jump to navigation

నోర్మూసుకోండి… మార్చి 29, 2008

Posted by Telangana Media in AndhraJyothy, Pranahita.
trackback

 – అల్లం నారాయణ

ప్రపంచ బ్యాంకు రుణాలొస్తు న్నాయి. అభివృద్ధి పధాన పయనిస్తున్నప్పుడు ఇందిరమ్మ ఇళ్లు తీసుకోండి, నిధులు పారుతున్నప్పుడు కాసుల గలగలతో అభివృద్ధి పధంలో మాత్రమే నడవండి… అందాకా…. కాస్త నోరు మూసుకోండి.

కొంచెం నోరు మూసుకుంటారా! ఆవల చాలా అభివృద్ధి చెయ్యాల్సి ఉన్నది. భూమిని చాప చుట్టాల్సి ఉన్నది. ఈ మహానగరం చుట్టూ రింగురోడ్డు మహాసర్ప పరిష్వంగాన్ని బిగించాల్సి ఉన్నది. కొంచెం ఆ గొణగడం… సణగడం ఆపుతారా! బుల్‌డోజ్‌ చేస్తున్న అభివృద్ధి పథ ఘట్టన ల్లో రణగొణ, గణగణ గంటల మోతల మధ్య మాటలెందుకు? వీరప్ప మొయిలీ కర్ణాటక అయినా ఆయనకు తెలంగాణ నాడి బాగా తెలుసు. తెలంగాణ ఆత్మలు మాట్లాడుకుం టున్న ఘోషలూ తెలుసు. అందుకే ఛీ అని కొందరు పనిలేని వాళ్లు ప్రేలాపనలు చేసినా తెలంగాణకు రెండో ఎస్సార్సీయే పరిష్కారం అంటే అని వుండవచ్చు కాక.

అయినంత మాత్రాన. మీకేం తెలుసు. ల్యాంకోహిల్స్‌లో నూరంతస్థుల మేడమీద మేడకట్టి హైదరాబాద్‌ నగారాన్ని సుందరనం దనంగా చేస్తున్న లగడపాటి రాజగోపాల్‌.. విజయవాడ నుంచి వస్తేనేమి అయనకూ తెలంగాణ గురించి స్పష్టమైన నూరంతస్థుల ఎత్తుగల ఉన్నతాభిప్రాయాలున్నాయి. ఆయన మాటలు వినపడడంలేదా ఎందుకీనస. రవీంద్రనాధ్‌రెడ్డి అనే కడపమేయర్‌ క్రాంతి దర్శి. ఆయనకు కూడా తెలంగాణ మీద ఎంతప్రేమో చూడండి.

తెలంగాణ వస్తే మావోయిస్టుల రాజ్యం వస్తుందని ఆయన ఎంత భవిష్యత్‌ వాణిని వినిపిస్తున్నారో వినపడడం లేదా కడప అయినందువల్ల ఆయనకు తెలంగాణ సమస్యలు ఎక్కువ అర్థ మవుతాయి కాదంటారా ! కడప కదా ‘ఫ్యాక్షనిజం’ తెలిసిన మని షి కనుక నక్సలిజం వద్దంటారు. నక్సలైట్లు రాజ్యానికి వస్తే… రింగురోడ్డు వస్తుందా? వేల వేల ఎకరాల్లో ‘సెజ్‌’లు వస్తాయా? పాపం పేద పేద సారీ.. సారీ.. పెద్ద పెద్ద కంపెనీలు ఇన్ఫోసిస్‌లు, సత్యంలు, మేటాస్‌లు, పోలారిస్‌లు, మైక్రోసాఫ్ట్‌లు, ఛప్పన్నారు కంపెనీలకు అడిగినా అడగకున్నా భూములిచ్చి అభివృద్ధి చెయ్యగలరా? అసలు అభి వృద్ధి అంటే వారికి తెలుసా! అంతెందుకు! సరే! విజయవాడ లగడపాటీ, కడప రవీంద్ర నాథ రెడ్డీ అట్లా ఉంచండి.

పేరుకు ‘చిన్నా’రెడ్డి అయినా పెద్ద మనసుతో ఆయన ఎట్లా ఉన్నారో? టీఆర్‌సీసీసీ పెట్టిందెవరు? ఆయనే. చంద్రబాబు రాజ్యంలో ఉన్నప్పుడు తెలంగాణకు జరు గుతున్న అన్యాయాలపైన కత్తులు దూసి, సాముగరిడీలు చేసిం ది చిన్నారెడ్డికాదా? అభివృద్ధి పథంలో ఒక చిన్న మంత్రి పదవి ఇచ్చేసరికి ఆయన కళ్లు తెరుచుకోలేదా! ఒక్క మంత్రి పదవి ఎట్లా అభిమృద్ధికి రాచబాటలు వేస్తుందో? చిన్నారెడ్డిని అడగండి. ఆయన మాట్లాడిందాంట్లో అర్థం పర్థం వుంది. పనికిమాలిన మాటలు ఎందుకు మాట్లాడతారు? ఏదో ఒక ఎముక దొరకకపోతుందా? తెలంగాణ తలనొప్పి ఎందుకు.

జీవన్‌రెడ్డి కరీంనగర్‌జిల్లా నాయకుడుకాదా? ఒకప్పుడు ఆయనకు కూడా తెలంగాణ ఎంత ఆవేశపూరిత మైన, అభాగ్య ప్రాంతంగా కనిపించింది. తెలంగాణ ఆకాంక్షల నిప్పురవ్వలో ఆయన ఎంతజ్వలితజ్వాలగా ఉండేవారు. ఇప్పుడు చూడండి. రంగారెడ్డిలో నూరంతస్థుల అభివృద్ధి. కరీం నగర్‌లో, ఆదిలాబాద్‌లో… అంతెందుకు తల్లి పాలింకిపోయిన పాలమూరులో శరవేగంగా జెట్‌ను తలపిస్తూ దూసుకుపోతున్న అభివృద్ధి ఆయనకు ‘ఏదైతేఉన్నదో’ కనబడ లేదా? తేడా చూడండి. ఒక్క మంత్రి పదవితో ఎంత కళ్లు విచ్చుకుంటాయో! మీరంతా కళ్లు మూసుకు పోయిన వాళ్లు.. అందువల్ల ఇప్పుడన్నా నోళ్లుమూసుకోండి.

తెలంగాణ అంటారా! అది ఎప్పుడైనా వచ్చిందా.. ఎన్నేళ్ల నుంచి బూర్గుల రామకృ ష్ణారావు గుర్తున్నారా! నెహ్రూ దగ్గరికి వెళ్లే దాకా… ఆయన కూడా ఏమన్నాడో మీకు తెలు సా! తెలంగాణ ఆంధ్రలో కలవడం నా బొంది లో ప్రాణం ఉండగా జరిగే పనికాదని.. ఏమ యింది తర్వాత. 1969 గుర్తున్నదా! మూడు వందలా డెబ్బై మంది చనిపోయారు కదా! ఏమయింది. చెన్నారెడ్డి సాబ్‌ గుర్తున్నాడా! ఏమయింది. ఇందిరాగాంధీ కాలం. తెలంగా ణ వచ్చిందా ఇక 2004 అంటారా! అవును అభివృద్ధి నిరోధక ప్యాంటుధారి, చంద్రబాబు పంచెధారులు రైతులకు వ్యతిరేకం. ఆయనను కదిలించాలంటే ఎత్తుగడలు ఉండాలా వద్దా.

అవును కాంగ్రెస్‌ పార్టీ కదా! వేశాం ఓ పాచిక. అయింది. గెలిచాం. అయినంత మాత్రాన.. అంత మహా విశ్వా సం పెట్టుకోవడం మీతప్పు.. తెలంగాణ అనడం వరకూ బాగా నే ఉంటుంది. తెలంగాణ అనండి కార్యదర్శులు తీసుకోండి. ఛైర్మన్లు తీసుకోండి. మంత్రిపదవులు తీసుకోండి. రింగురోడ్లు తీసుకోండి. ఫ్లై ఓవర్లు తీసుకోండి. ప్రపంచ బ్యాంకు రుణాలొస్తు న్నాయి. కాచుకోండి.

జలయజ్ఞంలో పారుతున్న నిధుల వర దను కనిపెట్టుకోండి. అభివృద్ధి పధాన పయనిస్తున్నప్పుడు జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్లు తీసుకోండి, నిధులు పారుతున్నప్పుడు కాసుల గలగలతో అభివృద్ధి పధంలో మాత్రమే నడవండి… అందాకా…. కాస్త నోరు మూసుకోండి. అయినా… కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇస్తుందా? ఎలా అనుకుంటారు. ఎస్సార్సీ కాదంటే రెండో ఎస్సార్సీ… అదీ కాదంటే ప్రణబ్‌ముఖర్జీ కమిటీ… అదీ లేదంటే ఏకాభిప్రాయం… రాజీనామాల చప్పుళ్లకు బెదరం… అదరం… నోరుమూసుకోండి… కాదంటే అమ్మ ఉంది… ఆ అమ్మకు కూడా… నెహ్రూ, ఇందిరాగాంధీల వారసత్వం ఉంది… మరీ కాదంటే బుందేల్‌ఖండ్‌ ఇస్తానన్న మాస్టర్‌ రాహుల్‌ను నమ్ముకోండి… లేదా! నోర్మూస్కోండి… తెలంగాణ లేదు…రాదు… ఇవ్వరు… ఇక మీ ఇష్టం. ‘నై’ తెలంగాణ.

ప్రకటనలు

వ్యాఖ్యలు»

No comments yet — be the first.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: