jump to navigation

తెలంగాణ జీవన అస్థిత్వం – బతకనేర్చిన కవుల ద్రోహం మార్చి 5, 2008

Posted by Telangana Media in Naveen's analysis.
trackback

తిరుపతి లో తెలుగు తల్లి రథోత్సవం సంధర్బంగా భవదీయ ఇ.వి. రమణా రెడ్డి గారు ప్రసంగించారు. తెలంగాణ భాషలో వస్తున్న సాహిత్యాన్ని తప్పు బట్టిన వీరు తెలంగాణ తల్లి ఎర్పాటు అనాలోచితమన్నారు.

Career చూసుకునే ఇలాంటి కవులు కళాకారులు కొందరు ఇక్కడ తెలంగాణ గడ్డ మీద ఒకటి చెప్తారు. ఆంధ్రా లో ఇంకో పాట పాడుతారు. ఈ బతకనేర్చిన కవులు తెలంగాణ ప్రజల అస్తిత్వ పోరాటాన్ని ఎంధుకు అర్థం చేసుకోరు. వీళ్ల అసంబద్ధతనేమనుకోవాలి. విషయం తెలియని అజ్ణానమనుకోవాలా..? లేక ఆంధ్రా బిడ్డల ప్రాపకం కోసం వెంపర్లాడే దిగజారుడుతనం అనుకోవాలా..??

“దారితప్పుతున్నాం జాగ్రత్త” అని వీరు తెలంగాణ కవులకు ఉద్బొధించే ప్రయత్నం చేసారు. అయ్యా రమణారెడ్డి గారు మేము దారి తప్పలేదు. మీలాంటి కవులు ఆంధ్రా వలస పాలకుల అధికార భాషావ్యామోహం లో పడి కొట్టుకు పోతున్నారు. ఏది స్వాభిమానమో ఏది వ్యామోహమో తేల్చుకోలేని మీ విచక్షన చిక్కి శల్యమై నిస్తేజంగా మారింది. ముందే అనుకున్నట్టు మీరు నిజమే చెప్పారు. మీరు “దారితప్పుతున్నారు”.

వీరంటారు: “ఇంతవరకు ఉపయోగిస్తూ వచ్చిన ప్రామాణిక భాషను ఇది నా భాష అంటూ ఎవడో కోస్తా వాడు వచ్చి దొమ్మీగా లాక్కుపొతు ఉంటే చూసి ఊరుకోడానికి నేను సిధ్ధంగా లేను” అని..

నిజమే మీరే కాదు మీలాగే పరాయి భాషను పట్టుకుని వేలాడే వాళ్లెవరూ ఒప్పుకోరు. ఈ రోజు ప్రామణిక భాష గా ఉన్నది అందరి భాషో ఆంధ్ర భాషో మీకు తెలియదు అనుకోము. తెలంగాణ బిడ్డలు తమ భాషలో తమ సాహిత్యాన్ని ఆవిష్కరించడం తప్పెలా అవుతుంది…!! తెలంగాణ భాష యాస ల ‘సోయీ’ మరిచిన మీరు ఆంధ్ర భాష ను ఆంధ్రులు తమది అంటే వెక్కెక్కి పడి ఏడవడం సహజమే.

ఈ మేకవన్నె పులి పై తెలంగాణ కవులు ఎక్కు పెట్టిన అక్షర అస్థ్రాల్ని చూడండి

  – నవీన్ ఆచారి  
ramanareddy.jpg

                                                                                                                                    

వ్యాఖ్యలు»

1. ramana ananthula - మార్చి 6, 2008

We must bang such people wherevere they go. Until culotural domination disappears from the society the supressed slangs & languauges will come forward strongly.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: