jump to navigation

ఇక జనంలోకి మార్చి 5, 2008

Posted by Telangana Media in Telangana Articles.
trackback

తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ సభ్యులు, శాసనమండలి సభ్యులు మంగళవారం తమ పదవులకు రాజీనామా చేశారు. శాసనసభలో 25మంది సభ్యులున్న తెరాసలో చీలికవర్గం పోగా మిగిలిన 16 మంది రాజీనామా చేశారు.

ఇక జనంలోకి
తెరాస రాజీనామాల పర్వం పరిపూర్ణం
16 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీల పత్రాల సమర్పణ

తెరాస చేపట్టిన పదవీ త్యాగాల్లో రెండో అంకం పూర్తయింది. 16 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు మంగళవారం ఉభయ సభల్లో తమ రాజీనామాలు సమర్పించారు. ఇక జనక్షేత్రంలో తేల్చుకునేందుకు తెరాస సిద్ధమైంది. నాటి విజయ సాధనలో కలిసి నడిచిన నలుగురు తెరాస ఎంపీలు సోమవారం లోక్‌సభలో రాజీనామా సమర్పించినపుడు సోనియా, మన్మోహన్‌లు మొహం చాటేశారు. తెరాస ఎమ్మెల్యేల రాజీనామా సమయంలో ముఖ్యమంత్రి, విపక్ష నేత, తెలంగాణ కాంగ్రెస్‌ వృద్ధ నేతలు కూడా వ్యూహాత్మకంగా తప్పుకున్నారు. కలిసి చేసుకున్న బాసలకు సాక్షీభూతంగా తెలంగాణ మంత్రులు మౌనంగా సభలో కూర్చున్నారు.
హైదరాబాద్‌ – న్యూస్‌టుడే
 1.jpg
తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ సభ్యులు, శాసనమండలి సభ్యులు మంగళవారం తమ పదవులకు రాజీనామా చేశారు. శాసనసభలో 25మంది సభ్యులున్న తెరాసలో చీలికవర్గం పోగా మిగిలిన 16 మంది రాజీనామా చేశారు. శాసన సభాపక్ష నేత విజయరామారావు, ఎమ్మెల్యేలు నాయిని నర్సింహారెడ్డి, నగేష్‌, హరీష్‌రావు, పద్మా దేవేందర్‌రెడ్డి, చంద్రశేఖర్‌, గోవిందనాయక్‌, పద్మారావు, రామలింగారెడ్డి, లక్ష్మీకాంతరావు, కొప్పుల ఈశ్వర్‌, రవీందర్‌రెడ్డి, లక్ష్మిరెడ్డి, ప్రతాపరెడ్డి, ఈటెల రాజేందర్‌లు సభలోనే వ్యక్తిగతంగా సభాపతి సురేశ్‌రెడ్డికి తమ రాజీనామా లేఖలను అందజేశారు. డిచ్‌పల్లి ఎమ్మెల్యే గంగారెడ్డి మాత్రం స్పీకర్‌ గదిలోకి వెళ్లి తన రాజీనామా లేఖ సమర్పించారు. మరోపక్క శాసన మండలిలో తెరాస సభ్యులు ముగ్గురూ రాజీనామా చేశారు. దిలీప్‌, సత్యనారాయణ, రెహమాన్‌లు తమ లేఖలను శాసన మండలి అధ్యక్షుడు చక్రపాణికి సమర్పించారు.శాసనసభలో: ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రారంభంకాగానే తెరాస సభ్యులు జై తెలంగాణా.. జైజై తెలంగాణా.. అంటూ నినాదాలు చేయడం మొదలుపెట్టారు. మరోవైపు ‘తెలంగాణా రాష్ట్రం వెంటనే ఏర్పాటుచేయాలి’ అని రాసివున్న బ్యానర్లను పట్టుకొని స్పీకర్‌ వేదికను చుట్టుముట్టారు. తెలంగాణ గురించి మాట్లాడాలనుకుంటే అనధికార తీర్మానం ప్రవేశపెట్టాలని సభాపతి సూచించారు. దీనికి అంగీకరించని తెరాస సభ్యులు ‘రాజీనామాలు చేస్తాం.. మాట్లాడే అవకాశం కల్పించండి..’ అంటూ డిమాండ్‌ చేశారు. ”ఇప్పుడు నా ముందున్న అంశం తీర్మానాలే కానీ, మీ రాజీనామాలు కాదు” అంటూ రాజీనామాలు స్వీకరించేందుకు సభాపతి నిరాకరించారు. ‘నాకు కాగితాలు చూపించి రాజీనామాలు అంటే ఎలా? అసలు సభలో ఏం జరుగుతుందో తెలియాలి. ముందుగా సభ్యులు వెళ్లి సీట్లలో కూర్చోండి’ అంటూ సూచించారు. ఇదేమీ వినిపించుకోకుండా రాజీనామాలు తీసుకోండి… మమ్మల్ని మాట్లాడనివ్వండని సభాపతి వేదిక వద్దనే నిలబడి నినాదాలు చేశారు. దీంతో సభాపతి 8.40 గంటలకు సభను వాయిదావేశారు. తెరాస సభాపక్ష నేత విజయ రామారావును తన ఛాంబర్‌కు పిలిపించుకున్నారు.

సభ తిరిగి 9.25 గంటలకు ప్రారంభమైంది. తెరాస సభ్యులు వెంటనే సభాపతి వేదికను చుట్టుముట్టి నినాదాలు ఇవ్వడం మొదలు పెట్టారు. ‘సార్‌! మేం రాజీనామా చేస్తాం’ అని విజయ రామారావు అవకాశాన్ని కోరారు. దీంతో, సభాపతి తొలుత విజయరామారావును మాట్లాడానికి అనుమతిచ్చారు. తమ రాజీనామాలకు దారి తీసిన పరిస్థితులను ఆయన సోదాహరణంగా విరించారు. అనంతరం, నాయని నర్సింహారెడ్డి, ఈటెల రాజేందర్‌… చివరగా హరీష్‌రావు మాట్లాడారు. ముఖ్యమంత్రి కడప పక్షపాతంపై హరీష్‌ నిప్పులు చెరిగారు. తెరాస తరఫున నలుగురు సభ్యులు మాట్లాడిన అనంతరం రాజీనామా పత్రాలను ఇవ్వడానికి ప్రయత్నించగా, సంప్రదాయం ప్రకారం వాటిని కార్యదర్శికి ఇవ్వాలని సభాపతి సూచించారు. అంతలోనే మనసు మార్చుకొని లేఖలను తానే స్వీకరించారు. రాజీనామా లేఖలు సమర్పించగానే, తెరాస సభ్యులు జైతెలంగాణా అంటూ నినాదాలుచేస్తూ సభలోంచి వెళ్లిపోయారు. ఈలోగా సభాపతి తేనీటి విరామం ప్రకటించారు.

ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో తెరాస సభ్యులు రాజీనామాలకు సిద్ధమైనప్పుడు సభలో ముఖ్యమంత్రి వైఎస్‌, విపక్షనేత చంద్రబాబు, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు పురుషోత్తంరెడ్డి, ఎమ్మెస్‌లు సభలో లేరు. తెలంగాణా మంత్రులు మాత్రం అందరూ ఉన్నారు. తెరాస సభ్యులు మాట్లాడుతున్నప్పుడు మంత్రులు జీవన్‌రెడ్డి, దామోదర్‌రెడ్డిలు అడ్డుతగిలారు. తెరాస ఎమ్మెల్యేలు అంతే తీవ్రంగా స్పందించారు. అదే సమయంలో ప్రభుత్వ విప్‌ శ్రీధర్‌బాబు వచ్చి ఇద్దరు మంత్రులతో మాట్లాడివెళ్లారు. కొద్దిసేపటికి ఛీఫ్‌విప్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా వచ్చి మాట్లాడి వెళ్లారు. దాంతో మంత్రులు మౌనంగా ఉండిపోయారు. కిరణ్‌ కుమార్‌ రెడ్డి తెలంగాణా మంత్రులకు ఒక చిట్టీని పంపిణీ చేయడం కనిపించింది

2.jpg

శాసన మండలిలో…

మంగళవారం శాసన మండలి ప్రారంభం కాగానే తెలంగాణ అంశంపై

చర్చించాలని కోరుతూ తెరాస శాసన మండలి సభ్యులు వాయిదా

తీర్మానం ఇచ్చారు. దీనికి ఛైర్మన్‌ చక్రపాణి తిరస్కరించారు. దీంతో తాము

రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎందుకు రాజీనామా చేస్తున్నామో

ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత తమపై ఉందని, మాట్లాడే అవకాశం

 ఇవ్వాలని తెరాస శాసన మండలి సభ్యుడు దిలీప్‌ మండలి అధ్యక్షుడిని

కోరారు. అధ్యక్షుడు తిరస్కరించారు. దీంతో విపక్ష నేతలు దాడి

వీరభద్రరావు, పువ్వాడ నాగేశ్వరరావు, సీతారాములు, చుక్కా రామయ్య,

కె.నాగేశ్వర్‌ తదితరులు తెరాసకు అవకాశం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి

చేశారు. దీంతో ఛైర్మన్‌ తెరాస ఎమ్మెల్సీలకు మాట్లాడే అవకాశం

కల్పించారు. ముగ్గురు ఎమ్మెల్సీలు మాట్లాడిన తర్వాత రాజీనామా

 లేఖలను సమర్పించి, తోటి సభ్యులతో కరచాలనం చేస్తూ సభలోంచి

వెళ్లిపోయారు.

 

 

 

వ్యాఖ్యలు»

No comments yet — be the first.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: