకం. ఆయనను కదిలించాలంటే ఎత్తుగడలు ఉండాలా వద్దా.

అవును కాంగ్రెస్‌ పార్టీ కదా! వేశాం ఓ పాచిక. అయింది. గెలిచాం. అయినంత మాత్రాన.. అంత మహా విశ్వా సం పెట్టుకోవడం మీతప్పు.. తెలంగాణ అనడం వరకూ బాగా నే ఉంటుంది. తెలంగాణ అనండి కార్యదర్శులు తీసుకోండి. ఛైర్మన్లు తీసుకోండి. మంత్రిపదవులు తీసుకోండి. రింగురోడ్లు తీసుకోండి. ఫ్లై ఓవర్లు తీసుకోండి. ప్రపంచ బ్యాంకు రుణాలొస్తు న్నాయి. కాచుకోండి.

జలయజ్ఞంలో పారుతున్న నిధుల వర దను కనిపెట్టుకోండి. అభివృద్ధి పధాన పయనిస్తున్నప్పుడు జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్లు తీసుకోండి, నిధులు పారుతున్నప్పుడు కాసుల గలగలతో అభివృద్ధి పధంలో మాత్రమే నడవండి… అందాకా…. కాస్త నోరు మూసుకోండి. అయినా… కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇస్తుందా? ఎలా అనుకుంటారు. ఎస్సార్సీ కాదంటే రెండో ఎస్సార్సీ… అదీ కాదంటే ప్రణబ్‌ముఖర్జీ కమిటీ… అదీ లేదంటే ఏకాభిప్రాయం… రాజీనామాల చప్పుళ్లకు బెదరం… అదరం… నోరుమూసుకోండి… కాదంటే అమ్మ ఉంది… ఆ అమ్మకు కూడా… నెహ్రూ, ఇందిరాగాంధీల వారసత్వం ఉంది… మరీ కాదంటే బుందేల్‌ఖండ్‌ ఇస్తానన్న మాస్టర్‌ రాహుల్‌ను నమ్ముకోండి… లేదా! నోర్మూస్కోండి… తెలంగాణ లేదు…రాదు… ఇవ్వరు… ఇక మీ ఇష్టం. ‘నై’ తెలంగాణ.

‘శోష’ లిజం
- అల్లం నారాయణ

సారీ.. డియర్‌ లేట్‌ రాబర్ట్‌ ఓవెన్‌. సోషలిజం ఇంకెంత మాత్రం మాకు ఒప్ప దు. పెట్టుబడిదారీ దేశంలో ఒక పెట్టుబడి దారుగా.. సమాజ గర్భంలో పెట్టుబడిదారీ సమాజం తెచ్చిన అసమానతల, రెండు భిన్న ప్రపంచాల, పెరుగుతున్న అంతరాల మహా స్వరూపం నీకు అర్థమైనట్టుగా.. ఇన్నాళ్లకు మాకు అర్థం కానందుకు సారీ ఓవెన్‌.. అయితే మేం కమ్యూనిస్టులం.. కాదుకాదు మార్క్సిస్టులం.. ఒకరొకరుగా ఆఖరు దుర్గం గా భ్రమపడిన తల నిజంగానే పండిన స్వప్రకటిత మార్క్సిస్టు మేధావులు లొంగిపోతున్నారు. సామ్యవాదానికి ముందు పెట్టుబడి దారీ విధానం భారతీయ సమాజంలో ..కాదు కాదు.. బెంగాల్‌లో సామాన్యుడికి, పెట్టుబడిదారునికి, మధ్య తరగతికి జీవనప్రమాణాలు మెరుగుపరుస్తుందని, ఉపాధి కల్పిస్తుందని, ఉద్యోగాలిస్తుందని కామ్రేడ్‌ బుద్ధదేవ్‌ భట్టాచార్య(సింగూరు, నందిగ్రామ్‌ఫేమ్‌), ముందూ.. ఆయన వెనుక తోక కురువృద్ధుడు జ్యోతిబసు బయలు దేరారు.

ఇదేం ‘గ్రే ట్‌ డిబేట్‌’కాదు. సామాన్యమైన విషయం. ఎనభైఐదు సంవత్సరాల తర్వాత ఇక్కడ కమ్యూనిజం కళ్లు తెరిపించింది, పెట్టుబడిదారీ విధానం. అండ్‌ ద ఆడమ్‌స్మిత్‌ప్రివేల్స్‌. మార్క్స్‌దేముంది. కన్నంలోదొంగను కన్నం లో పట్టుకోవడం గురించి ఇప్పుడెందుకు? భారతీయ సమాజంలో సోషలిజం ఇంకెంతమాత్రం ప్రాసం గికం కాదు. చివరికి సుప్రీం కోర్టిప్పుడు మా తాజా రెవల్యూషనరీ. ఈ మాటకు కట్టుబడాలని రాజ్యాంగ పీఠికలో సోషలిజం మాట ఉండాల్సిందేనని చివరకు సుప్రీంకోర్టు డబ్బున్నోళ్లకు చుట్టాలుగా చట్టాలు చేస్తుందనుకుంటున్న రాజ్యాంగ యంత్రం ఇక్కడ మా కమ్యూనిస్టుల కన్నా ప్రగతి శీలకంగానూ, విప్లవకరంగానూ ఉన్నందుకు ఏదో కొందరం ఎంతో కొంత అబ్బురపడుతున్నాం. అయినా సోషలిజం, కమ్యూనిజం శ్రామికవర్గ విముక్తి అర్థాలు మారిన సందర్భంలో కదా జీవిస్తున్నాం. శ్రామికవర్గ విముక్తి సాధన గతి తార్కిక చారిత్రక భౌతికవాద చలన సూత్రాలంటే భారత దేశంలో అర్థాలే వేరుకదా!

లాభం, నష్టం గిట్టుబాటు, కూలీల ఆర్థిక అవసరార్థాల ఫాయిదా. అంతిమంగా జీవి త అవసరాల నుంచి కమ్యూనిజం కాని స్థితికదా! దశాబ్దాల అనంతరం. వలువలు విడిచి నగ్నంగా బయటపడుతున్నది. థాంక్స్‌ టు జ్యోతి ‘బాసు’.. ఇప్పుడిక భారతీయ శ్రామిక వర్గానికి కళ్లు విశాలంగా తెరచుకోవాల్సి ఉన్నది. కులం, లింగభేదం, మతం, ప్రాంతీయత, భిన్న సంస్కృతులు ఇవేవీ కమ్యూనిజం కళ్లకు కనబడని సామాజిక వాస్తవాలు. అస్థిత్వమూ, అస్థిత్వ, నేలవాసుల, మూలవాసుల ఉద్యమాలు కమ్యూనిజానికి సంకుచితాలయ్యాయి. కానీ, ప్రపంచంలో ఏ దేశంలో కన్నా భారతదేశంలోకదా! ఆర్థిక అసమానతలకు తోడు సామాజిక అసమానతలకు ‘సామ్యవాదం’ ఒక మంత్రం .ఇప్పుడిక దానికి కాలం చెల్లింది. ఓవెన్‌, ఆ తదనంతర తర్క, హేతు, మార్క్సిస్టు పండితులా రా! హెగెల్‌ ఎంగెల్స్‌, మార్క్స్‌.. నమస్తే.. చివరాఖరకు పెట్టుబడిదారీ వికృత వ్యవస్థ, మహాకాల్పనిక వైరుధ్యాలను పరమాద్భుతంగా చిత్రించిన ఛార్లెస్‌ డికెన్స్‌కూ ఒక సలాం. మీరు కాలం చెల్లిపోయారు.

సోషలిజం అంటే ఇప్పుడు అసమానతలు రూపుమాపే ఒక ఉద్యోగం. అది పెట్టుబడిదారీ వ్యవ స్థ మాత్రమే కల్పిస్తుంది. ఇదేదో తిరకాసు కాదు. తెలుసా! మార్క్స్‌. మా కనురెప్పలక్రింద విరిగిపడుతున్న కలల రెక్కల చప్పుడు మమ్మెల్నెంత నిస్సహాయతలోకి నెట్టిందో? తెలుసా! జ్యోతిబసు నీవెంట దశాబ్దాల తరబడి తిరిగిన ఎర్రదళం ఏ ఆశలు పోగొట్టుకున్నదో? చివరాఖరకు యూటూబ్రూటస్‌ కాదు కాదు సారీ! యూటూ జ్యోతిబసు. అయినా బెంగాల్‌లో, తెలంగాణలో ఎన్నడో చేతులు వేలాడేసిన కామ్రేడ్స్‌ కదా! సోషలిజం అమలవుతుందనో? అమలవుతున్నదనో భయాలెవరికీ లేవుకానీ.. రాజ్యం.. అధికారం మార్క్సిజాన్నీ, కమ్యూనిజాన్నీ ఎంతగా అధఃపాతాళంలోకి నెడుతుం దో? ఒక్క నందిగ్రామ్‌ చాలదా! అధికారాన్ని, అహంకారాన్నీ, అధిష్ఠానాన్నీ, దర్పాన్నీ, దౌర్జన్యాన్నీ ప్రశ్నించాల్సిన కమ్యూనిస్టులు (పేరుకే) నందిగ్రామ్‌లో ప్రదర్శించిన విలువలు రాజ్య స్వభావం అందరిదీ ఒక్కటే అని చాటలేదా!

అసహనం అవధులు మీరిన చోట చివరికి అత్యాచారాల వార్తలు విని, రాజ్యాంగయంత్రం అది బూర్జు వా పార్టీలదైనా… కమ్యూనిస్టులదైనా ఒకటే అని చాటినప్పుడు మ్రాన్పడిపోవడం ప్రపంచం వంతు కాలేదా! ఒక్క సోషలిజం కోసం కదా ఎనిమిదిన్నర దశాబ్దాల త్యాగాలు, తన్నులు, చిత్రహింసలు, ఎన్‌కౌంటర్లు, కాల్పులు, ఖననాలు, జైళ్లు, ఊచకోత లు, పోలీసుకాల్పులు, తడిఆరని గాయాలు, ఎర్రజెండాల బారు ఊరేగింపులు, ఉద్వేగాలు, ఉచ్ఛ్వాస నిశ్వాసలు… జీవితాలు ఫణంగా పెట్టిన వారెందరు? కుటుంబాలు కోల్పోయిందెందరు, కనలి కనలి, పొరలి, కెరలి నెత్తుటి రహదారులైందెవ్వరు? త్యాగా ల బాటలేసిందెవరు? మిస్టర్‌ జ్యోతిబసు… సోషలిజం ఇక ఊకదంపుడుకు కూడా పనికిరాని ఒక విసర్జన పదం నిషేధ పదం అయినప్పుడు… పేదల గురించి మాట్లాడే అర్హత కోల్పోలేదా? అవునిప్పుడు… నందిగ్రామ్‌, సింగూర్‌ల వెనకగల బుద్ధదేవ్‌ల, జ్యోతి’బాసు’ల వికృత స్వరూపాల మూలాలు తెలియడం ముదావహమే. సెలవు కామ్రేడ్స్‌… అలసిపోయాం. సోషలిజం ఎవరికితోచినట్టు వారు వ్యాఖ్యానించే, ఎవరికి తోచినట్టు వారు మార్చుకునే టోపీ అయితే కాదు.

ఎవ్రీబడీ క్రైస్‌…
- అల్లం నారాయణ

తలుపు తోసుకుని మృత్యువు అనాగరికంగా, అమెరికాలాగా వస్తుందని ఊహించి ఉండమేమో కదా! కిరణ్‌ దుఃఖం మా కుటుంబాన్ని వదలడం సాధ్యమా! పనిలో సరే! పదిమందిలో సరే! భ్రాంతిలో ఏకాంతంలో జ్ఞాపకాలు జ్ఞాపకాలుగా, శకలాలు శకలాలుగా అంతూ దరీలేని శోకం వెన్నాడి ఉండడం మేమెప్పుడూ ఎరగం. సాదాసీదా మనుషులం. యవ్వన ప్రాభవాల్లో తెలిసిన మృత్యువుతో సయ్యాటలాడిన వాళ్లం. తెలిసిన శత్రువుతో యుద్ధాలు చేసిన వాళ్లం. చెట్లకు కట్టిన తరువాత కూడా కరుడుగట్టిన రాజ్యానికి కరుణ కలుగుతుంది. ఇది స్వదేశీ మృత్యు రహస్యం అని తెలుసుకోగలిగిన అనుభవం పొందిన వాళ్లం. ఎల్లలెరగని సరిహద్దుల్లో జ్ఞాత, అజ్ఞాత బతుకుపొరల్లో తృటిలో, కనుమెరుపు చాటున బతికి బట్టకట్టిన మామూలు మనుషులం.

పల్లెటూరి వాళ్లం.. పట్నం ఐమూలల్లో ఒదిగి ఒదిగీ, నిలబడీ, కలెబడీ నిటారుగా మా కాళ్లమీద, ఈనేలమీద ఊని నిలుచున్నవాళ్లం. ఇట్లా ఒక ఊరూపేరూలేని, చిరునామాలేని, రూపం, సారంలేని, అదృశ్య మృత్యువికటాట్ట హాసానికి కన్నపేగు బంధాన్ని బలిపెట్టుకుంటామని ఊహించి ఉండని ఒక దిగ్భ్రాంతి. ఆశనిపాతం, అచేతనం, చేష్టలు దక్కి నిలుచున్నాం ప్రపంచం ముందు నిష్చేష్టులుగా దుఃఖభారం తోడుగా.. కిరణ్‌ అంటే ఏమిటి? మా అన్నా వదినలకు ఒక్క కొడుకేనా? బేటన్‌రోగ్‌లో వాడి ఉనికి ఉంది. లూ సియానా యూనివర్సిటీ ల్యాబ్‌ లో వాడి ప్రతిభ వెల్లడికాకుండా దాగి వుంది. విసిరేసినట్టుగా ఐమూలగా ఉన్న వాడి అపార్టుమెంటు ముందు నాటిన ఒక మిరపచెట్టు.

జీవితం పట్ల, మొక్కల పట్ల, పిల్లల పట్ల, వాడి పురాజ్ఞాపకం లాంటి గాజులపల్లె, ఆ చిన్నపల్లెలో కురువృద్ధులైనా, ఎల్లవేళలా వాడి సజీవ జ్ఞాపకంలో నిలిచిన నానమ్మా, తాతయ్యల హీరోచిత జీవన పోరాటం పట్ల తపన ఉంది. వాడు అమెరికాలో తన సహచరులకు, సహోపాధ్యాయులకు, గైడ్‌లకు చెప్పిన వాళ్ల నాన్న, ‘కాక’ల జ్ఞాపకాలు, ఊరి జ్ఞాపకాలున్నాయి. తెలుసా! కిరణ్‌ను మేము తెలుసుకోలేకపోయాం. ఒక నిరక్షరాస్యుడైన తాతకు మనవడు డెబ్భైరెండువేల మైళ్ల దూరంలో అంతటి ప్రతిభ గల వాడవుతాడని ఊహించి ఉండగలమా! కిరణ్‌ ఒక వ్యాప్తి. పూలవనంలా తన చుట్టూ వ్యాపించిన జీవన పరిమళం. కుటుంబ సంస్కారం నుంచి వచ్చిన మం దిలో పిల్లవాడు. మెదడు దాని పరిణామాలు.

మెదడు దాని సంక్షోభాలు. బ్రెయిన్‌లో ట్యూమర్‌లు, డిప్రెషన్‌ల లోకంలో, నైట్రేట్‌లు, రసాయన పరిణామాలకు మొత్తంగా మనసు సంక్షోభాల మూలాలకోసం వెతుకు లాడిన, దేవులాడిన కిరణ్‌ పరిశోధనలు, ఆ ‘ ఔట్‌లైన్‌’ చూసినప్పుడు మాకు వాడంటే అంతుబట్టలేదు. ‘మా కొడుకుని మేము అచ్చంగా తెలుసుకోలేకపోయామని ‘రాజన్న రోదిస్తున్నాడు. నిజమే… కిరణ్‌ లేడు. వాడి పరిశోధనా పూర్తి కాలేదు. కానీ,.. వాళ్ల ‘గైడ్‌’ ఇట్లా అంది. “కిరణ్‌లాంటి కలివిడి మనిషి తనకోసం కాకుండా పదిమందికోసం తపన పడిన మనిషి. అందరి కష్టసుఖాలూ పంచుకున్న మనిషి. అన్నింటికన్నా ముఖ్యంగా గొప్ప పరిశోధన ప్రపంచంలో అతి తక్కువమంది మాత్రమే చేస్తున్న పరిశోధన అది అర్థాంతరంగా ఆగిపోవడం. దుఃఖం కలిగిస్తున్నది. కిరణ్‌ను మనం పొందలేం. పోగొట్టుకున్నాం…” కిరణ్‌కు నల్లగొండలో శ్రీనివాసరెడ్డి వాళ్ల మిత్రబృందం ఉన్నారు. వాళ్లు ‘కిర ణిజం’ ఒకటి ఉందంటారు.

కిరణ్‌ ను చూడడానికి వచ్చి వాళ్లు అంతులేకుండా దుఃఖ పడడం చూసినాక కిరణ్‌ విలువ ఇంకా ఎక్కువ తెలిసింది. లూసియానా యూనివర్సిటీలో ఆ కెమిస్ట్రీ ల్యాబ్‌లో కిరణ్‌కోసం ఒక ఎర్ర కుర్చీ ఎదురుచూస్తున్నది. వాడి టేబుల్‌ మీద రెండు పుస్తకాలున్నాయి. వాడి భార్య స్వప్న కొనిచ్చిన కానుకలు. 9/11-నోమ్‌ ఛామ్‌స్కీ, ‘ఎ కన్ఫెషన్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ హిట్‌మాన్‌’ (దళారి పశ్చాత్తాపం) చేగువేరా- మోటార్‌ సైకిల్‌, డైరీస్‌, డీవీడి. అవిమాత్రమే మాకిప్పుడు మిగిలాయి. కిరణ్‌కు అమెరికా తెలుసు. నిర్వికారంగా ఉండే, సంస్క­ృతి లేని, మనిషితనం లేని, క్రూరమైన ఆర్థిక ప్రయోజనాలు గల మిడిమేళపు దేశంగా అమెరికా వాడికి బాగానే అర్థమయింది. ‘కత్రినా’ తుఫాను వచ్చినప్పుడు… ‘కాకా’ ఏం దేశం ఇది. నెలల తరబడి వందలాది మంది నల్లవాళ్ల శవాలు నీళ్లల్లో నానీనానీ.. ఇదొక ఛండాలమైన దేశం అనేవాడు. కానీ… వాడి మృత్యుదూతలూ…వారే అయితే అంతకన్నా విషాదం వాడికీ, మా కుటుంబానికీ ఏమి మిగిలి ఉంది.

కిరణ్‌… చంద్రశేఖర్‌రెడ్డి… అమెరికా లో డాలర్లు కోసుకోవడానికి వెళ్లిన వాళ్లూ కాదు, దురాశా, కోటి సంపాదనకోసమూ వెళ్లినవాళ్లూ కాదు. పరిశోధనావకాశాలు వెదుక్కొంటూ వెళ్లిన విద్యార్థులు వాళ్లు. ఒక చిన్న వినతి. మా కుటుంబం డాలర్లకోసం, కోట్లకోసం, బిల్డింగ్‌ల కోసం వెంపర్లాడినదికా దు.మేం అక్షరాన్ని నమ్ముకుని బతికిన వాళ్లం, బతుకుతున్న వా ళ్లం. అల్లం రాజయ్య, శోభారాణిలకు ఆ ఉద్దేశ్యమూలేదు. వాళ్లిప్పుడు కొడుకును పొగొట్టుకుని దుఃఖంలో ఒకే విలాపం. ఇట్లా ఎందుకయ్యింది. అవునూ… నిర్వికారంగా బాడీ బ్యాగులను స్వీకరించే అమెరికాలాంటి దేశం నుంచి ఒక పెట్టెలో వచ్చిన మా కిరణ్‌ బతికి లేడంటే నమ్మలేకుండా ఉన్నాం పుట్టెడు శోకం… మాక్సింగోర్కీ స్వర్ణ పిశాచి నగరంగా చెప్పాడు. ఏబీకే మనవడిని పోగొట్టుకుని అమెరికా క్రూరవిలాపం గురించి రాశారు.

అల్లంరాజయ్యకు, ఆయన సోదరులకు అమెరికా క్రూర స్వభా వం గురించి తెలుసు. పలకరించడానికి వచ్చినప్పుడు, కేసీఆర్‌ ఇట్లా అన్నారు. “అమెరికా స్క్వీజ్‌ చేస్తుంది”. అవును అమెరికా మా ఆనందాన్ని ‘స్క్వీజ్‌’ చేసింది. మా దుఃఖాన్ని కూడా. ‘కాకా’ అన్న పిలుపు చెవుల్లో మార్మోగుతోంది. ఇది మా ఒక్కరి దుఃఖమా! అమెరికా వెళ్తున్న పిల్లల కోసం ‘తపన పడ్తున్న’ అందరి శోకమా? ‘కాకా’…కిరణ్‌…ఈ నాలుగు వాక్యాలు రాయకుండా మరేదీ రాయలేని అచేతనలో..పుట్టెడు జ్ఞాపకాలతో కంటికి కడివెడు… …ఒకానొక డిసెంబర్‌ చలిరాత్రి వాడి కోసం గద్దర్‌ మామ య్య, వీవీ మామయ్య, నీ కాకలు, వాళ్ల దోస్తులూ ముప్పై రెం డు ఛానెళ్లూ ఎదురుచూస్తుండగా మా కిరణ్‌ మృత్యుశీతలమై ఒక పెట్టెలో పడుకుండిపోయి గడ్డకట్టిపోయి వచ్చాడు… కాకా…మళ్లీ రారా మాకోసం.. ఈ దుఃఖం… ఎవ్రీ బడీ క్రైస్‌.

విరోధాభాస
- అల్లం నారాయణ

కడుపులో పుట్టెడు జ్వరం-నలభై ఐదు డిగ్రీల ఎండకాస్తున్నట్లు- ‘విస్వూయస్‌’ అగ్నిపర్వతం అంటుకున్నట్టు. జ్వరమాని కొలమానం దాటుతున్నది-నూటా ఆరు డిగ్రీల జ్వరం.మెదడులో పేలుతున్నవి జ్వరమృదంగపు ధ్వనుల ప్రేలాపనలు.

‘అవ్వా’ నేను బతుకుతానా! డాక్టర్‌ లేడా?

దవాఖానా ఎంత దూరం.

అవునూ.. ఆ రహదారి మీద అటు ఏడు కోసులూ, ఇటు ఏడు కోసులూ నరసంచారం లేని దిక్కులేని ఆ అడ్డరోడ్డుమీద చెట్టుకింద కూచున్నది తల్లి. కొడుక్కి వైద్యం కావాలి. మందు గోలీ కావాలి. ఒక వైద్యుడు కావాలి. ఒక ఊరడింపు కావాలి. ఉపశమనం కావా లి. కొడుక్కేమయినా అయితే భరించగలదా! ఆ తల్లి కుంతి కాదు. పిల్లల్ని కనిపారేసి పట్టించుకోజాలని ‘బ్రిట్నీస్పియర్స్‌’ కూడా కాదు కన్న పేగు కదులుతున్నది సశేషం. ఇంతకీ ఆ కొడుకు బతుకుతాడా? జ్వరం వస్తే ఆస్పత్రి ఎంతెంతదూరం!

(ఆదిలాబాద్‌ ఏజెన్సీలో వందలమంది వైద్యం అందక, జ్వరాలతో పిట్టలు రాలినట్టు రాలిపోయారు)

ఏలిక ప్రసంగిస్తున్నాడు. అందరికీ ఆరోగ్యశ్రీ, కడుపునొచ్చినా.. కాలునొచ్చినా.. పుట్టిన ప్రతి మనిషికీ ‘ఆరోగ్యశ్రీ’ ఖజానాలోని ప్రతి పైసా పేదలకోసమే. పేదలకు మాత్రమే ఈ ఖజానాలున్నా యి. సాగుతున్నది ప్రసంగం. జ్వరం రానంతవరకు బాగానే ఉం టుంది. బహుశా ఏలికలకు జ్వరాలు రావు. వచ్చినా ఆస్పత్రులే పరిగెత్తుకొస్తాయి. కనుక ఏలికలకు జ్వరతీవ్రత తెలిసే అవకాశం లేదు. అరవై ఏళ్ల నుంచి ఈ మాటలు ఏలికలనేకమంది మాట్లాడుతూనే ఉన్నారు కానీ….

చలి.. శీతలం. గడ్డ కట్టుకుపోతున్నడు బిడ్డడు నిండా పదేళ్లు లేవు. కమ్ముకుంటున్నది. కొంకర్లుపోతున్నది శరీరం. ఆచ్ఛాదనల చిరుగులు చలికప్పుకోను వెచ్చనిదేదీలేదు జ్వరం వచ్చినా బాగుండు.. వేడిగానన్నా ఉండు ఇప్పుడేం చేయాలి? అసలే డిసెంబర్‌, ఆరు బయలు నెగళ్ల బతుకునుంచి, అడవి ఎలుగళ్ల బతుకునుంచి చలి మంటల నుంచి చదువుకోసం వచ్చి.. ఈ నరకం లాంటి వసతి గృహంలో చిక్కుకున్నది బాల్యం పొద్దున చారునీళ్లు, మధ్యాహ్నం పురుగుల అన్నం- సాయంకాలం కారపు నీళ్లు. కడుపులో చలికి బిగిసిన ఆకలి గడ్డకట్టింది. కొంచెం ఏడుపు.. సుమ్మర్లు తిరుగుతున్నది. అమ్మ జ్ఞాపకం వస్తున్నది. డొక్కలు ముడుచుకుని, నట్టనడి శీతాకాలం లో ఆ పిల్లల గురించి ఇంకేం చెప్పను. అమ్మకు దూరంగా, అమ్మలాంటి ఇంటికి దూరంగా చలి నెగళ్లకు దూరంగా ఈ దుర్భ రంలో జీవిస్తున్న ఆ పిల్లవాడికి కడుపులోకి కొంత అన్నంకావాలి. తెల్లటి, మెత్తటి, పువ్వులాంటి మెతుకులు కావాలి..కప్పుకోను వెచ్చటి దుప్పటి ఒకటి కావాలి….

దుప్పటి దొరికేనా?

వసతిగృహాల్లో నిద్రిద్దాం… ఆ పిల్లల బాధలను మనమూ అను భవించి పలవరిద్దాం… వసతిగృహాల పిల్లలు మన భావిపౌరులు స్పీకర్‌ ప్రవచించారు. రాజకీయ నేతలు దండుకట్టారు. కొన్ని ఫొటోలు (పిల్లలకి కొంత వినోదం అదీ బహుశా విషాదవినోదం). సరిపోయింది ఉద్ధరణ జరిగిపోయింది. ముఖ్యమంత్రి ప్రతీది పేద ల పరమేనన్న పునరుద్ఘాటన చెవుల్లో మార్మోగుతున్నది. 60 ఏళ్లు గా ఆ వసతిగృహాల్లో పిల్లలకు దుప్పట్లు లేవు. అదంతే.. ఇప్పుడైనా… ఎప్పుడైనా ఆ వసతిగృహాలు అందలం ఎక్కేనా? సందేహమే.

ఉపసంహారం. ఏలికలు పట్టించుకోనివారిని ప్రతిపక్ష నేతలు పట్టించుకుంటారు. ఎన్నికల రుతువులో ఇదో బాధ్యత. వేల దుప్ప ట్లు పంచడానికి ప్రతిపక్షనేత తయార్‌ (పాపం శమించుగాక ఆ తొమ్మిదేళ్లూ వసతిగృహాలు అట్లాగే ఉండిఉంటాయి. అనుమాన మెందుకు?)

జీడీపీ కొంచెం తగ్గింది. చిదంబరం హెచ్చరిస్తున్నాడు. అయినా అప్రతిహతంగా తొమ్మిది పైబడిన అభివృద్ధిరేటు. ఖరీఫ్‌ బాగుంది. పంటలు బాగా పండుతున్నాయి. జలయజ్ఞం వరదలు వరదలై పారుతున్నది. ఇళ్లుకూడా అదనం. పింఛన్‌ పైస లు తిన్నంత తాగినంత. సెన్సెక్స్‌ ఊర్థ్వముఖంలో హద్దులు దాటి 20000 అయ్యింది. హైదరాబాద్‌లో ఎకరా 14 కోట్లు, గజం లక్షన్నరకు అమ్ముడుపోయింది. కార్పొరేట్‌ కంపెనీలు లాభాలు ప్రకటించాయి. ప్రపంచమే శ్రీమంతంలో మనకు దాసోహమంది. యురోపియన్లు, అమెరికన్లు, టైగర్‌నేషన్స్‌ వాళ్లూ ఒకరనేమిటి? అందరూ భారత్‌ వైపే చూస్తున్నారు. అంతా పెట్టుబడులతో ముం దుకు దూసుకొస్తున్నారు. అంతాబాగుంది. ఇక్కడి నానాజాతి కమ్యూనిస్టులకు, విప్లవకారులకు తొమ్మిది దశాబ్దాల చరిత్ర ఉంది. రాజకీయ పార్టీలకి నూరేళ్ల చరిత్ర ఉంది. సోషలిస్టు కబుర్లకు దశాబ్దాల చరిత్ర ఉంది. స్వాతంత్య్రం వచ్చి అరవై ఏళ్లయింది. కొన్ని ప్రణాళికలు గడిచిపోయాయి. భారత్‌ వెలిగిపోతోంది. మీ ఇంట్లపీనిగెల్ల నా కొడుక్కు జ్వరం వచ్చింది ఒక్క మందుగోళన్నా ఇయ్యండయ్యా పాపం శమించుగాక..

‘నాతోని గాదు’
- అల్లం నారాయణ

నిజామ్‌కు మొక్కుమంటవా !

దొరా !

నీబాంచెన్‌.

నిజాం ఏడేడు తరాలకు

దండేసి దండం పెట్టమంటవా !

ఆయనకే కాదు. తెలంగాణను పొరుకపోడుచేసిన జాగీర్దార్లు, జమీందార్లు, దేశ్‌ముఖ్‌లు, రెడ్లు, వెలమదొరలకు కూడా సాగిలపడి సలామ్‌ చెయ్యమంటవా ! ఎన్నేండ్లు మొక్కమంటవు.ఎన్నేండ్లు బాంచెగిరిచెయ్యమంటవ్‌.

నిజాంది.. నీదీ, నీవెనకటి జాగీర్దార్లది దొరలది ఒకే జాతి గద. దొరా ! తెలంగాణ రాకముందే మేమేందో? ఎలాన్‌ జేసినవ్‌. మంచిది. కానీ..

మావీపుల మీద బండలెత్తి, నొసట వెట్టిరాతలు రాసి గోళ్లూడ గొట్టి పన్నులు వసూలు జేసి, ఇజ్జత్‌ పజీతజేసి, రాసిరంపానబెట్టి, బరిబాత బతుకమ్మలాడిచ్చి, తల్లి సన్నుపిండి పాలు మురుక చూసిన నిజామూ, నువ్వూ, ఆరారు పదారుమంది దొరల జాతికి ఈ గులామ్‌ గిరీ ఎన్నొద్దులు చెయ్యమంటవ్‌.

ఎన్ని కాలాలు. ఎన్ని శతాబ్దాలు.

నిజాం మంచోడె. మమ్ముల్ని నిలువునా ముంచిన దొరలూ మం చోళ్లె. కని దొరా ! ఆర్ట్స్‌ కాలేజీకి రాళ్లెత్తిన కూలీలకు గిట్టిందెంత? పోగొట్టుకున్నదెంత? నిజాం కట్టిన నీటి ప్రాజెక్టుల కింద పొందిం దెంత ? పోగొట్టుకున్నదెంత ? నిజామ్‌ అట్టహాసాల, ఆడంబరాల, విలాసాలముందు వెలతెల బోయిన జీవనమెట్టిది? నిజామ్‌ వారసులయిన నీ జాతి కచ్చడాల ముందు ఉరికిన సాకలి, మంగలి ఉచ్ఛ్వాస నిశ్వాసల ఆయాసం కొలమానం ఎంత!అవమానం పాలెంత ?

తెలంగాణ అంటె ఏంది. ఒక ఒడవని కత. ఒక తెలియని చరిత. విస్మరించిన గతం, వి«ధ్వంసమయిన వర్తమానం. ఇప్పుడు నడుస్తున్న చరిత్ర నీదికాదు. మాదికాదు, నిజమే. ఒప్పుకుంట. ఆ మాట కొస్తే ఈ భూమి పుత్రుల, మూలవాసుల చరిత్రను మాయజేసి, మతుపరిచ్చిండ్రు.నిజమేనంట.

ఎవడి పులగం పడి ఈ తెలంగాణ పొందిచ్చిండో, ఎవడివేలు ఈ తెలంగాణ జాతికి దారి చూపిచ్చిం దో? ఎవరి రక్తమాంసాలు ఈ తెలంగాణ కోసం తండ్లాడినయో, చరిత్ర లేదు. ఒక తప్పుడు చరిత్ర తెలంగాణ అస్తిత్వాన్ని కబళిం చిందీ నిజమే. కానీ.. నీ బాంచెన్‌. నిజాంను ఒప్పుకొమ్మంటే ఎట్లా ఒప్పుకుంట. ప్రాణాలు తీసిన ఆ నరరూప రాక్షసుల నీలినీడలు మరచిపొమ్మంటే ఎట్లంట ? కొన్ని నెత్తుటి కాల్వలు పారిచ్చి గదా నిజాం పంటకాల్వలు పారిచ్చిండు.

కొన్ని కొనవేటి గోళ్లూడగొట్టికదా నిజాం నగిషీలు చెక్కిన ఆ భవంతులు కట్టిచ్చిండు. ఏభాషను ఉద్దరిచ్చిండని, ఏ సంస్క­ృతిని బతకనిచ్చిండని. ‘దక్కానీ’లమీద ‘లక్నోవీ’ ల పెత్త నం. తెలంగాణం మీద రాజభాష పెత్తనం. వలసపాలకుల నమ్మిన బంటుగా అటు తెల్లదొరలను, ఇటు తైనాతీలను మా మూపుల మీద నిలబెట్టికదా ఆ రాచరికపు గుంటనక్క తెలంగాణనేలిండు. అంతర్గత వలసలకు ఆయన కారణం కదా! ముల్కీలకు ముందు అంగ్రేజి నేర్చిన ఉద్యోగులను తెచ్చింది ఆ నిజాం కాదా? ఏది మూలం? తెలియదా? నిజాం రాజ్యాన్ని ముక్కల కింద ముష్కరులకు రాసిచ్చిందెవరు? వలస పాలకులకు వంగి వంగి దండాలు పెట్టి గులాం గిరీ చేసి సలామ్‌ చేసిందెవరు? చెరువులు తవ్విండు సరే ! ఆ చెరువుల కింద బండలైన బతుకులెవరివి? ఏ కాస్తు కింద, ఏ కిస్తీలకింద ఏ సర్ఫెఖాస్‌ల కింద ఎవరు రాజ్జెమేలిండు? తెలంగాణను ఎన్నేండ్లు ఎనకకు మళ్లించిన ఒక తరతరాల బూజునెట్లా తలకెత్తుకొమ్మంటవు.

నిజామ్‌ ఒకవ్యక్తికాదు గదా.. ఒక వ్యవస్థ కదా. నిజమే. త్యాగాల బాట.. తండ్లాటయ్యింది. విశాలాంధ్ర, ప్రజారాజ్యం..అంతర్గత వలసల అడ్డదారి అయింది. అస్తిత్వం వెదుకులాటలో అన్నీ సక్రమమే కావొచ్చు. అస్తిత్వం అంటే మూకుమ్మడి మూడున్నరకోట్లమంది ఉద్వేగ, ఆకాంక్షల సమాహారమూ నిజమే. మనదిగాని మన చరిత్ర. విస్మరించిన చరిత్ర వక్రీకరించిన నూరు అబద్ధాల అడ్డగోలు చరిత్ర ధిక్కరణా కావాల్సిందే. కానీ… తెలం గాణల తండ్లాడింది మేము. తెలంగాణల డొల్లాడింది మానెత్తురు. పారాడింది మామూలాలు. నిజాంనెందుకు తెస్తవు నానెత్తుటి ఆశ్వాసాల ముందుకు. తెలంగాణ ఒక నెత్తుటి పువ్వు. నిత్య పోరాటాల నవయవ్వన ఝరి. నిత్యగాయాలనది. త్యాగాల చాలు బోసిన ఒక బొడ్డుతాడు సంబంధం. గతానికీ, వర్తమానానికీ కత్తుల వంతెన కట్టిన ఓ వికసించిన విద్యుదుత్తేజం. ‘తీగలను తెంపిన’ ముసలినక్కల మీద ‘చుట్టుముట్టిన’ దండోరా ప్రతిధ్వని. నాకీ నిజామ్‌ చుట్టరికమెం దుకు.

వలసపాలనపై కోఠీలో గుండుపేల్చిన తుర్రెబాజ్‌ ఖాన్‌,ఆబిడ్స్‌ల నవాబుల రాక్షససేనపై కలం కత్తిదూసిన యోధుడు షోయబుల్లాఖాన్‌, దేశ్‌ముఖ్‌లు, జాగీర్దార్ల గల్లాపట్టి పోరాట పతాక ఎత్తి న బందగి చిందిన రక్తం, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, అంతర్గత వలస పాలనపై దండెత్తి గుండ్లకు గుండెలొడ్డిన ఎన్నం ఉపేం దర్‌ సహా 370మంది అమరవీరులు, హుస్నాబాద్‌ స్థూపం మీది పేర్లు-ఈ నెత్తుటి వారసత్వం ఒక చరిత్ర. అది తెలంగాణలో నిటారుగా నిలుచున్న మూడుస్థూపాల వారసత్వం. రేపటి తెలంగాణ పుడమితల్లి వారసత్వం. దొరా! ఇంగ నావల్ల కాదు. మేర్సె నహిహోతా. నిజామ్‌కు నేను హర్కిస్‌ మొక్కలేను. ఇగ ఇవ్వాల్టితో నీకు సాగిలపడలేము. మన్నించుదొరా. మా తెలంగాణ వేరయిపోయింది. షోయబుల్లాఖాన్‌ వారసులం,బందగి ప్రేమికులం, ఎన్నం ఉపేందర్‌ సహచరులం, పక్కా తెలంగాణవాదులం చెప్తున్నం. జరవిను.