jump to navigation

జనవనం మనాది మార్చి 29, 2008

Posted by Telangana Media in AndhraJyothy, Pranahita.
trackback

– అల్లం నారాయణ

కన్నెపల్లి అడవిలో దాగున్న రహస్యం. ములుగు రోడ్డు పంటపొలాలను మోసుకుంటూ, గోవిందరావుపేట, పసి రె దాటితే నార్లాపూర్‌ మలుపు రోడ్డు విస్తరించి ఉన్నది. నీటి వనరున్నచోట కాకాతీయుల కళాశిల్ప వైభవంగా చరిత్రలో విలసి ల్లిన గుడికి దూరంగా రోడ్డు. రామప్పలేక్‌. రెండు కొండలు అటూ ఇటూ సమున్నతంగా నిలుచుండగా మధ్యలో పురా విశ్వాసాల మట్టికట్ట. జల సముద్రం. రోడ్డుపొంట దూరంగా బ్యాక్‌ వాటర్స్‌. కొంచెం నల్లగా, నీలిగా ఆ నీటి వనరు అధరువు గా అక్కడక్కడా పచ్చటి పంట పొలాలు. గోవిందరావుపేట, పసిరెలు రెండూ తొలి వలస ప్రాంతాలు. బహుశా ఈ గిరిజన సమూహాల్లోకి, మేడారం జాతర సాన్నిహిత్యంలోకి వచ్చిన ఈ ఆంధ్ర ప్రాంతపు వలసలు రామప్ప చెరువు ఆయకట్టు వల్ల వచ్చి ఉంటాయి. నార్లాపూర్‌ అటవీ పరిమళం అడవి విస్తరించిన మేరా. కొట్టేసిన చెట్ల ఖండిత మొండాలు.

అడవి ఖాళీ అయ్యిం దన్న దానికి సూచిక. అడవిలోనికి చొచ్చుకుపోయిన నాగరికతా చిహ్నం రోడ్డు. అటూ ఇటూ తలలూపుతు న్న పలుచటి చెట్లు. దూరంగా చిలుకల గుట్ట. అదే మేడారం. కోట్లాది గిరిజనుల నమ్మకం రెండేళ్ళకో సారి పునరుత్థానం పొందే కూడలి. చరిత్ర కు ఒక జాతర అది. సాహసంవల్ల దేవతల యిన తల్లీ కూతుళ్ళు సమ్మక్క-సారలక్కల పురాత్మల జ్ఞాపకాన్ని మదిలో నిలుపుకునే మనాది అది. కాకతీయ రాజులపై కప్పం కట్టలేని పగి డిగిద్దరాజు కత్తి దూసిండు. సమ్మక్క భార్య. సారలక్క, జంపన్న కూతురు, కుమారుడు. కాకతీయుల సేనలు దాడి చేస్తే వీరోచితం గా పోరాడి పగిడిగిద్ద రాజు వీరమరణం. సమ్మక్క నిలబడ్డది. జంపన్న ఓటమి అంచులో కత్తితో పొడుచుకుని జంపన్న వాగులో వీరమరణం పొందాడు. సమ్మక్క, సారలక్కలు చిలుకల గుట్టపైకి అదృశ్యమ య్యారు. సమ్మక్క అదృశ్యం అయిన చోట కుంకుమ భరిణ, మూలికలు. క్లుప్తంగా ఇదీ చరిత్ర.

జీవించి ఉండి, రాచరికంపై కలెబడి నిలబడిన పురాయోధులు, యోధురాళ్ళ కథ ఇది. ఇప్పు డు వాళ్ళు దైవాలు. చరిత్ర వారసత్వం కోటి జనాల జాతరగా రూపొందిన ఒక వైచిత్రి సమ్మక్క జాతర. ఒక చిన్న ఊరికి, ఆ ఊరును ఆవరించిన అడవికి రెండేళ్ళ కోమారు తరలి వచ్చే లక్షల జనం. దేనికోసం వస్తారు. శివసత్తులై తూలి దేన్ని పలవరిస్తారు. ఏం మొక్కుకుంటారు. ఏ కోర్కెలు తీర్చమంటారు. ఏ పోరాట వారసత్వాన్ని పొందుతారు. రెండు సంవత్సరాల కోసారి దేనికోసం సమూహ సంద్రమై జనం ఎందు కు ఉప్పొంగుతారు. అదొక సామూహిక జ్ఞాపకమా? ఒక చరి త్రా.. ఒక నమ్మకమా! సమ్మక్క-సారలక్కలు విగ్రహాలు కాదు. రెండు గుర్తులు. రెం డు ప్రతీకలు. రెండు గద్దెలు. ఒక కుంకుమ భరిణ. ఈరెండు చిహ్నాలకు ‘బంగారం’ కొబ్బరికాయ, గొర్రెపిల్ల, మేకపోతు, కోడి పిల్ల, కొబ్బరికుడుక, కంకబియ్యం, ఒడిబియ్యం. అంతే మొక్కు అయిపోతుంది. ఏం మొక్కుకుంటావో నీ ఇష్టం. ఇక ప్రారంభం సంబరం.

తాగు, తిను, పూనకంవస్తే తూలు. జంపన్నవాగులో పవిత్ర స్నానమాడు. ఇదీ కథ. జరుగుతున్న కథ. మానవుడి తొలి విశ్వాసం ‘టోటెమ్‌’ ఒక చెట్టునో, పుట్టనో ఆరాధించే ప్రాకృతిక మానవుడి ఆరాధ్య దైవం ప్రకృతి… మేడా రం జాతర. ఒక ప్రకృతి ఆరాధన. ఒక తొలి సంస్క­ృతి కొనసా గింపు. తెలంగాణ ప్రాంతానికే ప్రత్యేకమైన చారిత్రక పండుగ. అట్లని అది తెలంగాణ మర్యాదస్తుల పండగ కూడా అనలేము. గిరిపుత్రుల పండగ. ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, ఒరిస్సా ఆనుకొని దండకారణ్యంగా భాసిల్లుతున్న గిరిజన ప్రాంతాల కోయల పండుగ అది. మేడారం జాతర ప్రాంతాల పొడవునా ఇంటికో సమ్మ య్య, సమ్మక్క, జంపన్న ఇవీ చిహ్నా లు.

కానీ….. జంపన్న వాగులో బోర్లు పైకి ఎగ జిమ్మి మెట్ల మీదుగా తలలపైకి పొంగుతున్న పంపులు విరజిమ్ముతు న్న నీళ్ళు. మొన్న మొన్ననే కట్టిన పూర్తికాని వంతెన. సమ్మక్క- సార క్కల గద్దె చుట్టూ ఇనుప కంచె. సోలు పున భక్తులు తరలేందుకు లేన్లు. సమ్మక్క-సారక్కలను దాచివేస్తున్న కట్టడం. రోడ్డు పొడవూ బార్లు తీరే దారులయ్యే గూడు బండ్ల బదులు అడవి బందున విడిది చేసిన కారుల బారులు, లారీలు, గుడారాలు. దుకా ణాల ముందు సోకులు పోతున్న ‘నిబ్‌’లు, క్వార్టర్‌ సీసాలు. ప్లాస్టిక్‌ గ్లాసులు. కోకోకోలాలు. ఫాంటా… ఫాంటసీలు. తన కొడుకును సినిమాల్లోకి ఆకర్షిస్తూ కన్నుకొడ్తున్న కమెడియన్‌ బాబూమోహ న్‌ ఫ్లెక్సీ. తెలంగాణ తల్లి నటనతో వీరోచిత, రౌద్ర, రూపపు ఫ్లెక్సీతో దారిపొడవూ ఆహ్వానాలు. రోడ్డు పక్కనే తాగి తూలుతు న్న ఒక అభాగ్యుడు. దోసె.. వడ.. ఇడ్లీ.. ఇక్కడ ఆంధ్రభోజనం పెట్టబడును.

ఇవ్వాళ ముఖ్యమంత్రి, రేపు మాజీ ముఖ్య మంత్రి రాక. తాడ్వాయి నుంచి మేడారం దాకా, పసిరె నుంచి మేడారం దాకా ట్రాఫిక్‌ జామ్‌.. అయి పోయిందా.. బహుశా ఈ జాతర కోసం కొంచెం చట్టి ముక్కులు, పొట్టి నడకలు గల కోయలు ఇక కనుమరుగుకావచ్చు. బహుశా ఈ జాతర కోటాను కోట్ల జనం లో గిరిజనులకన్నా నాగరికులే మందగా మూగవచ్చు. బహుశా ఇక్కడ అతిథి గృహాలు రావ చ్చు. హోటళ్ళూ రావచ్చు. అభివృద్ధి తన నగ్న స్వరూపంలో రెండు ప్రపంచాల స్వభావంతో నిలువె ల్లా జంపన్న వాగులా ప్రవహించొచ్చు. అప్పుడిక జంపన్న రక్తం తో, జంపన్న వాగై ప్రవహించిన సంపంగి వాగు ఇంకి పోవచ్చు. అదీ వర్తమానం. ఒక్క నమ్మకం కోసం కోటొక్క పరిసె జనవ నం అవుతున్న ఒక అపూర్వ పురా ఆత్మల జ్ఞాపకానికి మోకరిల్లేదే మేడారం జాతర. అదొక ప్రాణమై ప్రవహించే శాశ్వతయాది.

ప్రకటనలు

వ్యాఖ్యలు»

1. srinivas - మార్చి 18, 2016

64 Acres agricultural land for sale with 4 boars near Chintalapudi, West Godavari Dt. (Between Chintalapudi and Chatrai). Just open below site to know full details.
http://goo.gl/FNmtFq


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: