jump to navigation

టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల రాజీనామా మార్చి 4, 2008

Posted by Telangana Media in TRS.
add a comment

టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల రాజీనామా(Andhra Jyothy paper 4/3/2008) 

హైదరాబాద్‌, మార్చి 4ః అసెంబ్లీ వాయిదాపడిన అనంతరం స్పీకర్‌ సురేష్‌రెడ్డి తెలంగాణ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం తమకు వాగ్ధానంచేసి ఇప్పుడు మోసం చేసిందని అంచేత మేమంతా రాజీనామాలు చేస్తున్నామని తెలంగాణ పక్షనేత విజయరామారావు అన్నారు. దీనిపై సభలో మాట్లాడేందుకు మాకు అవకాశం ఇవ్వాలని వారు కోరారు. దీనిపై స్పీకర్‌ స్పందించి చట్టప్రకారం నిబంధనలు లేవని తన విచక్షణాధికారం ఉపయోగించి నలుగురురి మాత్రమే మాట్లాడే అవకాశం ఇస్తానని స్పీకర్‌ తెలియజేశారు.

మొదటగా విజయరామారావు మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం మొదట తమతో కలిస్తే తెలంగాణ ఇస్తామని ఆశపెట్టిందని ఇప్పుడు అలా వాగ్ధానం చేయలేని అంటోందని, తమ వల్ల కాంగ్రెస్‌ ప్రభుత్వం గెలిచి ఇప్పుడు మాటమారుస్తుందని, ఇంత ధగా చేస్తుందని అనుకోలేదని, ఇక వారితో కలిసుండడం సాధ్యంకాదని అందుకే మేము రాజీనామా చేస్తున్నామని ఆయనన్నారు.

తరువాత నాయిని మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి దమ్ముంటే రాజీనామాలు చేసి మళ్ళీ పోటీ చేసి గెలవాలని సవాల్‌ చేశారు.

హరీష్‌రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నియోజకవర్గం కడప జిల్లా అభివృద్ధిపనులు, తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడారు. మరో ఎమ్మెల్యే రాజేందర్‌ కూడా మాట్లాడారు. అనంతరం 16 మంది ఎమ్మెల్యేలు తమ రాజీనామా పత్రాలను స్పీకర్‌కు అందజేసి సభ నుంచి బయటికి వెళ్ళిపోయారు.అదే విధంగా శాసనమండలిలోనూ ముగ్గురు టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు చైర్మన్‌ చక్రపాణికి తమ రాజీనామా లేఖలు అందజేశారు.