jump to navigation

తెలంగాణ కోసం మెడలు కోసుకుంటాం మార్చి 12, 2008

Posted by Telangana Media in AndhraJyothy, Telangana news.
trackback

తలవంచేది లేదు పీఠమెక్కించిన గులాబీ కండువే కాలనాగై కాటేస్తుంది
అభినందన సభలో కాంగ్రెస్‌కు కేసీఆర్‌
హెచ్చరిక కాంగ్రెస్‌ను నిలదీయండి: జయశంకర్‌

                 హైదరాబాద్‌, మార్చి 11 (ఆన్‌లైన్‌): తెలంగాణ కోసం అవసరమైతే మెడలు కోసుకుంటామే తప్ప ఎలాంటి పరిస్థితుల్లోనూ తలవంచేది లేదని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ స్పష్టంచేశారు. కాంగ్రెస్‌ నేతలకు పదవులు, కిరీటాలు తెచ్చిపెట్టిన గులాబీ కండువాయే కాలనాగై కాటేస్తుందని హెచ్చరించారు. తెలంగాణ విషయంలో పూటకో మాట,పేటకో మాట మాట్లాడుతూ.. బద్మాష్‌ గిరీ చేస్తోన్న కాంగ్రెస్‌ నేతలు అంతకు అంత అనుభవిస్తారని ఆయన శపించారు. ఇటీవల సామూహిక రాజీనామాలు చేసిన టీఆర్‌ఎస్‌ నేతలకు మంగళవారం హైదరాబాద్‌లో తెలంగాణ సంఘాల ఆధ్వర్యంలో ఘన సన్మానం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేసీఆర్‌ కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు. “గజకర్ణ, గోకర్ణ, టక్కుటమార విద్యలతో ప్రజలను మోసం చేయాలని కాంగ్రెస్‌ నేతలు చూస్తున్నారు.

 

                    అధికారం మత్తులో, ముఖ్యమంత్రి జిత్తుల్లో ఇరుక్కుపోయిన తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు పౌరుషం లేకపోవచ్చు కానీ వాటిని చూస్తోన్న తెలంగాణ ప్రజలకు పౌరుషం చావలేదు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణేతర పార్టీలను తరిమికొట్టేందుకు వారు సిద్ధమయ్యారు. జార్ఖండ్‌ తరహాలో వెంటపడి, వేటాడి తెలంగాణ సాధి స్తాం. అవసరమైతే మా ప్రాణాలను బలిపెడతాం. తెలంగాణ రాజకీయాధికారం సంపూర్ణంగా తెలంగాణవాదుల చేతుల్లోకి తీసుకుని.. వచ్చే ఎన్నికల్లో 115 అసెంబ్లీ, 17 పార్లమెంట్‌ స్థానాలు గెలుచుకుని అందరినీ సుందరయ్య భవన్‌లో కూర్చోబెడితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుచుకుంటూ వచ్చి రాష్ట్రాన్ని ఇస్తాయి..” అని కేసీఆర్‌ పేర్కొన్నారు. అనంతరం ప్రముఖ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. దేశ చరిత్రలో ఒకే టర్మ్‌లో ఒకే ఎంపీ రెండు సార్లు రాజీనామా చేసిన సంఘటన లేదన్నా రు. “టీఆర్‌ఎస్‌ రాజీనామాల త్యాగం వృథా కాదు. తెలంగాణ రాష్ట్రం తప్పకుండా సిద్ధిస్తుంది” అని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ నేతలు ఎన్నికల ముందు ఏం చెప్పారో, ఇపుడేం చేస్తున్నారో నిలదీయాలని టీఆర్‌ఎస్‌ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు.

                     తెలంగాణపై ఇతర పార్టీల వైఖరేమిటో ప్రశ్నించాలని కోరారు. టీడీపీ అంగీకారం ఇవ్వకుండా ఏకాభిప్రాయం ఎలా కుదురుతుందని వీరప్పమొయిలీ ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు. “తెలంగాణ మంత్రులు అవమానాలు, చీదరింపులు భరించి ద్వితీయశ్రేణి నేతలు గా బతకడానికి సిద్ధపడినా.. తెలంగాణ ప్రజలు ప్రథమ శ్రేణి పౌరులుగా బతకాలనుకుంటున్నారు” అని జయశంకర్‌ పేర్కొన్నారు. ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సభలో టీఎన్‌జీవో సంఘం ప్రధాన కార్యదర్శి కే.స్వామిగౌడ్‌, సీనియర్‌ జర్నలిస్టు మల్లేపల్లి లక్ష్మ య్య, టీఎన్‌జీవో సంఘం అధ్యక్షుడు వి.శ్రీనివాస్‌గౌడ్‌, ఉద్యోగుల సంఘం నేత సి.విఠల్‌, రచయితల వేదిక నేతలు జూకంటి జగన్నాథం, శ్రీధర్‌రావు దేశ్‌పాండే ప్రసంగించారు.

వ్యాఖ్యలు»

1. అనామకం - మార్చి 12, 2008

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: