“PRESS RELEASE” ఏప్రియల్ 29, 2008
Posted by Telangana Media in Telangana Articles.1 comment so far
- అల్లం నారాయణ ఏప్రియల్ 29, 2008
Posted by Telangana Media in Telangana Articles.add a comment
చి తా భస్మం నుంచి లేచివచ్చిన ఫీనిక్స్ పక్షి.. టపటపా రెక్కలు కొట్టుకుంటున్నప్పుడు.. అలసిపోలేదా మిత్ర మా. కన్నీటి కాలాల ఆగడ్తల మధ్య. డస్సిపోలేదా మిత్రమా.. ఏండ్ల కేండ్లు ఏటికి ఎదురీదిన రెక్కలు. మూడున్నర దశాబ్దాల అనంతరం. నీ బలమైన ఒకప్పటి బాహువుల స్థానే.. కొంచెం పీలగా నరాలుతేలిన ఆ పిడికిలి ఆకాశంలోకి విసురుతూ ..నువ్వింకా..నీ ఆశయాలను పలకరిస్తూ… ఆ తుపాను తెమ్మెర లాగే ఉంటూ.. ఇంకా ఉన్నందుకు.. ఇంకా మిగిలినందుకు.. కలలు తెగిపడ్తున్న బీభత్స దృశ్యాల్లోనూ కొన ఊపిరుల మంట లు సాస్తున్నందుకూ.. కానీ మిత్రమా… పడమటిగాలి మింగే స్తున్న తూరుపుగాలిలో ఫీనిక్స్‌లు మళ్లీ చితా భస్మాలవుతున్న ఒక కానికాలం.
పాటే నా ప్రాణం.. నేర్నాల కిషోర్‌తో ఇంటర్వ్యూ మార్చి 12, 2008
Posted by Telangana Media in Telangana Articles.2 comments
పాటే నా ప్రాణం..
నేర్నాల కిషోర్‌తో ఇంటర్వ్యూ
ఆడే పాడే వయస్సులో పాడుకునే పాటలు మన జీతానికి దగ్గరగా ఉంటాయి.మనకు తెలియకుండానే ఏదో ఒక సందర్భంలో ఒక పదం మన నాలుకపై కదళాడుతుంది. ఆ పదం బయటికి వస్తే పాట అవుతుంది. పదిమందిని పలుకరిస్తుంది. పలకరించినా పాట మదిలో నిలిచిపోతుంది. అందుకే కళాకారుడు తనకు నచ్చిన, ఆకర్షింపజేసిన,ప్రకృతిపై పెనవేసుకొన్న తన పాటను తనకు నచ్చిన సాహిత్యంపైరాస్తాడు.
తెలంగాణ ద్రోహి వైఎస్‌ఆర్ ః టిఆర్‌ఎస్ మార్చి 5, 2008
Posted by Telangana Media in Telangana Articles.add a comment
హైదరాబాద్, మార్చి 5 ః టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామాలకు మద్దతుగా ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. (ఇంకా…)
టి.ఆర్.ఎస్. రాజీనామాలు (Andhra Jyothy 5th,march) మార్చి 5, 2008
Posted by Telangana Media in Telangana Articles.1 comment so far
ఉపసంహరించుకోమంటున్న స్పీకర్
తెలంగాణా రాష్ట్ర సమితికి చెందిన శాసన సభ్యులు మంగళవారంనాడు తమ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. అయితే స్పీకర్ సురేష్ రెడ్డి వీరి రాజీనామాలను ఆమోదించలేదు. రాజకీయ పార్టీలమధ్యగల విభేదాలతో సంబంధం లేకుండా అందరూ టి.ఆర్.ఎస్. సభ్యులు సభలో ఉండాలనే కోరుతున్న దృష్ట్యా వారు రాజీనామాలను ఉపసంహరించుకోవాలని స్పీకర్ కోరారు. (ఇంకా…)
ఉద్యమమే వూపిరి మార్చి 5, 2008
Posted by Telangana Media in Telangana Articles.add a comment
ఒక అంకం ముగిసింది.. మరో అంకానికి తెరలేచింది.. తెరాసకు మిగిలింది ఇక జనం బాటే. ఉద్యమాన్ని ఉద్ధృతం చేయడమే లక్ష్యంగా తెరాస వ్యూహా రచన చేస్తోంది. అనూహ్య పరిస్థితుల్లో పదవులను త్యజించిన … (ఇంకా…)
రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి మార్చి 5, 2008
Posted by Telangana Media in Telangana Articles.add a comment
తెరాస ఎమ్మెల్యేల రాజీనామా సందర్భంగా మంగళవారం శాసనసభ లాబీల్లో దాదాపు రెండు గంటలపాటు ఉత్కంఠభరితమైన వాతావరణం చోటుచేసుకుంది. ఒకేసారి 16 మంది శాసనసభ్యులు రాజీనామా చేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. (ఇంకా…)
రాజీనామాలు బాధాకరం మార్చి 5, 2008
Posted by Telangana Media in Telangana Articles.add a comment
”తెలంగాణ ఇవాళకు ఇవాళ ఇవ్వాలంటే కష్టం” అని ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు. తెరాస ఎమ్మెల్యేల రాజీనామా నేపథ్యంలో శాసనసభలో జరిగిన చర్చలో పాల్గొన్న ముఖ్యమంత్రి … (ఇంకా…)
ఇక జనంలోకి మార్చి 5, 2008
Posted by Telangana Media in Telangana Articles.add a comment
దారి తప్పించే ప్రయత్నం మార్చి 5, 2008
Posted by Telangana Media in Telangana Articles.add a comment
- బోధనం నర్సిరెడ్డి, ఎలికట్టె శంకర్‌రావు, గౌస్ మొహియుద్దీన్
‘దారి తప్పుతున్నాం జాగ్రత్త’ అంటూ తెలంగాణా ప్రజలతో మమేకమైనట్టు ఎం.వి.రమణారెడ్డి రాసిన ఉపన్యాస వ్యాసం (ఫిబ్రవరి -వివిధ) ఉత్త వైరుధ్యాలపుట్టగానూ, కోస్తా పక్షపాతంగానూ ఉంది. తిరుపతిలో ఈ ఉపన్యాసం ఎంత దురుద్దేశ్యపూర్వకంగా, పక్షపాత ధోరణితో చేసిందో పత్రికలో రావడం ద్వారా తెలంగాణా ప్రజలకు తెలిసింది. ఇందులోని వైరుధ్యాలను, పక్షపాత వ్యాఖ్యానాలను ఒక్కటొక్కటే సోదాహరణంగా వివరిస్తాం. (ఇంకా…)
తెలంగాణపై టిఆర్‌ఎస్ పట్టు ః సభ 10 నిముషాలు వాయిదా(Andhra Jyothy paper 4/3/2008) మార్చి 4, 2008
Posted by Telangana Media in Telangana Articles.add a comment
హైదరాబాద్, మార్చి 4ః అసెంబ్లీ మంగళవారం ప్రారంభం కాగానే వాయిదా తీర్మాణాల చర్చపై సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సురేష్‌రెడ్ది సభను 10 నిముషాలు వాయిదా వేశారు. ఈ రోజు ప్రశ్నోత్తర సమయంలో టిఆర్‌ఎస్ తెలంగాణపై, బిజెపి పెట్రోధరల పెంపు, నిత్యావసర ధరలపై , సిపిఎం 610 జీవో అమలు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై తీర్మాణాలు ప్రవేశపెట్టాయి.
వాటిపై చర్చకు స్పీకర్ తిరస్కరించారు. తెలంగాణపై చర్చకు అనుమతివ్వండి లేదా మా రాజీనామాలు తీసుకోవాలని టిఆర్‌ఎస్ సభ్యులు పోడియం వద్దకు దూసుకువెళ్ళారు. ఇప్పుడు అంశం రాజీనామాలు కాదని, దీనిపై తరువాత తన చాంబర్లో చర్చిద్దామని స్పీకర్ అన్నారు. అందుకు టిఆర్‌ఎస్ అంగీకరించకపోవడంతో సభను 10 నిముషాలు వాయిదా వేశారు.
టి ఆర్ ఎస్ ఎంపీల రాజీనామా(Andra jyothy paper 4/3/2008) మార్చి 4, 2008
Posted by Telangana Media in Telangana Articles.add a comment
…చర్చకు ఎన్‌డి ఏ పట్టు…స్పీకర్ నిరాకరించడంతో వాకౌట్
…బిల్లు పెట్టడానికి కాంగ్రెస్‌కు అడ్డేమిటి?…నిలదీసిన అద్వానీ
…తెలంగాణ ఇస్తామని ఎప్పుడూ చెప్పలేదు: లగడపాటి,జైరాంరమేష్, ఉండవల్లి
…టి ఆర్ ఎస్, కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను మోసం చేశారు: ఎర్రన్నాయుడు
…టి ఆర్ ఎస్ ఎంపీల నిష్క్రమణ తరువాత సభలో ప్రవేశించిన నరేంద్ర
న్యూఢిల్లీ,మార్చి3(ఆన్‌లైన్): అనుకున్న గడువుకే తెలంగాణ రాష్ట్ర సమితి(టి ఆర్ ఎస్)కి చెందిన నలుగురు ఎంపీలు సోమవారం ఉదయం లోక్‌సభలో రాజీనామాలు చేశారు. తమ రాజీనామా పత్రాలను స్పీకర్ సోమనాథ్‌చటర్జీ సూచనల మేరకు నిండు సభలోనే లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు సమర్పించారు. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఈ రాజీనామాలకు సభలో కాంగ్రెస్ తప్ప దాదాపు అన్ని పార్టీల సభ్యులు సానుభూతి వ్యక్తంచేయడంతో ఈ ఘట్టానికి ఎనలేని ప్రాధాన్యత లభించింది.బిజెపి ఆద్వర్యంలో మొత్తం ఎన్డీయే సభ్యులు టిఆర్‌ఎస్‌కు మద్దతుగా వాకౌట్ చేయగా, తెలుగుదేశం, ఆర్‌పిఐ, సిపిఐ సభ్యులు అధికార పార్టీ వైఖరిని ఎండగట్టారు. ఉదయం 11 గంటలకు ముందే గులాబీ కండువాలు« ధరించి సభలో ప్రవేశించిన టిఆర్‌ఎస్ సభ్యులు సభ ప్రారంభం అవుతూనే జై తెలంగాణ నినాదాలతో సభ దష్టిని ఆకర్షించారు. లోక్‌సభ స్పీకర్ సోమనాథ ఛటర్జీ కూడా అధికార పార్టీ సభ్యులు ప్రతిఘటిస్తున్నప్పటికీ వినకుండా టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ ప్రసంగించడానికి, సభలోనే రాజీనామాలు సమర్పించడానికి అనుమతించి కొత్త చరిత్రకు నాందిపలికారు.టిఆర్‌ఎస్ సభ్యుల రాజీనామా ఘట్టం జరుగుతున్నప్పుడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సభలో లేకపోగా, విదేశాంగ మంత్రి, యుపిఏ సబ్ కమిటీ చైర్మన్ ప్రణబ్ ముఖర్జీ నిమ్మకు నీరెత్తినట్లు మౌనంగా కూర్చుండిపోయారు. సోమవారం ఉదయం లోక్‌సభ కార్యకలాపాలు ప్రారంభమైన వెంటనే టిఆర్‌ఎస్ సభ్యులు లేచి నిలబడడంతో ఉత్తరఖండ్‌నుంచి లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన తేజ్‌పాల్‌సింగ్ ప్రమాణ స్వీకారోత్సవం వరకూ ఆగాలని స్పీకర్ వారికి సూచించారు. అనంతరం టి ఆర్ ఎస్ ఎంపీలు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి తాము రాజీనామాలు చేస్తున్నామని, తమకు మాట్లాడే అవకాశాన్ని ఇవ్వాలని కోరారు.తొలుత స్పీకర్ ఇందుకు నిరాకరించినప్పటికీ అద్వానీ ప్రేరణ మేరకు బిజెపి లోక్‌సభ నేత విజయ్ కుమార్ మల్హోత్రా అండగా నిలబడడంతో ఆయన వారికి అనుమతి ఇచ్చారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమయంలో సభలో ఉన్న రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ సభ్యులు లగడపాటి రాజగోపాల్, కె ఎస్ రావు, రాయపాటి సాంబశివరావు, సాయిప్రతాప్ తదితరులు లేచి టి ఆర్ ఎస్ సభ్యులను మాట్లాడటానికి అవకాశం ఇవ్వకూడదని అరిచారు. కొద్దిసేపు సభ్యుల వాగ్వివాదాల తరువాత రాజీనామాలు చేస్తున్న సభ్యులు తమ తమ స్థానాలకు వెళ్లి మాట్లాడమని స్పీకర్ అనుమతి ఇచ్చారు.
ముందుగా కెసి ఆర్ మాట్లాడుతూ 2004 ఎన్నికల సమయంలో తెలంగాణను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి తమతో పొత్తు పెట్టుకున్నదని ఆ తరువాత యుపి ఏ కనీస ఉమ్మడి ప్రణాళికలో కూడా ఈ అంశాన్ని చేర్చి రాష్ట్రపతి చేత కూడా తెలంగాణ ఏర్పాటు ఖాయమని చెప్పించారని అన్నారు. అయితే నాలుగేళ్లు అయినా అధికార కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకు చేసిన మోసాన్ని ఖండిస్తూ తమ రాజీనామాలను సమర్పిస్తున్నామని కెసి ఆర్ తెలిపారు. ఆ తరువాత ఇదే విషయాన్ని ఆ పార్టీ ఎంపీలు వినోద్‌కుమార్, రవీంద్రనాయక్, మధుసూధన్‌రెడ్డిలు చెప్పి తమ రాజీనామాలను తీసుకొని స్పీకర్ వద్దకు వెళ్లారు. అయితే వాటిని సెక్రటరీ జనరల్‌కు ఇవ్వాలని సూచిస్తూ రాజీనామాలను ఆమోదించడానికి కొన్ని నియమాలున్నాయని వాటిని పరిశీలించిన తరువాత తగిన నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ తెలిపారు.
జై తెలంగాణ..అంటూ నినాదాలు చేసుకుంటూ టి ఆర్ ఎస్ సభ్యులు సభనుంచి నిష్క్రమించిన తరువాత అద్వానీ లేచి మాట్లాడుతూ ఒక అంశంపై సభలో రాజీనామాలు చేయడం ఇదే బహుశా మొదటిసారి.. అయితే తెలంగాణ అంశంపై కొంత చర్చకు అనుమతి ఇస్తే బావుంటుంది..అప్పుడే అన్ని విషయాలు బయటకు వస్తాయి..అని అన్నారు. అందుకు స్పీకర్ నిరాకరిస్తూ రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే సమయంలో కావాలంటే తెలంగాణ అంశాన్ని ప్రస్తావించవచ్చని ప్రత్యేకంగా దీనిపై అనుమతించేది లేదని స్పష్టం చేశారు. అందుకు నిరసనగా అద్వానీతో పాటు ఎన్‌డి ఏకు చెందిన పార్టీల సభ్యులంతా వాకౌట్ చేశారు.
ఎన్‌డి ఏ సభ్యులంతా వాకౌట్ చేస్తున్న సమయంలో లగడపాటి రాజగోపాల్ లేచి తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మొదటినుంచి రెండో ఎస్సార్సీనే డిమాండ్ చేస్తున్నదని అందుకు టి ఆర్ ఎస్ కూడా అంగీకరించిందని అన్నారు. 1998లో ఒక ఓటు–రెండు రాష్ట్రాలు అంటూ తీర్మానం చేసిన బిజెపి ఆరేళ్లు అధికారంలో ఉన్నప్పుడు మూడు చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేసినా తెలంగాణ అంశాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. రెండో ఎస్సార్సీని అంగీకరిస్తూ టి ఆర్ ఎస్ ఎంపీ నరేంద్ర సంతకం చేసిన నోట్‌ను కూడా రాజగోపాల్ సభ్యులందరికీ పంచిపెట్టారు.
కాగా టి ఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ తెలంగాణ ప్రజలను మోసం చేశారని తెలుగుదేశం పార్లమెంటరీపార్టీ నేత ఎర్రన్నాయుడు ఆరోపించారు. ఎర్రన్నాయుడు పదే పదే అడ్డుపడుతుండటంతో స్పీకర్ కొద్దిగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అద్వానీతో ఉండవల్లి ఢీ కాగా సాయంత్రం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటప్పుడు కూడా అద్వానీ తెలంగాణ అంశాన్ని ప్రస్తావించారు. అప్పుడు ఆయనకు కాంగ్రెస్ ఎంపీలు జైరాం రమేష్, ఉండవల్లి అరుణ్‌కుమార్‌లు అడ్డుపడ్డారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ మోసం చేసిందని అద్వానీ అన్నారు.
యుపి ఏ కనీస ఉమ్మడి ప్రణాళికలో పేర్కొనడమే కాకుండా రాష్ట్రపతి చేత కూడా చెప్పించిన కాంగ్రెస్‌కు తెలంగాణ బిల్లును తీసుకురావడానికి అడ్డు ఏమిటో చెప్పాలని నిలదీశారు. బిల్లు తెస్తే బిజెపి కూడా మద్దతునిస్తుందని హామీ ఇచ్చిన తరువాత కూడా కాంగ్రెస్ మీనమేషాలను లెక్కపెడుతున్నదని, దీన్ని మోసమని కాక ఏమంటారని అద్వానీ ప్రశ్నించారు. అద్వానీ ప్రసంగాన్ని మొదట అడ్డుకున్న జైరాం రమేష్ తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ ఎప్పుడూ చెప్పలేదని కావాలంటే రికార్డులను పరిశీలించుకోవచ్చని అన్నారు.
ఉండవల్లి అరుణ్‌కుమార్ కూడా లేచి మోసం చేసింది కాంగ్రెస్ కాదు..బిజెపియే మోసం చేసింది…కాకినాడలో ఒక ఓటు రెండు రాష్ట్రాలని తీర్మానం చేసి అధికారంలోకి రాగానే ఆ విషయాన్ని మర్చిపోయారు..అని అన్నారు. బిజెపి సభ్యుడు అనంత్‌కుమార్ మాట్లాడుతూ ఎన్‌డి ఏ హయాంలో మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసిన విషయాన్ని కాంగ్రెస్ సభ్యులు మర్చిపోతున్నారని, ఇప్పుడు తెలంగాణ బిల్లు పెడితే మద్దతునిస్తామని తాము స్పష్టం చేసిన తరువాత కూడా కాంగ్రెస్ ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ది ఉంటే బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. అద్వానీతో ఉండవల్లి, జైరాం రమేశ్ వాగ్వివాదానికి దిగుతున్నప్పుడు మాత్రం సభలో సోనియా, మన్మోహన్‌లిద్దరూ ఉన్నారు.
కొసమెరుపు
టి ఆర్ ఎస్ ఎంపీలు నలుగురు రాజీనామాలు చేసి బయటకు వెళ్లిన కొద్ది సేపటికి, వారు వెళ్లిన ద్వారం గుండానే ఆపార్టీనుంచి బహిష్కరణకు గురైన మరో ఎంపీ నరేంద్ర సభలోకి రావడం కొసమెరుపు.
టిఆర్ ఎస్ సభ్యులు రాజీనామా పత్రాలు ఇచ్చి వెళ్తున్నప్పుడు ఇది చాలా దురదృష్టకరం..సభలో సభ్యుల సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతున్నది అంటూ స్పీకర్ సోమనాథ్‌చటర్జీ వ్యాఖ్యానించారు. సభనుంచి వెళ్తున్న టి ఆర్ ఎస్ ఎంపీల వైపు ఎన్‌డి ఏ, సిపి ఐ, ఆర్‌పిఐకి చెందిన కొద్దిమంది సభ్యులు విజయచిహ్నాలను చూపి వారిని ఉత్తేజపరిచేందుకు ప్రయత్నించారు. ద్వారం వద్దకు వెళ్లిన తరువాత కెసి ఆర్‌తో సహా నలుగురు నిలబడి స్పీకర్ వైపు తిరిగి చూసి జై జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. మళ్లీ వస్తాం.. తెలంగాణ తీసుకొని వెళ్తాం అంటూ నినాదాలు చేసుకుంటూ సభనుంచి నిష్క్రమించారు.
తెరాస ఆరోపణలకు జవాబిచ్చేందుకు ప్రభుత్వ యత్నం(eenadu paper 4/3/2008) మార్చి 4, 2008
Posted by Telangana Media in Telangana Articles.add a comment
హైదరాబాద్, మార్చి 4 : అసెంబ్లీలో రాజీనామాల సందర్భంగా కాంగ్రెస్‌ను పలు రకాలుగా విమర్శించిన తెరాస సభ్యులు కాంగ్రెస్‌ను తీవ్రంగా విమర్శించటంతో ప్రభుత్వం అందుకు వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించగా స్పీకర్ నిరాకరించారు. రాజీనామాలు చేసినవారి మాటలకు వివరణ ఇవ్వటం సంప్రదాయం కాదన్నారు. అయితే వారి రాజీనామాలను ఇంకా ఆమోదించనందున తమకు అవకాశం ఇవ్వాలని మంత్రి రోశయ్య కోరారు. కొందిరపై వ్యక్తిగత విమర్శలు చేయటంతో తాము సమాధానం ఇవ్వాల్సి వస్తోందన్నారు, చివరకు ఆరోపణలకు గురయినవారు మాత్రమే సమాధానం ఇవ్వాలని స్పీకర్ కోరారు. అందుకు విపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. వివరణ ఇవ్వరాదని అడ్డుకున్నాయి. చివరకు స్పీకర్ జోక్యంతో వారు సద్దుమణిగారు. అనంతరం మంత్రి డి.శ్రీనివాస్ వారి వ్యాఖ్యలను ఖండిస్తూ మాట్లాడారు.
అసెంబ్లీముందు వై.ఎస్ దిష్టిబొమ్మ దగ్థం(eenadu paper 4/3/2008) మార్చి 4, 2008
Posted by Telangana Media in Telangana Articles.add a comment
హైదరాబాద్, మార్చి 4 : కాంగ్రెస్ తెలంగాణావిషయంలో మోసం చేసిందంటూ నిరసన తెలిపిన తెరాస కార్యకర్తలు అసెంబ్లీలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం వారు తెలంగాణాకు వై.ఎస్ అడ్డుపడుతున్నారంటూ రోడ్డు మీద ఆయన దిష్టిబొమ్మను దగ్థం చేశారు. నినాదాలు చేశారు. వీరి ఆందోళనతో రోడ్డుమీద ట్రాఫిక్ నిలిచిపోయి ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. అనంతరం నగరంలోని పలు ప్రధాన కూడళ్లలో సోనియా దిష్టిబొమ్మలను దగ్థం చేశారు.
రాజీనామాలు సమర్పించిన తెరాస సభ్యులు(eenadu paper 4/3/2008) మార్చి 4, 2008
Posted by Telangana Media in Telangana Articles.2 comments
హైదరాబాద్, మార్చి 4 : తెలంగాణా ఉద్యమపథంలో భాగంగా నిన్న లోక్‌సభ సభ్యత్వాలకు తెరాస ఎంపీలు రాజీనామా చేయగా నేడు అసెంబ్లీలో ఆ పరంపర కొనసాగింది. సభ ఉదయం వాయిదా పడిన అనంతరం స్పీకర్‌తో తెరాస నేతలు భేటీ అయ్యారు. కాంగ్రెస్ తమను తెలంగాణా విషయంలో మోసం చేసిందని ఇక వారు తెలంగాణా ఇస్తారనే ఆశ లేనందున తామంతా రాజీనామాలు చేస్తున్నామని తెరాస పక్ష నేత విజయరామారావు స్పీకర్‌కు తెలియజేశారు. అందుకు కారణాలు సభకు తెలియజెప్పేందుకు తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. అందుకు చట్టప్రకారం నిబంధనలు లేవని అయితే తన విచక్షణాధికారం ఉపయోగించి నలుగురికి మాట్లాడే అవకాశం ఇస్తానని స్పీకర్ తెలిపారు. అనంతరం సభలో మొదట విజయరామారావు మాట్లాడారు. తెలంగాణా ఇస్తామని తాము వాగ్థానం చేయలేదని కాంగ్రెస్ ఇప్పుడు అంటోందని తెలంగాణా కోరుతున్న పార్టీ కండువాను తాము వేసుకోవటం అంటే దాన్ని అంగీకరించటమే అనే విషయం ఆనాడు తెలియదా అని ప్రశ్నించారు. తాము కలిసిరాకపోతే టీడీపీ గెలుస్తుంది కనుక కలిసి పోటీ చేద్దామని కాంగ్రెస్ వారే కేసీఆర్ ఇంటికి వచ్చారు కాని ఆయన వారి ఇంటికి వెళ్లారా అని ఆయన ప్రశ్నించారు. తమవల్ల గెలిచి తమను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంలో తమకు న్యాయం జరగదని అందుకే తాము రాజీనామా చేస్తున్నామని ప్రకటించారు. అనంతరం నాయని నర్సింహారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌వారికి దమ్ముంటే రాజీనామాలు చేసి గెలవాలని తమ బలం చూపాలని డిమాండ్ చేశారు. మరో ఎమ్మెల్యే రాజేందర్ కూడా మాట్లాడారు. చివరగా హరీష్‌రావు ప్రసంగించారు. ఆయన ప్రసంగం యావత్తు సీఎం కడప జిల్లాలో చేపట్టిన పనులు, తెలంగాణాకు జరిగిన అన్యాయమే ఎజెండాగా సాగింది. ఆఖరుగా 16 మంది తెరాస సభ్యులు తమ రాజీనామాలను స్పీకర్‌కు ఇచ్చి ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. జై తెలంగాణా నినాదాలు చేస్తూ నిష్క్రమించారు. అదేవిధంగా మండలిలోను ముగ్గురు తెరాస ఎమ్మెల్సీలు తమ రాజీనామాలను ఛైర్మన్ చక్రపాణికి సమర్పించారు.
తెలంగాణా తీర్మానం కోసం తెరాస పట్టు (eenadu paper 4/3/2008) మార్చి 4, 2008
Posted by Telangana Media in Telangana Articles.add a comment
హైదరాబాద్, మార్చి 4 : ఈరోజు శాసనసభ సమావేశం కాగానే విపక్షాలు వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి. తెలంగాణాపై తెరాస, పెట్రోలు, డీజిల్ ధరల పెంపు గ్యాస్ కష్టాలు, నిత్యావసరాలపై భాజపా, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, 610 జీఓ అమలుపై సీపీఎం వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి. వాటిని స్పీకర్ తిరస్కరించారు. తెరాస సభ్యులు తెలంగాణాపై తీర్మానం చేయాలని పట్టుబడుతూ స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిలుచున్నారు. తీర్మానాలను తిరస్కరించినందున తక్షణ చర్చ కుదరదని స్పీకర్ తెలిపారు. అయితే తమ రాజీనామాలైనా తీసుకోవాలని వారు కోరారు. ఇప్పుడు అంశం రాజీనామాలు కాదని వాయిదాతీర్మానాల మధ్య అది కుదరదని దీనిపై తన ఛాంబర్లో తరువాత చర్చిద్దామని స్పీకర్ అన్నారు. అందుకు తెరాస అంగీకరించకపోవటంతో స్పీకర్ సభను 10 నిముషాలు వాయిదా వేశారు.
తెలంగాణా భవన్‌లో సందడి మార్చి 4, 2008
Posted by Telangana Media in Telangana Articles.add a comment
| హైదరాబాద్, మార్చి 4 : తెరాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేడు రాజీనామా చేయనుండటంతో తెలంగాణా భవన్‌లో సందడి నెలకొంది. తెలంగాణా తల్లి విగ్రహానికి పూలమాలలు వేసిన తెరాస ఎమ్మెల్యేలు తెలంగాణా అనుకూల నినాదాలతో హోరెత్తించారు. తెలంగాణాకు ఎవరు అడ్డు వచ్చినా నరికేస్తామని నినదించారు. తెరాస చేతిలో చిత్తుగా ఓడిపోయిన జీవన్‌రెడ్డి మంత్రి పదవికి ఆశపడి సీఎం ఎలా మాట్లాడమంటే అలా మాట్లాడుతున్నారని హరీష్‌రావు అన్నారు. అక్కడినుంచి అందరూ అసెంబ్లీకి బయలుదేరారు. |
తెలంగాణ దీర్ఘకవితలు సెప్టెంబరు 24, 2007
Posted by Telangana Media in Telangana Articles.add a comment
అదొక అద్భుతమైన విముక్తి (Andhra Jyothy) సెప్టెంబరు 19, 2007
Posted by Telangana Media in Telangana Articles.add a comment
కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై నిజాం సూచనలను వినడానికి జనరల్ చౌధురి తిరస్కరించారు. సైనిక శాసనాన్ని ప్రకటించనున్నట్టు ఆయన స్పష్టంచేశాడు. ఇది తెలిసి నిజాం ఖిన్నుడయ్యాడు. ‘లాయక్ అలీ, ఇది మన అవగాహనకు వ్యతిరేకం కదా’ అని అన్నారు. ‘అవగాహన ఏమిటని’ ప్రశ్నించాను. నిజాం నుంచి సమాధానం లేదు.
సెప్టెంబర్ 17వతేదీ. ‘ఇంటికి వెళ్ళి కొంచెం సేపు విశ్రాంతి తీసుకోమని’ జనరల్ స్టాఫ్ సీనియర్ అధికారులు నాకు నచ్చచెప్పారు. గత రెండు రాత్రులుగా నాకు నిద్రేలేదు. ఇంటికి వెళ్ళి నిద్రపోవడానికి సిద్ధమవుతుండగా బీబీనగర్ పరిసరా లలో భారీ కాల్పుల శబ్దాలు విన్పిస్తున్నాయని బీబీనగర్ రైల్వేస్టేషన్ మాస్టర్ నుంచి సమాచారమందిందని సిబ్బంది తెలియజేశారు. దిగ్భ్రాంతి చెందాను. భారత సైన్యం బీబీనగర్‌కు చేరిపోయింది!. యుద్ధం ప్రారంభమైన తరువాత నేను ఏ సంఘటనకూ ఇంతగా దిగ్భ్రాంతి చెందలేదు. ఆ దళాలు హైదరాబాద్‌కు నాలుగైదు గంటలలోనే చేరబోతున్నాయన్నమాట.
‘అంతా అయిపోయినట్టే’నని అనుకున్నా ను. స్నానంచేసి నమాజ్‌కు సిద్ధమవుతుండగా ఆర్మీ కమాండర్ వచ్చాడు. చాలా అలసిపోయివున్నాడు. హైదరాబాద్ సేనలు ఇంకెంతమాత్రం భారతసైన్యాన్ని నిలు వరించగల స్థితిలో లేవని చెప్పాడు. సాయంత్రంలోగా భారత సైనిక దళాలు రాజ ధానికి చేరవచ్చని చెప్పాడు. సాయుధ ప్రతిఘటన ఇక అసాధ్యం కనుక భారత్‌తో సంధి కుదుర్చుకోవడం మంచిదని సలహా ఇవ్వడానికి వచ్చానని కమాండర్ అన్నా డు. తూర్పు రంగంనుంచి ఏమైనా సమాచార మందిందా అని ప్రశ్నించాను. లేదని చెప్పాడు. బీబీనగర్‌కు భారత సైన్యం చేరినట్టు రైల్వేఛీప్ నుంచి సమాచారమం దిదని చెప్పాను. ఆర్మీ కమాండర్ ఆశ్చర్యపోయాడు.
అందరూ ఉత్కంఠతో వేచిచూస్తున్న భద్రాతామండలి సమావేశం క్రితంరోజు (16వ తేదీ) సాయంత్రం బ్రిటిష్ ప్రతినిధి అలెగ్జాండర్ కడోగాన్ అధ్యక్షతన జరి గింది.హైదరాబాద్ ప్రతినిధి బృందం సమర్పించిన దరఖాస్తును ఎజెండాలో చేర్చ వచ్చునా అనేదే ప్రధాన చర్చనీయాంశం.హైదరాబాద్ అంశాన్ని ఎజెండాలో చేర్చ డానికి సమావేశం అంగీకరించింది. ఇది కీలకమైన అంశం. ఏమంటే పూర్తిగా సాంకే తిక కారణాలతో హైదరాబాద్ దరఖాస్తును తిరస్కరించడానికి అవకాశముంది. సమావేశం ప్రారంభమవగానే శాశ్వత సభ్యదేశమైన నేషనలిస్ట్ చైనా ప్రతినిధి సియాంగ్ హైదరాబాద్ వివాదం పరిశీలనను 20వ తేదీకి వాయిదా వేయమని సూచించాడు.
తమ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రానందున తనకు కొంత వ్యవధి అవసరమని ఆయన అన్నాడు. అయితే హైదరాబాద్ విషయంలో తక్షణ నిర్ణయం తీసుకోవలసి ఉన్నందున కనీసం చర్చలను ప్రారంభించడాన్ని అయినా వాయిదావేయడానికి వీలులేదని అలెగ్జాండర్ కడోగాన్ స్పష్టం చేశాడు. పరోడి (ఫ్రాన్స్) ఆయనతో ఏకీభవించాడు.
బ్రిటిష్ పార్లమెంటు ఆమోదించిన ‘భారత స్వాతంత్య్రచట్టం’ అనంతరం హైదరాబాద్ హోదా ఏమిటనే విషయమై సభాధ్యక్షు డు మరిన్ని వివరాలను అందించాలని రష్యా ప్రతినిధి కోరారు. హైదరాబాద్ అంశా న్ని తక్షణమే పరిశీలించాలని అమెరికా, అర్జెంటీనా ప్రతినిధులు కోరారు. ప్రపంచం లో ఒక దేశం మరో దేశాన్ని ఆక్రమించుకొని అక్కడి ప్రజలను ఊచకోత కోస్తున్నప్పు డు బాధిత దేశ విజ్ఞాపనపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం తగదని వారు వాదిం చారు.
చివరకు ఓటింగ్ నిర్వహించగా ఎనిమిది దేశాలు హైదరాబాద్‌కు అను కూలంగా మొగ్గు చూపాయి. ఆ వెంటనే హైదరాబాద్ తరపున తమ వాదనను విన్పించాలని మొయిన్ నవాజ్ జంగ్‌ను భద్రతామండలి అధ్యక్షుడు ఆహ్వానిం చారు. జంగ్ సుదీర్ఘ వాదన విన్పించి హైదరాబాద్ విషయంలో మండలి తక్షణమే జోక్యం చేసుకొని రక్తపాతాన్ని నివారించాలని కోరారు. ఆ తరువాత భారత ప్రతి నిధి రామస్వామి మొదలియార్ తన వాదనలో భారత్ చర్యకు కారణాలేమిటో వివ రించాడు.
భద్రతామండలికి మొర పెట్టుకోవడానికి హైదరాబాద్‌కు అర్హత లేదన్నా రు. హైదరాబాద్ ఎన్నడూ స్వతంత్ర దేశంగా లేదని, ఈ విషయమై డాక్యుమెంటరీ రుజువులు సమర్పించగలమనిపేర్కొన్నాడు. రెండు వైపుల వాదనలు విన్న తరువా త సభ్య దేశాలు పరిస్థితిని సమగ్రంగా అధ్యయనం చేసేందుకు గాను చర్చను 20 వతేదీకి వాయిదా వేశాయి. హైదరాబా ద్ వివాదాన్ని భద్రతామండలి ఎజెండా లో చేర్చడం ఒక మౌలిక విజయం కాగా దానిపై చర్చను మూడు రోజులపాటు వాయిదా వేయడం చాల నిరుత్సాహం కల్గించింది.
ఆర్మీ కమాండర్ వెళ్ళిపోగానే నేను షా మంజిల్‌కు వెళ్ళాను. కరాచి నుంచి ముష్తాఖ్ అహ్మద్ పంపిన సందేశాలను అప్పటికే డీకోడ్ చేశారు. ఒక సందేశం లో పాకిస్థాన్ నాయకులు నన్ను వెంటనే హైదరాబాద్‌ను విడిచిరావాల్సిందిగా కోరుతున్నారని, భద్రతామండలి ఉచ్చు లో హైదరాబాద్ పడకుండా జాగ్రత్త వహించాలని హెచ్చరించారని ఉంది. ఉదయం 9.30 గంటలకు క్యాబినెట్ అత్యవసర సమావేశానికి ఆదేశించాను. ఇంతలో కాశీం రజ్వీ ఫోన్ చేసి కుశలం అడిగాడు. పరిస్థితి ఎంతగా విషమించిందో వివరించాను. ప్రశాంతంగా ఉండమనీ, ఎటువంటి మతతత్వ అల్లర్లు జరగకుండా చూడాలనీ అన్నాను. యుద్ధం ప్రారంభమైన తరువాత హైదరాబాద్‌లో ఎక్కడా ఎటువంటి అల్లర్లు జరగలేదన్న విషయాన్ని ఆయన గుర్తు చేశాడు. ఆ విషయాన్ని అంగీకరిస్తూనే మునుపటికంటే ఇప్పుడు మతసామరస్యాన్ని కాపాడవలసిన అవ సరమెంతైనా ఉందని స్పష్టంచేశాను.
తరువాత, నిజాం వద్దకు వెళ్ళాను. అప్పటికే ఆయన ఆర్మీ కమాండర్‌తో మాట్లా డారు. పారిస్‌లో భద్రతామండలి సమావేశం నిర్ణయాలపై అప్పుడే అందిన సమా చారాన్ని ఆయనకు తెలియచేశాను. ఇప్పటికే కాల్పుల-విరమణ తీర్మానాన్ని ఆమో దించని పక్షంలో చర్చల వలన ప్రయోజనమేముందని నిజాం ప్రశ్నించారు. శత్రు సైన్యం రాజధానిలోకి ప్రవేశిస్తే ఎంత రక్తపాతం జరుగుతుందో మీకు తెలియదా? గత కొద్దిరోజులుగా భారత సైన్యం ప్రవేశించిన పట్టణాల్లో ఎంతమంది ఊచకోతకు గురవుతున్నారో మీకు తెలియదా అని నిజాం ప్రశ్నించారు.
తెలుసని సమాధానమి చ్చాను. స్వాతంత్య్ర రక్షణకు ప్రాణాలు కోల్పోవడానికి కూడా నేను సంసిద్ధంగా ఉన్నాను. మీ (నిజాం) ఉద్దేశాలను అర్థం చేసుకొన్నాననీ, మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేనేమీ అడ్డు రాననీ ఆయనకు చెప్పాను. రాజీనామా చేయడానికి నిర్ణ యించుకున్నాననీ, నా క్యాబినెట్ సహచరులకు కూడా రాజీనామా చేయాలని సల హా ఇస్తానని చెప్పాను.
ఉదయం మొదలు యుద్ధరంగం నుంచి అందుతున్న సమాచారం, పరిస్థితిని పూర్తిగా తన అదుపులోకి తీసుకోవాలన్న నిజాం ఉద్దేశం, అది సాధ్యంకాని పక్షంలో ప్రస్తుత పరిణామాలతో తనకెలాంటి సంబంధం లేదని బహిరంగంగా ప్రకటించ డానికి ఆయన సంసిద్ధంగా ఉన్నారని క్యాబినెట్ సమావేశంలో వివరించాను. ఆ తరువాత తాజా పరిస్థితులపై తమ తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా తెలి యజేయమని నా సహచరులను కోరాను. తొలుత అందరూ చాలా సేపు మౌనంగా ఉండిపోయారు. చివరకు ఉప ప్రధాని పింగళి వెంకటరామారెడ్డి మౌనాన్ని వీడారు.
దేశం కోసం, సార్వభౌమికుని కోసం ప్రాణాలు అర్పించడానికి తాను సిద్ధంగా ఉన్నా నని ఆయన అన్నారు. పరిస్థితిని చక్కదిద్దగలనని నిజాం భావిస్తున్న పక్షంలో ఆయ నకు సర్వాధికారాలు అప్పగించడం మన విధి అని, ఆ తరువాత ఆయన ఆదేశాల ను శిరసావహించాలని రెడ్డి అన్నారు. హైదరాబాద్ స్వాతంత్య్రాన్ని కాపాడుకోవ డం, ఘనత వహించిన ప్రభువుకు మద్దతుగా నిలబడటం మనలో ప్రతి ఒక్కరి విధి అని వెంకట రామారెడ్డి ఉద్వేగభరితంగా ప్రసంగించారు.
ప్రసంగం ముగించిన వెంటనే నా వైపు తిరిగి మీరు రాజీనా మా చేస్తే నేను మీతోపాటే రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. ఆ తరువాత ప్రతి మంత్రి ఇదే విధంగా తమ అభిప్రా యాలను వ్యక్తం చేశారు. భారత్ సేనల దురాక్రమణను అరికట్టడంలో విఫలమ యిన దృష్ట్యా ప్రభుత్వం రాజీనామా చేస్తోందంటూ నేను ప్రవేశపెట్టిన తీర్మా నాన్ని క్యాబినెట్ ఏకగ్రీవంగా ఆమోదిం చింది.
ఆ తీర్మానాన్ని తక్షణమే నిజాంకు పంపించాము. క్యాబినెట్ సమావేశం ముగిసిన కొద్ది సేపటికే వెంటనే వచ్చి తనను కలవమని నిజాం నుంచి నాకు కబురు అందింది. నేను నిజాం నివాసానికి వెళ్ళేటప్పటికి ఆయన పోలీస్ ఛీఫ్, ఆర్మీ కమాండర్‌తో కొత్త ప్రభుత్వం గురించి మంతనాలు జరు పుతున్నారు. లాయక్ అలీ నేతృత్వంలోని ప్రభుత్వం రాజీనామా చేసిందని, కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు వెంటనే పంపుతానని, భారత ప్రభుత్వ ప్రతినిధిగా మీరు సలహా ఇవ్వాలని నవాబు అప్పటికే కె.ఎం. మున్షీకి వర్త మానం పంపారు.
పోలీస్ ఛీఫ్, ఆర్మీ కమాండర్ వెళ్ళిపోయిన తరువాత మీరు అను కున్న విధంగా పరిస్థితులు ఉండబోవని నిజాంతో అన్నాను. నేను షా మంజిల్‌కు తిరిగివచ్చి రహస్యపత్రాలన్నిటిని ధ్వంసం చేయమని నా వ్యక్తిగత సిబ్బందిని ఆదే శించాను. దౌత్య సందేశాలకు సంబంధించిన కోడ్‌లను కూడా పూర్తిగా ధ్వంసం చేయమని చెప్పాను. కరాచీలోని హైదరాబాద్ ఏజెంట్ జనరల్ ముష్తాఖ్ అహ్మద్‌కు ప్రధాన మంత్రిగా చివరి సందేశం పంపుతున్నానంటూ ఒక సందేశాన్ని పంపాను. మరికొద్ది గంటల్లో మేము ఎవరమూ ఈ లోకంలో ఉండకపోవచ్చని, హైదరాబాద్ పతాకను సగర్వంగా నిలపాలని, మొయిన్ నవాజ్ జంగ్‌కు సమాచారాన్ని ఎప్పటిక ప్పుడు పంపించమని ఆ సందేశంలో పేర్కొన్నాను. పరిస్థితులు ఇలా దిగజారిపోవ డం పట్ల నా సిబ్బంది అంతా విషణ్ణ వదనులయ్యారు.
మధ్యాహ్నం రేడియో స్టేషన్‌కు వెళ్ళి సంస్థాన ప్రజలనుద్దేశించి ప్రసంగించాను. దురాక్రమణకు వచ్చిన భారత్ సేనలను నిలువరించడంలో విఫలమయినందున నేను, నా ప్రభుత్వం రాజీనామా చేశామని చెప్పాను. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉండి ఎటువంటి ఉద్రిక్తతలకు తావివ్వకూడదని విజ్ఞప్తి చేశాను. రేడియో ప్రసంగమనంతరం కారులో తిరిగివెళుతుండగా చౌరస్తాలు, దుకా ణాల వద్ద నా రేడియో ప్రసంగాన్ని వింటూ చాలామంది ప్రజలు గుమిగూడి ఉండ టం గమనించాను. పలువురు పిడికిళ్ళు ఎత్తి హైదరాబాద్‌ను రక్షించుకొంటామని నినాదాలు చేస్తున్నారు.
చాలామంది విలపిస్తున్నారు. నాకూ కళ్ళ వెంట నీళ్ళు కారా యి. షా మంజిల్‌కు వెళ్ళగానే కాశీంరజ్వీకి ఫోన్‌చేసి ప్రశాంతంగా ఉండాలని ప్రజల కు రేడియో ద్వారా విజ్ఞప్తి చేయమని చెప్పాను. రజ్వీ మొదట తటపాయించాడు. అయితే నేను నొక్కి చెప్పిన తరువాత రేడియో స్టేషన్‌కు వెళ్ళి హిందువులు, ముస్లిం లు కలసికట్టుగా ఉండాలని, మతసామరస్యానికి భంగం కల్గించకూడదని విజ్ఞప్తి చేస్తూ ప్రసంగించాడు.
నా మంత్రివర్గ సహచరుడైన రహీం విపరీతమైన ఆదుర్దాతో వచ్చి కాశీంరజ్వీని పాకిస్థాన్‌కు కాని, మరేదైనా విదేశానికి గాని పంపించి వేయడానికి తోడ్పడాలని కోరాడు. భారత్ సేనలు మనలనందరినీ కాల్చివేయవచ్చని, ముఖ్యంగా రజ్వీని నడిరోడ్డు మీద ముక్కలుముక్కలుగా నరికివేసే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశాడు. అతని మాటల్లోని వాస్తవాన్ని గ్రహించి ఎహెచ్‌క్యుకు ఫోన్‌చేసి కాశీం రజ్వీ ని పాకిస్థాన్‌కు పంపడానికి విమానాన్ని ఏర్పాటుచేయగలరా అని ప్రశ్నించాను. అది సాధ్యం కాదని ఆర్మీ కమాండర్ స్పష్టంచేశాడు.
మున్షీ పదే పదే చెప్పడంతో నిజాం రేడియో స్టేషన్‌కు వెళ్ళి ప్రసంగించారు. ఆ సందేశ పాఠాన్ని మున్షీయే స్వయంగా రాశాడు. ఐక్యరాజ్యసమితిలో ఉన్న హైదరా బాద్ ప్రతినిధుల బృందాన్ని తిరిగి వచ్చేయవలసిందిగా ఆదేశించానని నిజాం ఆ సందేశంలోపేర్కొనడం విశేషం. నిజాం తరువాత మున్షీ కూడా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. మరుసటి ఉదయం నిజాంను కలిసినప్పుడు రహస్యపత్రాలన్నిటినీ ధ్వంసం చేశారా? అని ప్రశ్నించాను. ఆయన తలూపారు. ఆ సాయంత్రం (18 వ తేదీ) మేజర్ జనరల్ జయంతినాథ్ చౌధురి నగరంలోకి ప్రవేశించారు.
హైదరాబా ద్ ఆర్మీ కమాండర్ ఆయనను తోడ్కొని బొల్లారం రెసిడెన్సీకి తీసుకువెళ్ళారు. నిజాం తరపున ఆయన వ్యక్తిగత దూతలుగా జుల్కాదర్ జంగ్, అబుల్ హసన్ సయ్యద్ అలీ, అలీయావర్‌జంగ్ తదితరులు బొల్లారం రెసిడెన్సీకి వెళ్ళి శుభాకాంక్షలు తెలి యజేశారు. మున్షీ సలహాపై తాను ఏర్పాటు చేయదలచిన కొత్త ప్రభుత్వానికి చౌధు రి అనుమతి తీసుకొనే ఉద్దేశంతోకూడా నిజాం ఆ దూతలను పంపాడు. కొత్త ప్రభు త్వం ఏర్పాటుపై నిజాం సూచనలను వినడానికి జనరల్ చౌధురి తిరస్కరించారు. సైనిక శాసనాన్ని ప్రకటించనున్నట్టు ఆయన స్పష్టంచేశాడు. ఇది తెలిసి నిజాం ఖిన్నుడయ్యాడు.
‘లాయక్ అలీ, ఇది మన అవగాహనకు వ్యతిరేకం కదా’ అని అన్నారు. ‘అవగాహన ఏమిటని’ ప్రశ్నించాను. నిజాం నుంచి సమాధానం లేదు. నేను ఇంటికి తిరిగివచ్చాను. పోలీస్ చీఫ్ వద్ద నుంచి ఒక వార్తాహరుడు వచ్చి ఒక కవరు అందించాడు. మిలటరీ గవర్నర్ ఆదేశం మేరకు నన్ను గృహనిర్బంధం చేస్తున్నట్టు పోలీస్ చీఫ్ జారీచేసిన ఆదేశాలవి. కాశీం రజ్వీని ఏమి చేశారని ప్రశ్నిం చాను. అతన్ని రేపు ఉదయం అరెస్ట్ చేస్తామని ఆ వార్తాహరుడు సమాధానమిచ్చా డు. ఆ తరువాత కొద్ది సేపటికి కాశీం రజ్వీ నుంచి ఫోన్ వచ్చింది. రేపు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కు రమ్మంటారా అని ప్రశ్నించాడు. నాకు వెంటనే ఏమి చెప్పాలో తెలియ లేదు.
అతను ఎప్పటిలాగానే ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. మీకు ఎప్పుడూ నా ఇంట సాదర స్వాగతం లభిస్తుందని చెప్పాను. తనకు ఏమి జరగనున్నదో రజ్వీకి ఏమీ తెలిసినట్టుగా లేదు. అనుకోని దుర్ఘటనలేవైనా జరుగుతాయేమోనన్న సందే హంతో నేను దూరంగా పంపేసిన నాకుటుంబసభ్యులు ఊహించని రీతిలో ఆ రోజు తెల్లవారుజామున నన్ను చేరుకోవడం, అంత విషాదంలోనూ నన్ను ఉక్కిరిబిక్కిరి చేసిన అంశం.
విధి విధించిన ఆ విషాద ఘడియల్ని నాతో కలిసి పంచుకోవాలని ఎంతో ధైర్యంగా మరెంతో ప్రేమగా నా కుటుంబం నన్ను చేరింది. అప్పటికే భారత సైన్యాలు హైదరాబాదునగరాన్ని పూర్తిగా ఆక్రమించాయి. గృహనిర్బంధంలో ఉన్న నన్ను నా కుటుంబాన్ని ఏ క్షణాననైనా భారత సైన్యాలు చంపే అవకాశం ఉందని ఆదుర్దాగా ఎదురు చూస్తున్న మాకు గంటలు రోజులు నెలలు గడిచిపోయి వసంతా లుగా మారిపోయాయి. ఆ తరువాత గ్రంథస్థం చేయడానిక్కూడా నాకేమీ మిగ ల్లేదు.
అదొక అద్భుతమైన దైవానుగ్రహంతో కూడుకున్న విముక్తి!
పోలీసు చర్య’ పై నిజాం చివరి ప్రధాని లాయక్ అలీ కథనాన్ని సంకలనం చేసిన నిజామాబాద్ మాజీ ఎంపి ఎం. నారాయణరెడ్డి తన ముందుమాటలో ఈ విధంగా వ్యాఖ్యానించారు. ‘1724నుంచి 1948 వరకూ 224 సంవత్సరాలపాటు అసఫ్‌జాహీలు హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలించారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత విలీనానికి నిజాం అంగీకరించకపోవడంతో ఐదురోజుల పోలీసుచర్య అనివార్యమైంది.
సెప్టెంబరు 17వతేదీన నిజాం నవాబు భారత సైన్యానికి లొంగిపోయారు. అందువల్ల సెప్టెంబరు 17, 1948ను అప్పటి హైదరాబాద్ రాష్ట్ర ప్రజల స్వాతంత్య్రదినంగా భావిస్తారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో 1956లో సంస్థానంలోని మూడు ప్రాంతాలు పొరుగు రాష్ట్రాల్లో విలీనం కావడంతో హైదరాబాద్ రాష్ట్రం తన ఉనికినీ, గుర్తింపును కోల్పోయింది”.
తెలంగాణ విమోచన – సిహెచ్. విద్యాసాగర్ రావు జులై 16, 2007
Posted by Telangana Media in Telangana Articles.1 comment so far
వందేమాతర గీతాన్ని ఆలపించడానికి నిరాకరించిన ఉదంతం జాతి జీవనాన్ని కలచివేస్తుంది. వందసంవత్సరాల క్రితం స్వదేశీ, స్వజాతీ, స్వాతంత్య్ర ఉద్యమాల జ్వాలలను రగిల్చిన జాతీయ గేయంలోని ఆ చరణాలు తల్లి భారతికి ఆభరణాలు. కోట్లాది భారతీయులను ముందుకు నడిపించే కరదీపికలు! అలాంటి గీతానికి మతాల మకిలిని అంటించడం బాధ కలిగించింది. అదే విధంగా హైదరాబాద్ విమోచనోద్యమం ఫలించి విజయ కేతనాన్ని ఎగరవేసిన చరిత్రాత్మక రోజు 17 సెప్టెంబర్ 1948. భారతదేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు 1947 ఆగస్టు 15న స్వేచ్ఛావాయువులు పీల్చుకోగా, తెలంగాణ ప్రజలు స్వాతంత్య్రం కోసం ఇంకో ఏడాదికిపైగా ఎదురుచూడవలసి వచ్చింది. చివరికి సెప్టెంబర్ 17న భారత సైన్యం నిజాం మెడలువంచింది. ఈ విజయోత్సవాన్ని అధికారికంగా ప్రభుత్వం నిర్వహించకపోవడం కోట్లాది తెలంగాణ ప్రజల మనోభావాలను కించ పరచడమే అవుతుంది. గతంలో హైదరాబాద్ సంస్థానంలో ఉండి, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ తరువాత, మహారాష్ట్రలో కలసిన 5 జిల్లాలు, కర్ణాటకలో కలసిన 3 జిల్లాలలో అక్కడి ప్రభుత్వాలు ప్రతియేటా సెప్టెంబర్ 17న విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నాయి. మన రాష్ట్రంలో మాత్రం దీన్ని పట్టించుకోలేదు. ఆంధ్రప్రదేశ్ అవతరణ తరువాత కూడా- మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు నిర్వహించినట్టుగా అధికారికంగా 17 సెప్టెంబర్ నాడు తెలంగాణ జిల్లాలలో విమోచన ఉత్సవాన్ని జరపడంలో ఎందుకు సందేహిస్తున్నారో అనే అంశం అందరినీ ఆలోచింపచేస్తుంది. బాధను కలిగిస్తుంది. ఇంతవరకు అధికారికంగా ఈ ఉత్సవాన్ని జరపక పోవడమే ఘోరతప్పిదం. దాన్ని సవరించడం ఆదర్శప్రాయమవుతుంది. కోట్లాది ప్రజల మనోభావాలను గౌరవించడమే కాకుండా భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అయితే ఈ విమోచన అనేది మస్లింలపైన హిందువుల విజయంగా పరిగణించి మ్‌ుస్లిం సోదరులు వ్యతిరేకిస్తారేమో అనే అనుమానాన్ని నర్మగర్భంగా తెలియజేస్తున్నది ప్రభుత్వం. వాస్తవానికి తెలంగాణ విమోచన దేశ స్వాతంత్య్ర పోరాట క్రమంలోనే కొనసాగిన వీరోచిత పోరాట ఫలితమని, ఎంతో మంది ముస్లిం సోదరులు ఇందుకోసం బలిదానం చేశారని గుర్తుంచుకోవాలి. తురేబాజ్ ఖాన్ (1857), షోయబుల్లా ఖాన్ (1948) లాంటి వారు తమ ప్రాణాలను త్యాగం చేసిన నిజాన్ని మనం మరువరాదు. నిజాంకు, రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో అనేకమంది ముస్లిమ్‌లు పాల్గొన్నారు. కాబట్టి తెలంగాణ విమోచన ముస్లింలకు వ్యతిరేకమన్న తప్పుడు అభిప్రాయాన్ని ప్రభుత్వం తొలగించుకోవాలి. షోయబుల్లాఖాన్ లాంటి పత్రికా సంపాదకుని విగ్రహాన్ని మనం ప్రతిష్టాపన చేసుకోక పోవడం అవమానకరం అన్న సత్యాన్ని గ్రహించాలి. విమోచన దినోత్సవం జరుపుకోవడంపై కమ్యూనిస్టు సోదరులు ఖచ్చితంగా తమ అభిప్రాయాన్ని తెలియజేయకపోవచ్చు. ఎందుకంటే వారు 1951 వరకు భారతదేశంపైన తమ పోరాటాన్ని కొనసాగించారు. అయితే ఈ విమోచన దినాన్ని వారు వ్యతిరేకిస్తారని అనుకోవడం పొరపాటు. ఈ కుంటి సాకులన్నిటినీ ప్రభుత్వం తెరమీదకి తీసుకొనివచ్చి కాలయాపన చేస్తున్నది. ప్రత్యేక తెలంగాణ వ్యతిరేక ప్రభుత్వం కాబట్టి, విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తే ప్రత్యేక తెలంగాణ వాదానికి బలం చేకూరుతుందేమోనన్న భయం ఆవరించి వుందనేది అసలు రహస్వమని బహిర్గతమౌతోంది. అయితే ఇది ఏ ప్రాంతవాసులకూ వ్యతిరేకం కాదనేది మహారాష్ట్ర, కర్ణాటక ప్రజలు బహిర్గతం చేశారు. ఏది ఏమైనా ప్రభుత్వం వచ్చే సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా ప్రకటించి, అధికారికంగా ఉత్సవాలను నిర్వహించాలని సర్వత్రా కోరుతున్నారు.
- సిహెచ్. విద్యాసాగర్ రావు
కేంద్ర మాజీ మంత్రి

