jump to navigation

‘శోష’ లిజం మార్చి 29, 2008

Posted by Telangana Media in AndhraJyothy, Pranahita.
trackback

అల్లం నారాయణ

సారీ.. డియర్‌ లేట్‌ రాబర్ట్‌ ఓవెన్‌. సోషలిజం ఇంకెంత మాత్రం మాకు ఒప్ప దు. పెట్టుబడిదారీ దేశంలో ఒక పెట్టుబడి దారుగా.. సమాజ గర్భంలో పెట్టుబడిదారీ సమాజం తెచ్చిన అసమానతల, రెండు భిన్న ప్రపంచాల, పెరుగుతున్న అంతరాల మహా స్వరూపం నీకు అర్థమైనట్టుగా.. ఇన్నాళ్లకు మాకు అర్థం కానందుకు సారీ ఓవెన్‌.. అయితే మేం కమ్యూనిస్టులం.. కాదుకాదు మార్క్సిస్టులం.. ఒకరొకరుగా ఆఖరు దుర్గం గా భ్రమపడిన తల నిజంగానే పండిన స్వప్రకటిత మార్క్సిస్టు మేధావులు లొంగిపోతున్నారు. సామ్యవాదానికి ముందు పెట్టుబడి దారీ విధానం భారతీయ సమాజంలో ..కాదు కాదు.. బెంగాల్‌లో సామాన్యుడికి, పెట్టుబడిదారునికి, మధ్య తరగతికి జీవనప్రమాణాలు మెరుగుపరుస్తుందని, ఉపాధి కల్పిస్తుందని, ఉద్యోగాలిస్తుందని కామ్రేడ్‌ బుద్ధదేవ్‌ భట్టాచార్య(సింగూరు, నందిగ్రామ్‌ఫేమ్‌), ముందూ.. ఆయన వెనుక తోక కురువృద్ధుడు జ్యోతిబసు బయలు దేరారు.

ఇదేం ‘గ్రే ట్‌ డిబేట్‌’కాదు. సామాన్యమైన విషయం. ఎనభైఐదు సంవత్సరాల తర్వాత ఇక్కడ కమ్యూనిజం కళ్లు తెరిపించింది, పెట్టుబడిదారీ విధానం. అండ్‌ ద ఆడమ్‌స్మిత్‌ప్రివేల్స్‌. మార్క్స్‌దేముంది. కన్నంలోదొంగను కన్నం లో పట్టుకోవడం గురించి ఇప్పుడెందుకు? భారతీయ సమాజంలో సోషలిజం ఇంకెంతమాత్రం ప్రాసం గికం కాదు. చివరికి సుప్రీం కోర్టిప్పుడు మా తాజా రెవల్యూషనరీ. ఈ మాటకు కట్టుబడాలని రాజ్యాంగ పీఠికలో సోషలిజం మాట ఉండాల్సిందేనని చివరకు సుప్రీంకోర్టు డబ్బున్నోళ్లకు చుట్టాలుగా చట్టాలు చేస్తుందనుకుంటున్న రాజ్యాంగ యంత్రం ఇక్కడ మా కమ్యూనిస్టుల కన్నా ప్రగతి శీలకంగానూ, విప్లవకరంగానూ ఉన్నందుకు ఏదో కొందరం ఎంతో కొంత అబ్బురపడుతున్నాం. అయినా సోషలిజం, కమ్యూనిజం శ్రామికవర్గ విముక్తి అర్థాలు మారిన సందర్భంలో కదా జీవిస్తున్నాం. శ్రామికవర్గ విముక్తి సాధన గతి తార్కిక చారిత్రక భౌతికవాద చలన సూత్రాలంటే భారత దేశంలో అర్థాలే వేరుకదా!

లాభం, నష్టం గిట్టుబాటు, కూలీల ఆర్థిక అవసరార్థాల ఫాయిదా. అంతిమంగా జీవి త అవసరాల నుంచి కమ్యూనిజం కాని స్థితికదా! దశాబ్దాల అనంతరం. వలువలు విడిచి నగ్నంగా బయటపడుతున్నది. థాంక్స్‌ టు జ్యోతి ‘బాసు’.. ఇప్పుడిక భారతీయ శ్రామిక వర్గానికి కళ్లు విశాలంగా తెరచుకోవాల్సి ఉన్నది. కులం, లింగభేదం, మతం, ప్రాంతీయత, భిన్న సంస్కృతులు ఇవేవీ కమ్యూనిజం కళ్లకు కనబడని సామాజిక వాస్తవాలు. అస్థిత్వమూ, అస్థిత్వ, నేలవాసుల, మూలవాసుల ఉద్యమాలు కమ్యూనిజానికి సంకుచితాలయ్యాయి. కానీ, ప్రపంచంలో ఏ దేశంలో కన్నా భారతదేశంలోకదా! ఆర్థిక అసమానతలకు తోడు సామాజిక అసమానతలకు ‘సామ్యవాదం’ ఒక మంత్రం .ఇప్పుడిక దానికి కాలం చెల్లింది. ఓవెన్‌, ఆ తదనంతర తర్క, హేతు, మార్క్సిస్టు పండితులా రా! హెగెల్‌ ఎంగెల్స్‌, మార్క్స్‌.. నమస్తే.. చివరాఖరకు పెట్టుబడిదారీ వికృత వ్యవస్థ, మహాకాల్పనిక వైరుధ్యాలను పరమాద్భుతంగా చిత్రించిన ఛార్లెస్‌ డికెన్స్‌కూ ఒక సలాం. మీరు కాలం చెల్లిపోయారు.

సోషలిజం అంటే ఇప్పుడు అసమానతలు రూపుమాపే ఒక ఉద్యోగం. అది పెట్టుబడిదారీ వ్యవ స్థ మాత్రమే కల్పిస్తుంది. ఇదేదో తిరకాసు కాదు. తెలుసా! మార్క్స్‌. మా కనురెప్పలక్రింద విరిగిపడుతున్న కలల రెక్కల చప్పుడు మమ్మెల్నెంత నిస్సహాయతలోకి నెట్టిందో? తెలుసా! జ్యోతిబసు నీవెంట దశాబ్దాల తరబడి తిరిగిన ఎర్రదళం ఏ ఆశలు పోగొట్టుకున్నదో? చివరాఖరకు యూటూబ్రూటస్‌ కాదు కాదు సారీ! యూటూ జ్యోతిబసు. అయినా బెంగాల్‌లో, తెలంగాణలో ఎన్నడో చేతులు వేలాడేసిన కామ్రేడ్స్‌ కదా! సోషలిజం అమలవుతుందనో? అమలవుతున్నదనో భయాలెవరికీ లేవుకానీ.. రాజ్యం.. అధికారం మార్క్సిజాన్నీ, కమ్యూనిజాన్నీ ఎంతగా అధఃపాతాళంలోకి నెడుతుం దో? ఒక్క నందిగ్రామ్‌ చాలదా! అధికారాన్ని, అహంకారాన్నీ, అధిష్ఠానాన్నీ, దర్పాన్నీ, దౌర్జన్యాన్నీ ప్రశ్నించాల్సిన కమ్యూనిస్టులు (పేరుకే) నందిగ్రామ్‌లో ప్రదర్శించిన విలువలు రాజ్య స్వభావం అందరిదీ ఒక్కటే అని చాటలేదా!

అసహనం అవధులు మీరిన చోట చివరికి అత్యాచారాల వార్తలు విని, రాజ్యాంగయంత్రం అది బూర్జు వా పార్టీలదైనా… కమ్యూనిస్టులదైనా ఒకటే అని చాటినప్పుడు మ్రాన్పడిపోవడం ప్రపంచం వంతు కాలేదా! ఒక్క సోషలిజం కోసం కదా ఎనిమిదిన్నర దశాబ్దాల త్యాగాలు, తన్నులు, చిత్రహింసలు, ఎన్‌కౌంటర్లు, కాల్పులు, ఖననాలు, జైళ్లు, ఊచకోత లు, పోలీసుకాల్పులు, తడిఆరని గాయాలు, ఎర్రజెండాల బారు ఊరేగింపులు, ఉద్వేగాలు, ఉచ్ఛ్వాస నిశ్వాసలు… జీవితాలు ఫణంగా పెట్టిన వారెందరు? కుటుంబాలు కోల్పోయిందెందరు, కనలి కనలి, పొరలి, కెరలి నెత్తుటి రహదారులైందెవ్వరు? త్యాగా ల బాటలేసిందెవరు? మిస్టర్‌ జ్యోతిబసు… సోషలిజం ఇక ఊకదంపుడుకు కూడా పనికిరాని ఒక విసర్జన పదం నిషేధ పదం అయినప్పుడు… పేదల గురించి మాట్లాడే అర్హత కోల్పోలేదా? అవునిప్పుడు… నందిగ్రామ్‌, సింగూర్‌ల వెనకగల బుద్ధదేవ్‌ల, జ్యోతి’బాసు’ల వికృత స్వరూపాల మూలాలు తెలియడం ముదావహమే. సెలవు కామ్రేడ్స్‌… అలసిపోయాం. సోషలిజం ఎవరికితోచినట్టు వారు వ్యాఖ్యానించే, ఎవరికి తోచినట్టు వారు మార్చుకునే టోపీ అయితే కాదు.

వ్యాఖ్యలు»

1. daggumati padmakar reddy - ఫిబ్రవరి 11, 2009

baagundi. jyothilo chaduvuthune vuntanu mee articles. anubhavalu gaayaalu ga migulchukokunte chalu kada manamantha. manam okato rendo saarlu kalusukunnam.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: