తెలంగాణకు అధిష్ఠానమే అడ్డు! మార్చి 15, 2008
Posted by Telangana Media in Eenadu, Telangana news.add a comment
వైఎస్ దేముంది
ఉంటే రాజ్‌భవన్‌లో ఉండేవాడిని
కేవీపీ నాకు ద్రోహం చేశారు
ఉప ఎన్నికల్లో పోటీ చేయకుంటే మంచిది
అధిష్ఠానం ఏమంత బలంగా లేదు: ఎమ్మెస్
హైదరాబాద్ – న్యూస్‌టుడే
కాంగ్రెస్ సీనియర్ నేత
ఎం.సత్యనారాయణరావు మరోసారి సంచలనం సృష్టించారు. ప్రత్యేక తెలంగాణకు కాంగ్రెస్ అధిష్ఠానమే అడ్డని ప్రకటించారు. ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి మనోభావాలతో సంబంధం లేకుండా… అధిష్ఠానం ఇవ్వదల్చుకుంటే తెలంగాణను ఇచ్చేయొచ్చని అన్నారు. ముఖ్యమంత్రి సన్నిహితుడు కేవీపీ తనకు ద్రోహం చేశారని వ్యాఖ్యానించారు. వైఎస్‌కు తానిచ్చినంతటి మద్దతును ఎవరూ ఇవ్వలేదని, దీనికోసం తాను ఇతర కాంగ్రెస్ సీనియర్ల నుంచి ఇబ్బందులెదుర్కొన్నానని ఆవేదన చెందారు. శాసనసభ లాబీల్లో ఎమ్మెస్ విలేకరులతో మాట్లాడారు. విలేకరుల ప్రశ్నలు… ఎమ్మెస్ స్పందనలూ…
తెలంగాణ బంద్ సంపూర్ణం మార్చి 15, 2008
Posted by Telangana Media in Eenadu, Telangana news.add a comment
జిల్లాల్లో విజయవంతం
రాజధానిలో పాక్షికం
సచివాలయ ముట్టడికి యత్నం
అగ్రనేతల అరెస్టు
రాష్ట్రవ్యాప్తంగా 8వేల మంది అదుపులోకి
ఉప ఎన్నికల్లో మెజార్టీ సీట్లు మావే మార్చి 12, 2008
Posted by Telangana Media in AndhraJyothy, Telangana news.add a comment
కోమటిరెడ్డి వెంకటరెడ్డి
హైదరాబాద్, మార్చి 11 (ఆన్‌లైన్): తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజాప్రతినిధులు రాజీనామా చేసిన లోక్‌సభ,శాసనసభ నియోజకవర్గాలకు జరిగే ఉప ఎన్నికల్లో మెజారీటీ సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.శాసనసభా ప్రాంగణంలో మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు.
నేనెందుకు రాజీనామా చేయాలి: దామోదర్‌రెడ్డి మార్చి 12, 2008
Posted by Telangana Media in AndhraJyothy, Telangana news.add a comment
హైదరాబాద్, మార్చి 11 (ఆన్‌లైన్): “పార్టీలను మార్చే అలవాటున్న ఉప్పునూతల నేను రాజీనామా చేయాలంటూ సవాల్ చేయడం అర్థరహితం. నేనెందుకు రాజీనామా చేయాలి”- అని మంత్రి దామోదర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ అంశాన్ని సోనియా చేతుల్లో పెట్టామని, ఆమె ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామని, రాజీనామాలు చేయబోమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ శాసనసభాపక్ష కార్యాలయంలో మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు.
తెలంగాణ కోసం మెడలు కోసుకుంటాం మార్చి 12, 2008
Posted by Telangana Media in AndhraJyothy, Telangana news.1 comment so far
తలవంచేది లేదు పీఠమెక్కించిన గులాబీ కండువే కాలనాగై కాటేస్తుంది
అభినందన సభలో కాంగ్రెస్‌కు కేసీఆర్
హెచ్చరిక కాంగ్రెస్‌ను నిలదీయండి: జయశంకర్
హైదరాబాద్, మార్చి 11 (ఆన్‌లైన్): తెలంగాణ కోసం అవసరమైతే మెడలు కోసుకుంటామే తప్ప ఎలాంటి పరిస్థితుల్లోనూ తలవంచేది లేదని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టంచేశారు. కాంగ్రెస్ నేతలకు పదవులు, కిరీటాలు తెచ్చిపెట్టిన గులాబీ కండువాయే కాలనాగై కాటేస్తుందని హెచ్చరించారు. తెలంగాణ విషయంలో పూటకో మాట,పేటకో మాట మాట్లాడుతూ.. బద్మాష్ గిరీ చేస్తోన్న కాంగ్రెస్ నేతలు అంతకు అంత అనుభవిస్తారని ఆయన శపించారు. ఇటీవల సామూహిక రాజీనామాలు చేసిన టీఆర్‌ఎస్ నేతలకు మంగళవారం హైదరాబాద్‌లో తెలంగాణ సంఘాల ఆధ్వర్యంలో ఘన సన్మానం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేసీఆర్ కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు. “గజకర్ణ, గోకర్ణ, టక్కుటమార విద్యలతో ప్రజలను మోసం చేయాలని కాంగ్రెస్ నేతలు చూస్తున్నారు.
మెడలు కోసుకుంటాం మార్చి 12, 2008
Posted by Telangana Media in Eenadu, Telangana news.add a comment
మెడలు కోసుకుంటాం
రాజీలేని పోరు చేస్తాం
తెలంగాణ ఇస్తరో, ఇయ్యరో సీదా చెప్పుండ్రి
కాంగ్రెస్ నేతలకు కేసీఆర్ సవాల్
హైదరాబాద్ – న్యూస్‌టుడే
”ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం దిశగా అంతిమపోరాటం ఆసన్నమైంది. ప్రజలు, విద్యావంతులు, ఉద్యోగుల దీవెనలు మాకున్నాయి. తెలంగాణ కోసం ప్రజాస్వామ్య పద్ధతుల్లో రాజీలేని పోరాటం చేస్తున్నం. ఇందుకోసం మెడలు కోసుకుంటాం తప్ప మెడలు వంచం.
కలిసుందాం రండి… మార్చి 12, 2008
Posted by Telangana Media in Eenadu, Telangana news.add a comment
కలిసుందాం రండి…
కాంగ్రెస్ గెలుపుతోనే మన మనుగడ
తెలంగాణ ఎంపీలకు వైఎస్ పిలుపు
జైపాల్‌రెడ్డి విందులో ఉల్లాసంగా ముఖ్యమంత్రి
తెలంగాణకే కట్టుబడ్డా: కాకా
ఆంధ్రనేతలు మాటలాపాలి: వీహెచ్
న్యూఢిల్లీ – న్యూస్‌టుడే
మధుయాష్కీతో ఆలింగనం…
కాకాతో ఆత్మీయ కరచాలనం…
జైపాల్‌రెడ్డి, వీహెచ్‌లతో ప్రేమపూర్వక పలకరింపులు…
ఇతర కాంగ్రెస్ ఎంపీలతో సరదా సరదా కబుర్లు…
అంతా ఒక్కటిగా ఉందామని సున్నిత సందేశం…




