jump to navigation

రేపటినుంచి తెలంగాణ జిల్లాలన్నిట్లోనూ 144 సెక్షన్‌ డిసెంబర్ 8, 2009

Posted by Telangana Media in Telangana Articles.
4 వ్యాఖ్యలు

హైదరాబాదు: రేపటినుంచి తెలంగాణ జిల్లాలన్నింటిలోనూ 144 సెక్షన్‌ విధిస్తున్నట్లు విజిలెన్స్‌ ఐజీ అనురాధ చెప్పారు. అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని ఐజీ చెప్పారు (మరింత…)

ప్రకటనలు

10న ఎవరూ హైదరాబాదు రావద్దు: ఐజి డిసెంబర్ 8, 2009

Posted by Telangana Media in Telangana Articles.
2 వ్యాఖ్యలు

దరాబాదు: ఈనెల 10వ తేదీన నగరంలో ఎటువంటి ప్రదర్శనలు, ర్యాలీలు జరపడానికి అనుమతిలేదని ఐజి అనురాధ చెప్పారు. రేపటి నుంచి హైదరాబాదుతో సహా అన్ని తెలంగాణ జిల్లాలలో 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని తెలిపారు. (మరింత…)

విద్యార్థులపై జులుం వద్దు: సిపిఐ డిసెంబర్ 8, 2009

Posted by Telangana Media in Telangana Articles.
3 వ్యాఖ్యలు

హైదరాబాదు: విద్యార్థులు చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమానికి సిపిఐ పూర్తి మద్దతు ప్రకటిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ చెప్పారు. (మరింత…)

తెలంగాణసాధనే లక్ష్యంగా ఉద్యమం: జెఎసి కన్వీనర్‌ స్వామిగౌడ్‌ డిసెంబర్ 8, 2009

Posted by Telangana Media in Telangana Articles.
2 వ్యాఖ్యలు

హైదరాబాదు: తెలంగాణ సాధనే లక్ష్యంగా ఉద్యమం కొనసాగిస్తామని తెలంగాణ జెఎసి కన్వీనర్‌ స్వామిగౌడ్‌ చెప్పారు. (మరింత…)

మంత్రి దానం ఇంటిని ముట్టడించిన తెరాస డిసెంబర్ 8, 2009

Posted by Telangana Media in Telangana Articles.
2 వ్యాఖ్యలు

హైదరాబాద్‌ : తెలంగాణ విద్యార్థులు, తెరాస కార్యకర్తలు మంత్రి దానం నాగేందర్‌ ఇంటిని ముట్టడించారు. (మరింత…)

ఆరోగ్యం మెరుగుపడాలంటే కేసీఆర్‌ దీక్ష విరమించాలి : వైద్యులు డిసెంబర్ 8, 2009

Posted by Telangana Media in Telangana Articles.
add a comment

హైదరాబాద్‌ : నిమ్స్‌లో చికిత్స పొందుతున్న తెరాస అధినేత కేసీఆర్‌ ఆరోగ్యంపై వైద్యబృందం ఆందోళన వ్యక్తం చేసింది. ఆయన ఆరోగ్యం మెరుగుపడాలంటే తక్షణమే దీక్షను విరమించాలని వైద్యులు సూచించారు. (మరింత…)

“PRESS RELEASE” ఏప్రిల్ 29, 2008

Posted by Telangana Media in Telangana Articles.
1 comment so far
Mr. Pranab Mukherjee, Honr’ble External Affairs Ministry and Mr. E. Ahmed, Mininster of State External Affairs, Govt. of India  visited to Kingdom of Saudi Arabia last week. Utilizing with this opportunity a delegation of “Tanzeem Hum Hindustani” including Mohammed Quaiser, President THH, Imtiaz Ahsan, Secretary THH and Mirza Azmathullah Baig, Joint Secreatry, THH met the Honorable Ministers separatly and handed over a memorandum to them at Indian Emabssy and Riyadh Palace Hotel respectively and diverted their attention towards a number of issues facing by the NRIS’ including a demand to open a consulate office in Eastern Region of Saudi Arabia.
 
Mohammed Quaiser briefed to Ministers about the increase in thefts,  loots and snaching incidents in various cities specially in Riyadh. Indian citizens are becoming soft targets for calprits, emphasized that to take this matter up to the hingher authorities so as to save Indians by such incidents.
 
Tanzeem Hum Hindustani also representded to  do necessary arrangements for the certificate attestation by Foreign Affairs Ministery here itself after the varification of Indian Embassy in KSA. Presently certificates has to  be send to the Saudi Embassy in Delhi or in Saudi Consulate in Bombay and it is time consuming and also hectic for the needy people to visit these places or to wait for a long  time for attestation.
 
Hum Hindustani also demanded to open consulate in Dammam as 30% of 1.6 Million Indians are working in Eastern Region and facing a number of difficulties in settling their embassy related issues.   A sizeable portion of NRIS are labours and it is a burden on them to come to Riyadh 500 KM away.
 
Hum Hindustani has pointedout to do necessary arragnements that NRIS should exercise their fundamental right of voting to choose the Governments.
 
It is also said in the memorandum that Govt. of  India should take necessary steps for the education of NRIS’ children and further in case of repatriation.  Govt. should introduce solid schemes for their employment and rehabiliation. Quaiser said NRIS are the major source of foreign exchange and instrumental in generating countrys revenue.
 
“Tanzeem Hum Hindustani” also demanded to the ministers to constitute a group containing public representatives, officials of external affairs & overseas ministry to study the problems of NRIS of Gulf in depth for working out the solutions.

– అల్లం నారాయణ ఏప్రిల్ 29, 2008

Posted by Telangana Media in Telangana Articles.
1 comment so far

చి తా భస్మం నుంచి లేచివచ్చిన ఫీనిక్స్‌ పక్షి.. టపటపా రెక్కలు కొట్టుకుంటున్నప్పుడు.. అలసిపోలేదా మిత్ర మా. కన్నీటి కాలాల ఆగడ్తల మధ్య. డస్సిపోలేదా మిత్రమా.. ఏండ్ల కేండ్లు ఏటికి ఎదురీదిన రెక్కలు. మూడున్నర దశాబ్దాల అనంతరం. నీ బలమైన ఒకప్పటి బాహువుల స్థానే.. కొంచెం పీలగా నరాలుతేలిన ఆ పిడికిలి ఆకాశంలోకి విసురుతూ ..నువ్వింకా..నీ ఆశయాలను పలకరిస్తూ… ఆ తుపాను తెమ్మెర లాగే ఉంటూ.. ఇంకా ఉన్నందుకు.. ఇంకా మిగిలినందుకు.. కలలు తెగిపడ్తున్న బీభత్స దృశ్యాల్లోనూ కొన ఊపిరుల మంట లు సాస్తున్నందుకూ.. కానీ మిత్రమా… పడమటిగాలి మింగే స్తున్న తూరుపుగాలిలో ఫీనిక్స్‌లు మళ్లీ చితా భస్మాలవుతున్న ఒక కానికాలం.

(మరింత…)

పోరాడితే పోయేదేమిటో? మార్చి 29, 2008

Posted by Telangana Media in AndhraJyothy, Pranahita.
3 వ్యాఖ్యలు

– అల్లం నారాయణ

ఔ ను కామ్రేడ్స్‌.దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉంది. ఒకటా రెండా.. నూటపదకొండు సమస్యలచిక్కుముడుల మధ్య చిక్కుపడిన దారపు ఉండలా ఉంది. దరిద్రంగా ఉంది. రైతులు నాగేటి చాళ్ళలో మృత్యుసేద్యం చేస్తున్నారు. పేదలు పేదలుగానే, ధనికులు మరింత ధనికులుగానే… ఉన్నో డు ఉన్నతికి,లేనోడు అధఃపాతాళానికి పోతానే ఉన్నారు. నిజమే కామ్రేడ్స్‌…కమ్యూనిస్టుపార్టీ పుట్టి దశాబ్దాలు గడిచిపోయినా, ఏదీరాలేదు. ఏదీపోలేదు. సోషలిజం వీధుల్లో మూర్ఛనలు పోతూనే ఉన్నది. వరల్డ్‌బ్యాంక్‌ తోలుబొమ్మలాటలో ఏలికలు తైతక్కలాడుతూనే ఉన్నారు. కొంత నెత్తుటి తర్పణా జరిగింది. కొన్నివేలమంది వీరులూ మరణించారు.

 

(మరింత…)

కూలిన గులాబీ తోట మార్చి 29, 2008

Posted by Telangana Media in AndhraJyothy, Pranahita.
add a comment

– అల్లం నారాయణ

ఏటా కోటీ ఇరవైలక్షల మంది నీ గులాబీతోటను తొక్కుకుంటూ తోసుకుంటూ ఎగిరిపోతారిక లోహవిహంగాల రెక్కలపైన. నీ ఎకరం గులాబీ తోట పక్కవాళ్ళ వందలాది ఎకరాల చేనుచెలక, ఆ పక్కవాళ్ళ కూరగాయల మళ్ళను మాయం చేసి నాలుగున్నర కిలోమీటర్ల పెట్టున వేసినారు చూడు… అది రన్‌వే. అతి పొడవైనది. అదొక కొండచిలువకూడా. దానికడుపులో దాగున్న నీ గులాబీతోట, వేల ఎకరాల తోటలు వాడిపోయినయ్‌. ఆవుల చంద్రమ్మా, సుభద్ర, రాజవ్వ, మల్లవ్వ, రాజపోషవ్వ పేరేదైతేనేం భూమి పుత్రికా. ఎవరో ఒకరు ఎగిరిపోవడానికి నేలమీద వేళ్ళూనుకున్న మీలాంటి లక్షలాదిమంది నేలబంధం తెగిపోవడం ఎవరికి మాత్రం ఎందుకు పడుతుంది లక్ష్మక్కా! తలకిందులుగా చూసినప్పుడు కదా… కొంచెమైనా అసలు సత్యం బోధపడేది.

(మరింత…)

తాజా మృత్యుగీతం మార్చి 29, 2008

Posted by Telangana Media in AndhraJyothy, Pranahita.
add a comment

– అల్లం నారాయణ

ఫ్రెష్‌.. రిలయన్స్‌ ఫ్రెష్‌..కాదు.. ఇప్పుడు రైతులను తవ్వి తలబోసుకుంటున్న మాజీ ఏలికగారి హెరిటేజ్‌ ఫ్రెష్‌ కూడా కాదు. నెత్తిన ఫ్రెష్‌గా తలపాగాతో, కంకాళాల మీద కూచొని తాజాగా రైతు ప్రవచనాలు వల్లిస్తున్న ‘మెస్సయ్య’ గురించీ నేను మాట్లాడడం లేదు. తాజా గా మరణించిన నాగలి మోసిన క్రీస్తురైతు గురించి చెబుతు న్నా. 60వేల కోట్ల రుణాల మాఫీకి ముందే బంధవిముక్తుడైన ఒక కరీంనగర్‌ రైతు ‘ఫ్రెష్‌డెత్‌’ గురించిన వారెంట్‌ ఇది. బహుశా ఇప్పటికిప్పుడు.. ఒకరు రాజీనామా చేస్తే మరొకరికి ‘డెత్‌వారెంట్‌’ అవుతుందన్న విషయమూ మాట్లాడడం లేదు. 60 వేల కోట్ల రుణాల మాఫీ తాజా ఆత్మహత్యలనెందు కు ఆపలేదన్నది జవాబులేని ప్రశ్న కూడా కాదు. అతను పత్తి పండించనప్పుడు పత్తి ధరలు వెలుగులు చిమ్మింది. అతను మిర్చితో విసిగిపోయినప్పుడు మిర్చి ధర ‘రెడ్‌’ మార్క్‌ దాటింది.

 

(మరింత…)

జనవనం మనాది మార్చి 29, 2008

Posted by Telangana Media in AndhraJyothy, Pranahita.
1 comment so far

– అల్లం నారాయణ

కన్నెపల్లి అడవిలో దాగున్న రహస్యం. ములుగు రోడ్డు పంటపొలాలను మోసుకుంటూ, గోవిందరావుపేట, పసి రె దాటితే నార్లాపూర్‌ మలుపు రోడ్డు విస్తరించి ఉన్నది. నీటి వనరున్నచోట కాకాతీయుల కళాశిల్ప వైభవంగా చరిత్రలో విలసి ల్లిన గుడికి దూరంగా రోడ్డు. రామప్పలేక్‌. రెండు కొండలు అటూ ఇటూ సమున్నతంగా నిలుచుండగా మధ్యలో పురా విశ్వాసాల మట్టికట్ట. జల సముద్రం. రోడ్డుపొంట దూరంగా బ్యాక్‌ వాటర్స్‌. కొంచెం నల్లగా, నీలిగా ఆ నీటి వనరు అధరువు గా అక్కడక్కడా పచ్చటి పంట పొలాలు. గోవిందరావుపేట, పసిరెలు రెండూ తొలి వలస ప్రాంతాలు. బహుశా ఈ గిరిజన సమూహాల్లోకి, మేడారం జాతర సాన్నిహిత్యంలోకి వచ్చిన ఈ ఆంధ్ర ప్రాంతపు వలసలు రామప్ప చెరువు ఆయకట్టు వల్ల వచ్చి ఉంటాయి. నార్లాపూర్‌ అటవీ పరిమళం అడవి విస్తరించిన మేరా. కొట్టేసిన చెట్ల ఖండిత మొండాలు.

(మరింత…)

సృష్టికర్తల విలాపం మార్చి 29, 2008

Posted by Telangana Media in AndhraJyothy, Pranahita.
add a comment

– అల్లం నారాయణ

త్రిశంకు స్వర్గం. ఇంకా అయిపోని తాండవం. ఉత్త తాపడాల తో ఏమి ఒరుగుతుంది. ఉత్త పూతలతో ఏ రోగం నయమవుతుందని? అంతం కానిదిది. ఆరంభం కూడా కాదు. చాలా దూరం గడిచి వచ్చిన తర్వాత చేతివృత్తుల చేతులిరగడం గురిం చి కదా…చితి చింత. సిరిసిల్ల గుల్లగుల్లయిపోయి, వాకిళ్ల మొలచిన రాళ్లబండలైపోయిన బతుకుల్ల అగ్గిమల్లే ఎట్లా పుట్టిందో? ఎన్నని చెప్పను. ఏది మొదలు…ఏది కొస. బీసీల గురించిన ప్రవచనాలు పలుకుతున్న మహాత్ములారా! బాబూ! తొంభైమూడు కులాల పేరుపేరునా చదివినందుకు ధన్యవాదాలు. కానీ వాళ్లేం చేస్తారో? ఏమి చేసి బతుకుతారో? వాళ్ల బతుకు ఏ సర్కర్‌తీగలు తెగిన వీణలయ్యాయో? తెలుసా! పురి తప్పిన దారం ఎక్కడ తెగిపోతుందో? కూలిపోయిన మగ్గా న్ని అడుగు.

(మరింత…)

నోర్మూసుకోండి… మార్చి 29, 2008

Posted by Telangana Media in AndhraJyothy, Pranahita.
add a comment

 – అల్లం నారాయణ

ప్రపంచ బ్యాంకు రుణాలొస్తు న్నాయి. అభివృద్ధి పధాన పయనిస్తున్నప్పుడు ఇందిరమ్మ ఇళ్లు తీసుకోండి, నిధులు పారుతున్నప్పుడు కాసుల గలగలతో అభివృద్ధి పధంలో మాత్రమే నడవండి… అందాకా…. కాస్త నోరు మూసుకోండి.

కొంచెం నోరు మూసుకుంటారా! ఆవల చాలా అభివృద్ధి చెయ్యాల్సి ఉన్నది. భూమిని చాప చుట్టాల్సి ఉన్నది. ఈ మహానగరం చుట్టూ రింగురోడ్డు మహాసర్ప పరిష్వంగాన్ని బిగించాల్సి ఉన్నది. కొంచెం ఆ గొణగడం… సణగడం ఆపుతారా! బుల్‌డోజ్‌ చేస్తున్న అభివృద్ధి పథ ఘట్టన ల్లో రణగొణ, గణగణ గంటల మోతల మధ్య మాటలెందుకు? వీరప్ప మొయిలీ కర్ణాటక అయినా ఆయనకు తెలంగాణ నాడి బాగా తెలుసు. తెలంగాణ ఆత్మలు మాట్లాడుకుం టున్న ఘోషలూ తెలుసు. అందుకే ఛీ అని కొందరు పనిలేని వాళ్లు ప్రేలాపనలు చేసినా తెలంగాణకు రెండో ఎస్సార్సీయే పరిష్కారం అంటే అని వుండవచ్చు కాక.

(మరింత…)

‘శోష’ లిజం మార్చి 29, 2008

Posted by Telangana Media in AndhraJyothy, Pranahita.
1 comment so far

అల్లం నారాయణ

సారీ.. డియర్‌ లేట్‌ రాబర్ట్‌ ఓవెన్‌. సోషలిజం ఇంకెంత మాత్రం మాకు ఒప్ప దు. పెట్టుబడిదారీ దేశంలో ఒక పెట్టుబడి దారుగా.. సమాజ గర్భంలో పెట్టుబడిదారీ సమాజం తెచ్చిన అసమానతల, రెండు భిన్న ప్రపంచాల, పెరుగుతున్న అంతరాల మహా స్వరూపం నీకు అర్థమైనట్టుగా.. ఇన్నాళ్లకు మాకు అర్థం కానందుకు సారీ ఓవెన్‌.. అయితే మేం కమ్యూనిస్టులం.. కాదుకాదు మార్క్సిస్టులం.. ఒకరొకరుగా ఆఖరు దుర్గం గా భ్రమపడిన తల నిజంగానే పండిన స్వప్రకటిత మార్క్సిస్టు మేధావులు లొంగిపోతున్నారు. సామ్యవాదానికి ముందు పెట్టుబడి దారీ విధానం భారతీయ సమాజంలో ..కాదు కాదు.. బెంగాల్‌లో సామాన్యుడికి, పెట్టుబడిదారునికి, మధ్య తరగతికి జీవనప్రమాణాలు మెరుగుపరుస్తుందని, ఉపాధి కల్పిస్తుందని, ఉద్యోగాలిస్తుందని కామ్రేడ్‌ బుద్ధదేవ్‌ భట్టాచార్య(సింగూరు, నందిగ్రామ్‌ఫేమ్‌), ముందూ.. ఆయన వెనుక తోక కురువృద్ధుడు జ్యోతిబసు బయలు దేరారు.

(మరింత…)

ఎవ్రీబడీ క్రైస్‌… మార్చి 29, 2008

Posted by Telangana Media in AndhraJyothy, Pranahita.
add a comment

– అల్లం నారాయణ

తలుపు తోసుకుని మృత్యువు అనాగరికంగా, అమెరికాలాగా వస్తుందని ఊహించి ఉండమేమో కదా! కిరణ్‌ దుఃఖం మా కుటుంబాన్ని వదలడం సాధ్యమా! పనిలో సరే! పదిమందిలో సరే! భ్రాంతిలో ఏకాంతంలో జ్ఞాపకాలు జ్ఞాపకాలుగా, శకలాలు శకలాలుగా అంతూ దరీలేని శోకం వెన్నాడి ఉండడం మేమెప్పుడూ ఎరగం. సాదాసీదా మనుషులం. యవ్వన ప్రాభవాల్లో తెలిసిన మృత్యువుతో సయ్యాటలాడిన వాళ్లం. తెలిసిన శత్రువుతో యుద్ధాలు చేసిన వాళ్లం. చెట్లకు కట్టిన తరువాత కూడా కరుడుగట్టిన రాజ్యానికి కరుణ కలుగుతుంది. ఇది స్వదేశీ మృత్యు రహస్యం అని తెలుసుకోగలిగిన అనుభవం పొందిన వాళ్లం. ఎల్లలెరగని సరిహద్దుల్లో జ్ఞాత, అజ్ఞాత బతుకుపొరల్లో తృటిలో, కనుమెరుపు చాటున బతికి బట్టకట్టిన మామూలు మనుషులం.

(మరింత…)

విరోధాభాస మార్చి 29, 2008

Posted by Telangana Media in AndhraJyothy, Pranahita.
add a comment

– అల్లం నారాయణ

కడుపులో పుట్టెడు జ్వరం-నలభై ఐదు డిగ్రీల ఎండకాస్తున్నట్లు- ‘విస్వూయస్‌’ అగ్నిపర్వతం అంటుకున్నట్టు. జ్వరమాని కొలమానం దాటుతున్నది-నూటా ఆరు డిగ్రీల జ్వరం.మెదడులో పేలుతున్నవి జ్వరమృదంగపు ధ్వనుల ప్రేలాపనలు.

(మరింత…)

‘నాతోని గాదు’ మార్చి 29, 2008

Posted by Telangana Media in AndhraJyothy, Pranahita.
5 వ్యాఖ్యలు

– అల్లం నారాయణ

నిజామ్‌కు మొక్కుమంటవా !
దొరా !
నీబాంచెన్‌.
నిజాం ఏడేడు తరాలకు
దండేసి దండం పెట్టమంటవా !
ఆయనకే కాదు. తెలంగాణను పొరుకపోడుచేసిన జాగీర్దార్లు, జమీందార్లు, దేశ్‌ముఖ్‌లు, రెడ్లు, వెలమదొరలకు కూడా సాగిలపడి సలామ్‌ చెయ్యమంటవా ! ఎన్నేండ్లు మొక్కమంటవు.ఎన్నేండ్లు బాంచెగిరిచెయ్యమంటవ్‌.

(మరింత…)

‘తాజా’ సంక్షోభం మార్చి 29, 2008

Posted by Telangana Media in Pranahita.
add a comment

 – అల్లం నారాయణ

24edit1.jpgవేలమంది ఏకైక జీవ నాధారమైన సహస్ర వృత్తుల సమస్త జీవన వ్యాపారాలను కూలగొట్టే- నయా, తాజా కుట్రల గుట్టేమిటి ? ఇక ఏమి మిగిలింది? అరకిలో వంకాయలు, పావుకిలో బెండకాయలు, కిలో టమాట, కొంచెం ఉప్పు, కొన్ని మిరపకాయలు, కొంతపప్పు.. తోడుగా ఒక సంచీ, మూడురోజులయినా శీతలం దెబ్బకు వాడిపోని వంకాయ, అద్దాల్లోంచి మెరుస్తున్నది. తళతళలాడే టమాట ఊరిస్తున్నది. పైపూతలు భ్రమింపజేస్తున్నవి.   (మరింత…)

ఇక యుద్దమే మార్చి 16, 2008

Posted by Telangana Media in AndhraJyothy.
1 comment so far

aj-1.jpgaj-2.jpg