jump to navigation

తెలంగాణ సాధించేదాకా నిద్రపోం మార్చి 14, 2008

Posted by Telangana Media in Vaartha.
trackback

భువనగిరి టౌన్‌, మార్చి 13, ప్రభాతవార్త మా ఒంట్లో తెలంగాణ రక్తం ప్రవహిస్తోంది. తెలంగాణ బిడ్డలుగా, తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కళ్ళప్ప గించి చూస్తూ ఊరుకోమని, పదవులనైనా,ప్రాణాలైనా లెక్కచేయకుండా తెలంగాణ సాధించితీరుతామని ప్రాంతీయ బోర్డు చైర్మన్‌, ఉప్పునూతల పురుషోత్తమ్‌రెడ్డి పేర్కొన్నారు. భువనగిరి టిఎన్‌జిఓస్‌ భవనంలో తెలంగాణ జర్న లిస్టుల ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీట్‌ ది ప్రెస్‌లో సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు జీవన్‌రెడ్డితో కలిసి పాల్గొని ప్రారంభసందేశం ఇచ్చారు. ఆంధ్ర మహాసభలాంటి ఎన్నో ఉధ్యమాలు ఇక్కడ నుండే ప్రారంభమయ్యాయని తాము సైతం ఇక్కడనుండే ప్రారంభించి విజయవంతం అవుతామనే ధృఢ విశ్వాసం ఉందని ఉప్పునూతల ఆశాభావం వ్యక్తం చేసారు.శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ మనకు స్వాతంత్య్రం సిద్దించటం మేడిపండు లాంటిదైతే, దారిద్య్రం రాచ పుండులాంటిదని అభివర్ణించారు.ఆంధ్ర వలస పాలకుల అణచివత నుండి విముక్తులమౌదామని శ్రీధర్‌రెడ్డి పిలుపునిచ్చారు.  అనంతరం తెలంగాణ పాత్రికేయులు సంధించిన ప్రశ్నలకు పురుషోత్తమ్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి సమాధాన మిచ్చారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ జర్నలిస్టుల ఫోరం కన్వీనర్‌ గోవర్థనాచారి స్వాగతం పలుకగా, ఫోరం రాష్ట్ర కమిటి సభ్యులు సయ్యద్‌ ఇస్మాయిల్‌ అధ్యక్షత వహించగా ఫోరం రాష్ట్ర కో కన్వీనర్‌ పిట్టల శ్రీశైలం సమన్వయకర్తగా వ్యవహరించారు. ప్రశ్న: 1969 తెలంగాణ ఉధ్యమంలో సమైఖ్యాంధ్రకు మద్దతు తెలిపి ప్రస్తుతం తెలంగాణ కోసం ఉధ్యమానికి దిగటం ఎంత వరకు సమంజసం? జవాబు: భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా కలిసి ఉండేందుకు అభ్యంతరం లేదనే ఉద్దేశ్యంతో మద్దతు పలికిన మాట వాస్తవం. ఆంధ్ర మద్రాసు కలిసి ఉండేది. తెలంగాణకు హైదరాబాద్‌ రాజధానిగా ఉంది. మద్రాసునుండి ఆంద్ర విడిపోయి కర్నూలు రాజధానిగా చేసుకున్నారు. అక్కడ ఎలాంటి సౌకర్యాలు లేనికారణంగా పధకం ప్రకారం తెలం గాణతో మిలాఖత్‌ కోరారు. ఇంతగా అన్యాయం జరుగుతుందని ఊహించలేక పోయాము.  ప్రశ్న: ఐటిమంత్రి దామోదర్‌రెడ్డిమీపై పోటీచేసి గెలుస్తాననిసవాల్‌ విసిరారు. దీనికి మీ సమాధానం? జ: మొదట నీవు రాజీనామా చేయి. ఆ తర్వాత నేను రాజీనామా చేస్తాను. సవాలుకు నేను సై. ప్ర : పురుషోత్తమ్‌రెడ్డి పార్టీ నుండి బయటకు వెళ్ళినా పార్టీకి నష్టం జరగదని కొందరు కాంగ్రెస్‌ నేతల అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా ?  జ: అనుభరాహిత్యంతో ఎవరో ఏదో అంటే నిజమౌ తుందా? గత ఎన్నికల్లో జిల్లాలో 2,3 సీట్ల కంటే రావని నిర్ధారించుకున్నప్పుడు తాను పార్టీకొరకు శ్రమించి అత్యధిక స్థానాలు గెలుపొందేందుకు కృషి చేసిన విషయం ప్రజలకు తెలుసు.నాకేదో శాపంఉందని, వీటిని ఎదుర్కొనేందుకు సమయం ఆసన్నమైందని ఆవేదన వ్యక్తం చేస్తూ, ఇక ఏ మాత్రం వెనుకకు తగ్గేది లేదన్నారు. ప్ర: ఏదో ఒక పదవిని ఇవ్వాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రాంతీయ బోర్డు చైర్మన్‌ పదవిని స/ష్టించి నియమించిందని పలువురు అభిప్రాయపడటమే కాక, మీరు సైతం విధులు, నిధులు లేవని ఆవేదన వ్యక్తం చేసారు కదా. ఇంకా ఆ పదవిలో ఎందుకు కొనసాగుతున్నారు? జ: నిజమే. అయితే తెలంగాణ ప్రాంతంలో కొన్ని ప్రాజెక్టులు పరిశీలించేందకు వెళ్ళినప్పుడు అధికారాలుంటేనే కదా ఇంజనీర్లు, ఇతర అధికారులు మాట వింటారు.

వ్యాఖ్యలు»

No comments yet — be the first.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: