jump to navigation

రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి మార్చి 5, 2008

Posted by Telangana Media in Telangana Articles.
trackback

తెరాస ఎమ్మెల్యేల రాజీనామా సందర్భంగా మంగళవారం శాసనసభ లాబీల్లో దాదాపు రెండు గంటలపాటు ఉత్కంఠభరితమైన వాతావరణం చోటుచేసుకుంది. ఒకేసారి 16 మంది శాసనసభ్యులు రాజీనామా చేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి.

ఒకేసారి 16 మంది ఎమ్మెల్యేల రాజీనామా
రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి
హైదరాబాద్‌ – న్యూస్‌టుడే

3.jpg  

తెరాస ఎమ్మెల్యేల రాజీనామా సందర్భంగా మంగళవారం శాసనసభ లాబీల్లో దాదాపు రెండు గంటలపాటు ఉత్కంఠభరితమైన వాతావరణం చోటుచేసుకుంది. ఒకేసారి 16 మంది శాసనసభ్యులు రాజీనామా చేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. తొలుత ఉదయం ఏడున్నర గంటలకు తెరాస ఎమ్మెల్యేలు, ఎంపీలు తెలంగాణ తల్లి విగ్రహం వద్ద తెలంగాణ కోసం పదవులను త్యజించనున్నట్లు పేర్కొని ప్రత్యేక రాష్ట్రం సాధిస్తామని ప్రతిజ్ఞ చేశారు. తర్వాత శాసనసభ ఎదుట ఉన్న గన్‌పార్క్‌లో తెలంగాణ అమరవీరుల స్మారకస్థూపం వద్ద నివాళులు అర్పించారు. అక్కడి నుంచి శాసనసభలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాల్ని వెల్లడించిన తర్వాత స్పీకర్‌కు రాజీనామా పత్రాలు అందజేశారు. అనంతరం సభ నుంచి నేరుగా గన్‌పార్క్‌వద్దకు వచ్చారు. అప్పటికే అక్కడి రోడ్డుపై బైఠాయించిన తెరాస కార్యకర్తలు వారిని భుజాలపై ఎత్తుకుని గన్‌పార్క్‌లోకి తీసుకెళ్లారు. ఈలోగా శాసనమండలిలో రాజీనామాలు సమర్పించిన తెరాస ఎమ్మెల్సీలు కూడా ఎమ్మెల్యేలతో జతకలిశారు. దీంతో తెరాస కార్యకర్తలు.. తెలంగాణకు అనుకూలంగా, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సోనియాగాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, తెరాస శ్రేణులకు వాగ్వివాదం జరిగింది. అనంతరం తెరాస నేతలను, కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

4.jpg

 ఆలస్యంగా వచ్చిన గంగారెడ్డి
శాసనసభలో 15 మంది తెరాస ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయగా.. అనారోగ్యం కారణంగా ఆలస్యంగా వచ్చిన డిచ్‌పల్లి ఎమ్మెల్యే గంగారెడ్డి మాత్రం స్పీకర్‌ను ఆయన ఛాంబర్‌లో కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. రాజీనామా లేఖలో ఏముందంటే: రాజీనామా లేఖలో కారణాలేవీ వెల్లడించలేదు. శాసనసభ నిబంధన 186 ప్రకారం తమ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నామని పేర్కొన్నారు. ఇది ఈ నెల నాలుగో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు.

తెలంగాణకు పునరంకితమవుదాం
రాజీనామాలు చేసినందుకు కృతజ్ఞతలు
పార్టీ నేతలను అభినందించిన కేసీఆర్‌
న్యూఢిల్లీ – న్యూస్‌టుడేదవులకు రాజీనామా చేసిన తెరాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పార్టీ అధినేత కేసీఆర్‌ అభినందించారు. తనపై విశ్వాసం ఉంచి చెప్పగానే రాజీనామాలు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారమిక్కడ తన నివాసంలో కేసీఆర్‌ విలేకరులతో మాట్లాడారు. మనమంతా తెలంగాణ సాధనకోసం పునరంకితమవుదామని రాజీనామా చేసిన వారిని ఉద్దేశించి అన్నారు. గురువారం హైదరాబాద్‌ తిరిగి వెళ్లనున్నట్లు కేసీఆర్‌ చెప్పారు. ఆ తర్వాత ఒకటి రెండు రోజుల్లో రాష్ట్ర కార్యకవర్గ సమావేశాన్ని ఏర్పాటుచేసి భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తామని తెలిపారు. రాజీనామాల తర్వాత మొదటిసారిగా ఈనెల 12న మహబూబ్‌నగర్‌లో మహాగర్జన నిర్వహించబోతున్నట్లు చెప్పారు. అలాగే తెరాస ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏప్రిల్‌ 27న హైదరాబాద్‌లో నభూతో న భవిష్యతి అన్నట్లు పది లక్షల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటుచేయబోతున్నట్లు వెల్లడించారు. తమ ఉద్యమ పంథాను అన్ని పార్టీల వారు అభినందిస్తున్నట్లు చెప్పారు. గాంధేయ పద్ధతిలో చేస్తున్న పోరాటానికి అభినందనలు వెల్లువెత్తుతున్నట్లు తెలిపారు. త్వరలో తండా తండాలో తెలంగాణ జెండా కార్యక్రమాన్ని ఉద్ధృతంగా చేపట్టబోతున్నట్లు వెల్లడించారు. నాయకులంతా గిరిజన తండాల్లో నిద్రిస్తారని చెప్పారు. ఆదివాసీలు, గిరిజనులను ఉద్యమంలో భాగస్వాములను చేయడానికే ఈ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు వెల్లడించారు. వివిధ పార్టీల్లో ఉండి తెలంగాణపై నోరెత్తలేని నాయకుల అడుగులకు మడుగులొత్తడం మానేసి తమ ఉద్యమంలోకి రావాలని అన్ని పార్టీల కార్యకర్తలకు పిలుపునిచ్చారు. చాలా పార్టీల్లో తెలంగాణ నాయకులు చేవచచ్చి బయటికి మాట్లాడలేకపోతున్నారని విమర్శించారు. సోమవారం తాము లోక్‌సభలో రాజీనామాలు సమర్పించేటప్పుడు సోనియాగాంధీ, మన్మోహన్‌సింగ్‌లు పార్లమెంటు ఆవరణంలో ఉండి కూడా మొహం చాటేశారని విమర్శించారు. ఇలాంటి మోసపూరిత పార్టీని తుదముట్టించడమే తమ లక్ష్యమని పునరుద్ఘాటించారు.

ప్రకటనలు

వ్యాఖ్యలు»

No comments yet — be the first.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: