jump to navigation

తెలంగాణ జీవన అస్థిత్వం – బతకనేర్చిన కవుల ద్రోహం మార్చి 5, 2008

Posted by Telangana Media in Naveen's analysis.
1 comment so far

తిరుపతి లో తెలుగు తల్లి రథోత్సవం సంధర్బంగా భవదీయ ఇ.వి. రమణా రెడ్డి గారు ప్రసంగించారు. తెలంగాణ భాషలో వస్తున్న సాహిత్యాన్ని తప్పు బట్టిన వీరు తెలంగాణ తల్లి ఎర్పాటు అనాలోచితమన్నారు. (ఇంకా…)

జయ ప్రకాశ్ నోరువిప్పాలి..! – - నవీన్ ఆచారి- Telangana IT Forum జూన్ 30, 2007

Posted by Telangana Media in Naveen's analysis, Telangana Articles.
1 comment so far

ప్రతీ రాజకీయ పార్టీ కి ప్రతీ సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశం మీద ఒక స్పష్టమైన అవగాహన, విధానం ఉండాలి. ఆదే ఒక సంస్థ అయితే ఒకే అంశం మీద దౄష్టి ఉంచి పని చెయ్యొచ్చు (ఉదా. జన విజ్ణాన వేదిక). సదరు పార్టీ కోరే ఆ కొత్త వ్యవస్థ ఎలా ఉండాలొ ప్రతీ రాజకీయ పార్టీ ముందే నిర్దేశించుకోవాలి. ఎందుకంటే ఏదో ఒక రోజు నువ్వు అధికారం లోకి వస్తావు కాబట్టి. ప్రభుత్వాన్ని నడుపుతావు కాబట్టి. ప్రజలు ఈ విషయంలొ నీకు ఎందుకు ఓటు వెయ్యాలి అని ప్రశ్నిస్తే చెప్పుకోవడానికి ఆ పార్టీ కి ఒక విధానం అనేది ఉండాలి. అదే ఒక సంస్థ అయితే ఎలాగూ ఎన్నికలలొ పోటీ చేయరు కాబట్టి, అధికారం లోకి వచ్చే ప్రశ్నే లేదు. కాబట్టి వాళ్లు తమ తమ లక్ష్యాలను ప్రధాన కేంద్రం గా చేసుకుని పని చెయ్యాల్సి ఉంటుంది. కాని రాజకీయ పార్టీ అలా కాదు దానికి ఒక సమగ్ర విధానం అనేది తప్పనిసరి

JP గారు తమ పార్టీ ప్రారంభ సమయం లో ఒక ప్రకటన చేసారు. తెలంగాణ కు తమ పార్టీ వ్యతిరేకం కాదు అని. తెలంగాణ లాంటి రాష్ట్రాలు ఇంకో వంద ఉన్నా తప్పులేదు అని. తెలంగాణ వచ్చినా నష్టం లేదు అని. ఆయితే మీరు తెలంగాణ సాధన కోసం చేసే ప్రయత్నం ఏమిటి అనే దానికి ఆయన దగ్గర సమాధానం లేదు. ఎవరొ తెస్తే మేము అనుసరిస్తాం అనే ఉదాసీన వైఖరి సరికాదు. ఒకవేళ ఆ విషయం లో ఏమైనా లోపాలున్నాయని భావిస్తే దానిని ప్రజలకు చెప్పగలగాలి. విద్య, వైద్యం తప్ప మిగతా విషయాలను మేము పట్టించుకోం అనే ధోరణి మంచిదికాదు. ఈ రోజు లోక్ సత్తా ఒక సంస్థ గా ఉండి ఉంటే ఈ ప్రశ్నలు అడిగే వాళ్లం కాదు.

తెలంగాణా ఉధ్యమం ఊపందుకున్నదశలో మీరు మీ సంస్థను పార్టీ గా మార్చడం కాకాతాళీయమేనా.అధికార వికేంద్రీకరణ గురించి చెప్పేవాళ్లు తెలంగాణ అంశం కూడ అధికార వికేంద్రీకరణే అన్న సంగతి ఎందుకు మర్చిపోతున్నారు. లోక్ సత్తా ఒక రాజకీయ సంస్థ గా ఉన్నప్పుడు మీరు పాడిన వికేంద్రీకరణ పల్లవి ని రాజకీయ పార్టీ గ అవతార మెత్తిన తర్వాత పక్కన పెట్టడం, ముందెన్నదు చెప్పని “వైద్యం” ప్రధాన అంశం గా ముందుకురవడం అనేవి ఎవరిని దారి మల్లించడనికి. మీ పార్టీ ప్రారంభమైన తర్వాత కనీసం ఒక్కసారైనా Decentralisation గురించి ఎక్కడైనా నోరు విప్పారా. ఈ రొజు తెలంగాణ అంశం రాష్ట్ర రాజకీయాల్లొ ప్రకంపనలు సౄష్టిస్తున్న సంగతి మీకు తెలియనిది కాదు. అలాంటి దాని పై అదే రాష్ట్రానికి చెందిన ఒక రాజకీయ పార్టీ స్పందించకుండా ఉండడం ఆ ప్రాంత ప్రజల కష్టాలను విస్మరించడమే కాదు ఆ ఆశయ సాధన లో అమరులైన మౄత వీరుల త్యాగాలను అవమానించడం కూడా..!