jump to navigation

ఉద్యమమే వూపిరి మార్చి 5, 2008

Posted by Telangana Media in Telangana Articles.
trackback

ఒక అంకం ముగిసింది.. మరో అంకానికి తెరలేచింది.. తెరాసకు మిగిలింది ఇక జనం బాటే. ఉద్యమాన్ని ఉద్ధృతం చేయడమే లక్ష్యంగా తెరాస వ్యూహా రచన చేస్తోంది. అనూహ్య పరిస్థితుల్లో పదవులను త్యజించిన …

క అంకం ముగిసింది.. మరో అంకానికి తెరలేచింది.. తెరాసకు మిగిలింది ఇక జనం బాటే. ఉద్యమాన్ని ఉద్ధృతం చేయడమే లక్ష్యంగా తెరాస వ్యూహా రచన చేస్తోంది. అనూహ్య పరిస్థితుల్లో పదవులను త్యజించిన తెరాస ప్రజాప్రతినిధులు తెలంగాణలో విస్తృత స్థాయి పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారు. నలుగురు ఎంపీలు, 16మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు పదవులకు రాజీనామాలు చేయడం పూర్తి కావడంతో తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తెలంగాణకు ప్రధాన శత్రువు కాంగ్రెస్సే అనే నినాదంతో ఇక జనంలోకి వెళ్లనున్నారు.బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజు నుంచే తెలంగాణపై తీర్మానం ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేస్తూ వచ్చిన తెరాస చివరకు రాజీనామాలతో సభనుంచి నిష్క్రమించింది. రాజీనామా చేసిన అనంతరం తొలిసారిగా హైదరాబాద్‌కు గురువారం వస్తున్న కేసీఆర్‌ భవిష్యత్‌ కార్యాచరణకు నాంది పలకనున్నారు. రాజీనామాలకు ముందు ఆశీర్వాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లిన తెరాస నేతలు.. తెలంగాణ కోసం తమ పదవులను కూడా తృణప్రాయంగా త్యజించామని ఇక ప్రజలకు వివరించనున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మాట తప్పిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలనేదే తెరాస ప్రధాన వ్యూహం. ఈ నెల 12న మహబూబ్‌నగర్‌లో జరిగే భారీసభతో ఉద్యమాన్ని బహుముఖంగా జనంలోకి తీసుకెళ్లేందుకు తెరాస సన్నాహాలు చేసుకుంటోంది. ప్రధానంగా విద్యార్థులు, యువతను ఉద్యమం వైపు సన్నద్ధం చేసే భారీ వ్యూహానికి గతంలోనే రూపకల్పన చేసిన తెరాస దీన్ని విస్తృత స్థాయిలో అమలు చేయనుంది. ఒక వైపు రాజీనామా చేసిన ప్రజాప్రతినిధులు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా అన్ని నియోజకవర్గాల్లో సభలు నిర్వహించనున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలంగాణ నినాదాన్ని గెలిపించాలని అంశంతో ప్రజల్లోకి వెళ్తున్నారు.మరోవైపు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రాకుండా చేస్తోంది కాంగ్రెస్సే అని ఆరోపిస్తున్న తెరాస.. ‘హస్తం’ పార్టీలో వినిపిస్తున్న తెలంగాణ వాదాన్ని సమర్థంగా వినియోగించుకోనుంది. తెలంగాణ అంశంపై మాట్లాడేందుకు ఢిల్లీకి వెళ్లిన కాకా సహా సీనియర్‌ నేతలకు పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో కలిసే అవకాశం కూడా రాకపోవడాన్ని తెరాస ప్రచారం చేస్తోంది. ఇది తెలంగాణ వాదాన్ని అవమానించడమే, ఈ ప్రాంత ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరడమేనని కేసీఆర్‌ పలు సందర్భాల్లో ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. కాంగ్రెస్‌ నమ్మకద్రోహానికి పాల్పడిందని లోక్‌సభ, శాసనసభల్లో ఆరోపించిన తెరాస అస్త్రాలన్నింటిని ఆ పార్టీపై సందించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది.ఉప ఎన్నికలు వచ్చేనా?
తెరాస ఎంపీలు, ఎమ్మెల్యేల రాజీనామాల నేపథ్యంలో 16 అసెంబ్లీ, నాలుగు ఎంపీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయా? లేదా? అనే అంశంపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఖైరతాబాద్‌, తెర్లాం సెగ్మెంట్లకు ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉప ఎన్నికలు జరుగుతాయా? లేదా? అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో నెలకొంది. సాధారణ ఎన్నికలకు ఆరునెలల కంటే ఎక్కువ గడువు ఉంటే ఉప ఎన్నికలు నిర్వహించడం పరిపాటి. ఇప్పుడు నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఉప ఎన్నికల ఫలితాలు సాధారణ ఎన్నికలపై ప్రభావం చూపేలా ఉండటంతో వీటిని నిర్వహిస్తారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.

ప్రకటనలు

వ్యాఖ్యలు»

No comments yet — be the first.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: