jump to navigation

అదొక అద్భుతమైన విముక్తి (Andhra Jyothy) సెప్టెంబర్ 19, 2007

Posted by Telangana Media in Telangana Articles.
trackback

కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై నిజాం సూచనలను వినడానికి జనరల్‌ చౌధురి తిరస్కరించారు. సైనిక శాసనాన్ని ప్రకటించనున్నట్టు ఆయన స్పష్టంచేశాడు. ఇది తెలిసి నిజాం ఖిన్నుడయ్యాడు. ‘లాయక్‌ అలీ, ఇది మన అవగాహనకు వ్యతిరేకం కదా’ అని అన్నారు. ‘అవగాహన ఏమిటని’ ప్రశ్నించాను. నిజాం నుంచి సమాధానం లేదు.

సెప్టెంబర్‌ 17వతేదీ. ‘ఇంటికి వెళ్ళి కొంచెం సేపు విశ్రాంతి తీసుకోమని’ జనరల్‌ స్టాఫ్‌ సీనియర్‌ అధికారులు నాకు నచ్చచెప్పారు. గత రెండు రాత్రులుగా నాకు నిద్రేలేదు. ఇంటికి వెళ్ళి నిద్రపోవడానికి సిద్ధమవుతుండగా బీబీనగర్‌ పరిసరా లలో భారీ కాల్పుల శబ్దాలు విన్పిస్తున్నాయని బీబీనగర్‌ రైల్వేస్టేషన్‌ మాస్టర్‌ నుంచి సమాచారమందిందని సిబ్బంది తెలియజేశారు. దిగ్భ్రాంతి చెందాను. భారత సైన్యం బీబీనగర్‌కు చేరిపోయింది!. యుద్ధం ప్రారంభమైన తరువాత నేను ఏ సంఘటనకూ ఇంతగా దిగ్భ్రాంతి చెందలేదు. ఆ దళాలు హైదరాబాద్‌కు నాలుగైదు గంటలలోనే చేరబోతున్నాయన్నమాట.

‘అంతా అయిపోయినట్టే’నని అనుకున్నా ను. స్నానంచేసి నమాజ్‌కు సిద్ధమవుతుండగా ఆర్మీ కమాండర్‌ వచ్చాడు. చాలా అలసిపోయివున్నాడు. హైదరాబాద్‌ సేనలు ఇంకెంతమాత్రం భారతసైన్యాన్ని నిలు వరించగల స్థితిలో లేవని చెప్పాడు. సాయంత్రంలోగా భారత సైనిక దళాలు రాజ ధానికి చేరవచ్చని చెప్పాడు. సాయుధ ప్రతిఘటన ఇక అసాధ్యం కనుక భారత్‌తో సంధి కుదుర్చుకోవడం మంచిదని సలహా ఇవ్వడానికి వచ్చానని కమాండర్‌ అన్నా డు. తూర్పు రంగంనుంచి ఏమైనా సమాచార మందిందా అని ప్రశ్నించాను. లేదని చెప్పాడు. బీబీనగర్‌కు భారత సైన్యం చేరినట్టు రైల్వేఛీప్‌ నుంచి సమాచారమం దిదని చెప్పాను. ఆర్మీ కమాండర్‌ ఆశ్చర్యపోయాడు.

అందరూ ఉత్కంఠతో వేచిచూస్తున్న భద్రాతామండలి సమావేశం క్రితంరోజు (16వ తేదీ) సాయంత్రం బ్రిటిష్‌ ప్రతినిధి అలెగ్జాండర్‌ కడోగాన్‌ అధ్యక్షతన జరి గింది.హైదరాబాద్‌ ప్రతినిధి బృందం సమర్పించిన దరఖాస్తును ఎజెండాలో చేర్చ వచ్చునా అనేదే ప్రధాన చర్చనీయాంశం.హైదరాబాద్‌ అంశాన్ని ఎజెండాలో చేర్చ డానికి సమావేశం అంగీకరించింది. ఇది కీలకమైన అంశం. ఏమంటే పూర్తిగా సాంకే తిక కారణాలతో హైదరాబాద్‌ దరఖాస్తును తిరస్కరించడానికి అవకాశముంది. సమావేశం ప్రారంభమవగానే శాశ్వత సభ్యదేశమైన నేషనలిస్ట్‌ చైనా ప్రతినిధి సియాంగ్‌ హైదరాబాద్‌ వివాదం పరిశీలనను 20వ తేదీకి వాయిదా వేయమని సూచించాడు.

తమ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రానందున తనకు కొంత వ్యవధి అవసరమని ఆయన అన్నాడు. అయితే హైదరాబాద్‌ విషయంలో తక్షణ నిర్ణయం తీసుకోవలసి ఉన్నందున కనీసం చర్చలను ప్రారంభించడాన్ని అయినా వాయిదావేయడానికి వీలులేదని అలెగ్జాండర్‌ కడోగాన్‌ స్పష్టం చేశాడు. పరోడి (ఫ్రాన్స్‌) ఆయనతో ఏకీభవించాడు.

బ్రిటిష్‌ పార్లమెంటు ఆమోదించిన ‘భారత స్వాతంత్య్రచట్టం’ అనంతరం హైదరాబాద్‌ హోదా ఏమిటనే విషయమై సభాధ్యక్షు డు మరిన్ని వివరాలను అందించాలని రష్యా ప్రతినిధి కోరారు. హైదరాబాద్‌ అంశా న్ని తక్షణమే పరిశీలించాలని అమెరికా, అర్జెంటీనా ప్రతినిధులు కోరారు. ప్రపంచం లో ఒక దేశం మరో దేశాన్ని ఆక్రమించుకొని అక్కడి ప్రజలను ఊచకోత కోస్తున్నప్పు డు బాధిత దేశ విజ్ఞాపనపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం తగదని వారు వాదిం చారు.

చివరకు ఓటింగ్‌ నిర్వహించగా ఎనిమిది దేశాలు హైదరాబాద్‌కు అను కూలంగా మొగ్గు చూపాయి. ఆ వెంటనే హైదరాబాద్‌ తరపున తమ వాదనను విన్పించాలని మొయిన్‌ నవాజ్‌ జంగ్‌ను భద్రతామండలి అధ్యక్షుడు ఆహ్వానిం చారు. జంగ్‌ సుదీర్ఘ వాదన విన్పించి హైదరాబాద్‌ విషయంలో మండలి తక్షణమే జోక్యం చేసుకొని రక్తపాతాన్ని నివారించాలని కోరారు. ఆ తరువాత భారత ప్రతి నిధి రామస్వామి మొదలియార్‌ తన వాదనలో భారత్‌ చర్యకు కారణాలేమిటో వివ రించాడు.

భద్రతామండలికి మొర పెట్టుకోవడానికి హైదరాబాద్‌కు అర్హత లేదన్నా రు. హైదరాబాద్‌ ఎన్నడూ స్వతంత్ర దేశంగా లేదని, ఈ విషయమై డాక్యుమెంటరీ రుజువులు సమర్పించగలమనిపేర్కొన్నాడు. రెండు వైపుల వాదనలు విన్న తరువా త సభ్య దేశాలు పరిస్థితిని సమగ్రంగా అధ్యయనం చేసేందుకు గాను చర్చను 20 వతేదీకి వాయిదా వేశాయి. హైదరాబా ద్‌ వివాదాన్ని భద్రతామండలి ఎజెండా లో చేర్చడం ఒక మౌలిక విజయం కాగా దానిపై చర్చను మూడు రోజులపాటు వాయిదా వేయడం చాల నిరుత్సాహం కల్గించింది.

ఆర్మీ కమాండర్‌ వెళ్ళిపోగానే నేను షా మంజిల్‌కు వెళ్ళాను. కరాచి నుంచి ముష్తాఖ్‌ అహ్మద్‌ పంపిన సందేశాలను అప్పటికే డీకోడ్‌ చేశారు. ఒక సందేశం లో పాకిస్థాన్‌ నాయకులు నన్ను వెంటనే హైదరాబాద్‌ను విడిచిరావాల్సిందిగా కోరుతున్నారని, భద్రతామండలి ఉచ్చు లో హైదరాబాద్‌ పడకుండా జాగ్రత్త వహించాలని హెచ్చరించారని ఉంది. ఉదయం 9.30 గంటలకు క్యాబినెట్‌ అత్యవసర సమావేశానికి ఆదేశించాను. ఇంతలో కాశీం రజ్వీ ఫోన్‌ చేసి కుశలం అడిగాడు. పరిస్థితి ఎంతగా విషమించిందో వివరించాను. ప్రశాంతంగా ఉండమనీ, ఎటువంటి మతతత్వ అల్లర్లు జరగకుండా చూడాలనీ అన్నాను. యుద్ధం ప్రారంభమైన తరువాత హైదరాబాద్‌లో ఎక్కడా ఎటువంటి అల్లర్లు జరగలేదన్న విషయాన్ని ఆయన గుర్తు చేశాడు. ఆ విషయాన్ని అంగీకరిస్తూనే మునుపటికంటే ఇప్పుడు మతసామరస్యాన్ని కాపాడవలసిన అవ సరమెంతైనా ఉందని స్పష్టంచేశాను.

తరువాత, నిజాం వద్దకు వెళ్ళాను. అప్పటికే ఆయన ఆర్మీ కమాండర్‌తో మాట్లా డారు. పారిస్‌లో భద్రతామండలి సమావేశం నిర్ణయాలపై అప్పుడే అందిన సమా చారాన్ని ఆయనకు తెలియచేశాను. ఇప్పటికే కాల్పుల-విరమణ తీర్మానాన్ని ఆమో దించని పక్షంలో చర్చల వలన ప్రయోజనమేముందని నిజాం ప్రశ్నించారు. శత్రు సైన్యం రాజధానిలోకి ప్రవేశిస్తే ఎంత రక్తపాతం జరుగుతుందో మీకు తెలియదా? గత కొద్దిరోజులుగా భారత సైన్యం ప్రవేశించిన పట్టణాల్లో ఎంతమంది ఊచకోతకు గురవుతున్నారో మీకు తెలియదా అని నిజాం ప్రశ్నించారు.

తెలుసని సమాధానమి చ్చాను. స్వాతంత్య్ర రక్షణకు ప్రాణాలు కోల్పోవడానికి కూడా నేను సంసిద్ధంగా ఉన్నాను. మీ (నిజాం) ఉద్దేశాలను అర్థం చేసుకొన్నాననీ, మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేనేమీ అడ్డు రాననీ ఆయనకు చెప్పాను. రాజీనామా చేయడానికి నిర్ణ యించుకున్నాననీ, నా క్యాబినెట్‌ సహచరులకు కూడా రాజీనామా చేయాలని సల హా ఇస్తానని చెప్పాను.

ఉదయం మొదలు యుద్ధరంగం నుంచి అందుతున్న సమాచారం, పరిస్థితిని పూర్తిగా తన అదుపులోకి తీసుకోవాలన్న నిజాం ఉద్దేశం, అది సాధ్యంకాని పక్షంలో ప్రస్తుత పరిణామాలతో తనకెలాంటి సంబంధం లేదని బహిరంగంగా ప్రకటించ డానికి ఆయన సంసిద్ధంగా ఉన్నారని క్యాబినెట్‌ సమావేశంలో వివరించాను. ఆ తరువాత తాజా పరిస్థితులపై తమ తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా తెలి యజేయమని నా సహచరులను కోరాను. తొలుత అందరూ చాలా సేపు మౌనంగా ఉండిపోయారు. చివరకు ఉప ప్రధాని పింగళి వెంకటరామారెడ్డి మౌనాన్ని వీడారు.

దేశం కోసం, సార్వభౌమికుని కోసం ప్రాణాలు అర్పించడానికి తాను సిద్ధంగా ఉన్నా నని ఆయన అన్నారు. పరిస్థితిని చక్కదిద్దగలనని నిజాం భావిస్తున్న పక్షంలో ఆయ నకు సర్వాధికారాలు అప్పగించడం మన విధి అని, ఆ తరువాత ఆయన ఆదేశాల ను శిరసావహించాలని రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ స్వాతంత్య్రాన్ని కాపాడుకోవ డం, ఘనత వహించిన ప్రభువుకు మద్దతుగా నిలబడటం మనలో ప్రతి ఒక్కరి విధి అని వెంకట రామారెడ్డి ఉద్వేగభరితంగా ప్రసంగించారు.

ప్రసంగం ముగించిన వెంటనే నా వైపు తిరిగి మీరు రాజీనా మా చేస్తే నేను మీతోపాటే రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. ఆ తరువాత ప్రతి మంత్రి ఇదే విధంగా తమ అభిప్రా యాలను వ్యక్తం చేశారు. భారత్‌ సేనల దురాక్రమణను అరికట్టడంలో విఫలమ యిన దృష్ట్యా ప్రభుత్వం రాజీనామా చేస్తోందంటూ నేను ప్రవేశపెట్టిన తీర్మా నాన్ని క్యాబినెట్‌ ఏకగ్రీవంగా ఆమోదిం చింది.

ఆ తీర్మానాన్ని తక్షణమే నిజాంకు పంపించాము. క్యాబినెట్‌ సమావేశం ముగిసిన కొద్ది సేపటికే వెంటనే వచ్చి తనను కలవమని నిజాం నుంచి నాకు కబురు అందింది. నేను నిజాం నివాసానికి వెళ్ళేటప్పటికి ఆయన పోలీస్‌ ఛీఫ్‌, ఆర్మీ కమాండర్‌తో కొత్త ప్రభుత్వం గురించి మంతనాలు జరు పుతున్నారు. లాయక్‌ అలీ నేతృత్వంలోని ప్రభుత్వం రాజీనామా చేసిందని, కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు వెంటనే పంపుతానని, భారత ప్రభుత్వ ప్రతినిధిగా మీరు సలహా ఇవ్వాలని నవాబు అప్పటికే కె.ఎం. మున్షీకి వర్త మానం పంపారు.

పోలీస్‌ ఛీఫ్‌, ఆర్మీ కమాండర్‌ వెళ్ళిపోయిన తరువాత మీరు అను కున్న విధంగా పరిస్థితులు ఉండబోవని నిజాంతో అన్నాను. నేను షా మంజిల్‌కు తిరిగివచ్చి రహస్యపత్రాలన్నిటిని ధ్వంసం చేయమని నా వ్యక్తిగత సిబ్బందిని ఆదే శించాను. దౌత్య సందేశాలకు సంబంధించిన కోడ్‌లను కూడా పూర్తిగా ధ్వంసం చేయమని చెప్పాను. కరాచీలోని హైదరాబాద్‌ ఏజెంట్‌ జనరల్‌ ముష్తాఖ్‌ అహ్మద్‌కు ప్రధాన మంత్రిగా చివరి సందేశం పంపుతున్నానంటూ ఒక సందేశాన్ని పంపాను. మరికొద్ది గంటల్లో మేము ఎవరమూ ఈ లోకంలో ఉండకపోవచ్చని, హైదరాబాద్‌ పతాకను సగర్వంగా నిలపాలని, మొయిన్‌ నవాజ్‌ జంగ్‌కు సమాచారాన్ని ఎప్పటిక ప్పుడు పంపించమని ఆ సందేశంలో పేర్కొన్నాను. పరిస్థితులు ఇలా దిగజారిపోవ డం పట్ల నా సిబ్బంది అంతా విషణ్ణ వదనులయ్యారు.

మధ్యాహ్నం రేడియో స్టేషన్‌కు వెళ్ళి సంస్థాన ప్రజలనుద్దేశించి ప్రసంగించాను. దురాక్రమణకు వచ్చిన భారత్‌ సేనలను నిలువరించడంలో విఫలమయినందున నేను, నా ప్రభుత్వం రాజీనామా చేశామని చెప్పాను. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉండి ఎటువంటి ఉద్రిక్తతలకు తావివ్వకూడదని విజ్ఞప్తి చేశాను. రేడియో ప్రసంగమనంతరం కారులో తిరిగివెళుతుండగా చౌరస్తాలు, దుకా ణాల వద్ద నా రేడియో ప్రసంగాన్ని వింటూ చాలామంది ప్రజలు గుమిగూడి ఉండ టం గమనించాను. పలువురు పిడికిళ్ళు ఎత్తి హైదరాబాద్‌ను రక్షించుకొంటామని నినాదాలు చేస్తున్నారు.

చాలామంది విలపిస్తున్నారు. నాకూ కళ్ళ వెంట నీళ్ళు కారా యి. షా మంజిల్‌కు వెళ్ళగానే కాశీంరజ్వీకి ఫోన్‌చేసి ప్రశాంతంగా ఉండాలని ప్రజల కు రేడియో ద్వారా విజ్ఞప్తి చేయమని చెప్పాను. రజ్వీ మొదట తటపాయించాడు. అయితే నేను నొక్కి చెప్పిన తరువాత రేడియో స్టేషన్‌కు వెళ్ళి హిందువులు, ముస్లిం లు కలసికట్టుగా ఉండాలని, మతసామరస్యానికి భంగం కల్గించకూడదని విజ్ఞప్తి చేస్తూ ప్రసంగించాడు.

నా మంత్రివర్గ సహచరుడైన రహీం విపరీతమైన ఆదుర్దాతో వచ్చి కాశీంరజ్వీని పాకిస్థాన్‌కు కాని, మరేదైనా విదేశానికి గాని పంపించి వేయడానికి తోడ్పడాలని కోరాడు. భారత్‌ సేనలు మనలనందరినీ కాల్చివేయవచ్చని, ముఖ్యంగా రజ్వీని నడిరోడ్డు మీద ముక్కలుముక్కలుగా నరికివేసే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశాడు. అతని మాటల్లోని వాస్తవాన్ని గ్రహించి ఎహెచ్‌క్యుకు ఫోన్‌చేసి కాశీం రజ్వీ ని పాకిస్థాన్‌కు పంపడానికి విమానాన్ని ఏర్పాటుచేయగలరా అని ప్రశ్నించాను. అది సాధ్యం కాదని ఆర్మీ కమాండర్‌ స్పష్టంచేశాడు.

మున్షీ పదే పదే చెప్పడంతో నిజాం రేడియో స్టేషన్‌కు వెళ్ళి ప్రసంగించారు. ఆ సందేశ పాఠాన్ని మున్షీయే స్వయంగా రాశాడు. ఐక్యరాజ్యసమితిలో ఉన్న హైదరా బాద్‌ ప్రతినిధుల బృందాన్ని తిరిగి వచ్చేయవలసిందిగా ఆదేశించానని నిజాం ఆ సందేశంలోపేర్కొనడం విశేషం. నిజాం తరువాత మున్షీ కూడా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. మరుసటి ఉదయం నిజాంను కలిసినప్పుడు రహస్యపత్రాలన్నిటినీ ధ్వంసం చేశారా? అని ప్రశ్నించాను. ఆయన తలూపారు. ఆ సాయంత్రం (18 వ తేదీ) మేజర్‌ జనరల్‌ జయంతినాథ్‌ చౌధురి నగరంలోకి ప్రవేశించారు.

హైదరాబా ద్‌ ఆర్మీ కమాండర్‌ ఆయనను తోడ్కొని బొల్లారం రెసిడెన్సీకి తీసుకువెళ్ళారు. నిజాం తరపున ఆయన వ్యక్తిగత దూతలుగా జుల్కాదర్‌ జంగ్‌, అబుల్‌ హసన్‌ సయ్యద్‌ అలీ, అలీయావర్‌జంగ్‌ తదితరులు బొల్లారం రెసిడెన్సీకి వెళ్ళి శుభాకాంక్షలు తెలి యజేశారు. మున్షీ సలహాపై తాను ఏర్పాటు చేయదలచిన కొత్త ప్రభుత్వానికి చౌధు రి అనుమతి తీసుకొనే ఉద్దేశంతోకూడా నిజాం ఆ దూతలను పంపాడు. కొత్త ప్రభు త్వం ఏర్పాటుపై నిజాం సూచనలను వినడానికి జనరల్‌ చౌధురి తిరస్కరించారు. సైనిక శాసనాన్ని ప్రకటించనున్నట్టు ఆయన స్పష్టంచేశాడు. ఇది తెలిసి నిజాం ఖిన్నుడయ్యాడు.

‘లాయక్‌ అలీ, ఇది మన అవగాహనకు వ్యతిరేకం కదా’ అని అన్నారు. ‘అవగాహన ఏమిటని’ ప్రశ్నించాను. నిజాం నుంచి సమాధానం లేదు. నేను ఇంటికి తిరిగివచ్చాను. పోలీస్‌ చీఫ్‌ వద్ద నుంచి ఒక వార్తాహరుడు వచ్చి ఒక కవరు అందించాడు. మిలటరీ గవర్నర్‌ ఆదేశం మేరకు నన్ను గృహనిర్బంధం చేస్తున్నట్టు పోలీస్‌ చీఫ్‌ జారీచేసిన ఆదేశాలవి. కాశీం రజ్వీని ఏమి చేశారని ప్రశ్నిం చాను. అతన్ని రేపు ఉదయం అరెస్ట్‌ చేస్తామని ఆ వార్తాహరుడు సమాధానమిచ్చా డు. ఆ తరువాత కొద్ది సేపటికి కాశీం రజ్వీ నుంచి ఫోన్‌ వచ్చింది. రేపు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కు రమ్మంటారా అని ప్రశ్నించాడు. నాకు వెంటనే ఏమి చెప్పాలో తెలియ లేదు.

అతను ఎప్పటిలాగానే ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. మీకు ఎప్పుడూ నా ఇంట సాదర స్వాగతం లభిస్తుందని చెప్పాను. తనకు ఏమి జరగనున్నదో రజ్వీకి ఏమీ తెలిసినట్టుగా లేదు. అనుకోని దుర్ఘటనలేవైనా జరుగుతాయేమోనన్న సందే హంతో నేను దూరంగా పంపేసిన నాకుటుంబసభ్యులు ఊహించని రీతిలో ఆ రోజు తెల్లవారుజామున నన్ను చేరుకోవడం, అంత విషాదంలోనూ నన్ను ఉక్కిరిబిక్కిరి చేసిన అంశం.

విధి విధించిన ఆ విషాద ఘడియల్ని నాతో కలిసి పంచుకోవాలని ఎంతో ధైర్యంగా మరెంతో ప్రేమగా నా కుటుంబం నన్ను చేరింది. అప్పటికే భారత సైన్యాలు హైదరాబాదునగరాన్ని పూర్తిగా ఆక్రమించాయి. గృహనిర్బంధంలో ఉన్న నన్ను నా కుటుంబాన్ని ఏ క్షణాననైనా భారత సైన్యాలు చంపే అవకాశం ఉందని ఆదుర్దాగా ఎదురు చూస్తున్న మాకు గంటలు రోజులు నెలలు గడిచిపోయి వసంతా లుగా మారిపోయాయి. ఆ తరువాత గ్రంథస్థం చేయడానిక్కూడా నాకేమీ మిగ ల్లేదు.

అదొక అద్భుతమైన దైవానుగ్రహంతో కూడుకున్న విముక్తి!
పోలీసు చర్య’ పై నిజాం చివరి ప్రధాని లాయక్‌ అలీ కథనాన్ని సంకలనం చేసిన నిజామాబాద్‌ మాజీ ఎంపి ఎం. నారాయణరెడ్డి తన ముందుమాటలో ఈ విధంగా వ్యాఖ్యానించారు. ‘1724నుంచి 1948 వరకూ 224 సంవత్సరాలపాటు అసఫ్‌జాహీలు హైదరాబాద్‌ సంస్థానాన్ని పరిపాలించారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత విలీనానికి నిజాం అంగీకరించకపోవడంతో ఐదురోజుల పోలీసుచర్య అనివార్యమైంది.

సెప్టెంబరు 17వతేదీన నిజాం నవాబు భారత సైన్యానికి లొంగిపోయారు. అందువల్ల సెప్టెంబరు 17, 1948ను అప్పటి హైదరాబాద్‌ రాష్ట్ర ప్రజల స్వాతంత్య్రదినంగా భావిస్తారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో 1956లో సంస్థానంలోని మూడు ప్రాంతాలు పొరుగు రాష్ట్రాల్లో విలీనం కావడంతో హైదరాబాద్‌ రాష్ట్రం తన ఉనికినీ, గుర్తింపును కోల్పోయింది”.

వ్యాఖ్యలు»

No comments yet — be the first.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: