jump to navigation

– అల్లం నారాయణ ఏప్రిల్ 29, 2008

Posted by Telangana Media in Telangana Articles.
trackback

చి తా భస్మం నుంచి లేచివచ్చిన ఫీనిక్స్‌ పక్షి.. టపటపా రెక్కలు కొట్టుకుంటున్నప్పుడు.. అలసిపోలేదా మిత్ర మా. కన్నీటి కాలాల ఆగడ్తల మధ్య. డస్సిపోలేదా మిత్రమా.. ఏండ్ల కేండ్లు ఏటికి ఎదురీదిన రెక్కలు. మూడున్నర దశాబ్దాల అనంతరం. నీ బలమైన ఒకప్పటి బాహువుల స్థానే.. కొంచెం పీలగా నరాలుతేలిన ఆ పిడికిలి ఆకాశంలోకి విసురుతూ ..నువ్వింకా..నీ ఆశయాలను పలకరిస్తూ… ఆ తుపాను తెమ్మెర లాగే ఉంటూ.. ఇంకా ఉన్నందుకు.. ఇంకా మిగిలినందుకు.. కలలు తెగిపడ్తున్న బీభత్స దృశ్యాల్లోనూ కొన ఊపిరుల మంట లు సాస్తున్నందుకూ.. కానీ మిత్రమా… పడమటిగాలి మింగే స్తున్న తూరుపుగాలిలో ఫీనిక్స్‌లు మళ్లీ చితా భస్మాలవుతున్న ఒక కానికాలం.

నీ ఏకే 47ను, నీ కలెష్ని కోవ్‌ను ప్రేమించాము. దాన్ని భుజం మార్చుకున్న నీ విశాల బాహువుల్నీ ప్రేమించాము. ఒక సహజ పురాన్యాయం గురించి నీ నాల్కల కొసన ఊరేగే మాటల మంట లనూ ప్రేమించాము. మూడున్నర దశాబ్దాల సుదీర్ఘ ప్రేమ. ఎడబాటులేని, ప్రేమ. చివరకు మిగిలేది. యుద్ధాలు, విప్ల వా లూ.. యాధృచ్ఛికతలూ… చరిత్రతా.. ‘సెరెండిపిటీ’.. ఒకానొక క్షణాన. వంతెనలు కూలుతున్నప్పుడు. ఊగులాడు ఇనుప గొలు సు లేనప్పుడు. టాటూనది వంతెన కూలుతున్నప్పుడు.

ప్రపం చం అర్థంకానప్పుడు. పూర్తిగా కనుమరుగౌతున్నప్పుడు. విస్తరి స్తూ. విస్తరిస్తూ.. ఎచటకు వెడతావీ రాత్రి.. దండకారణ్యం నుంచి దండకారణ్యానికి, అరణ్యం నుంచి..మైదానానికెప్పుడొస్తుంది మళ్లీ ఫీనిక్స్‌ పక్షి. కలలు కూలుతున్నప్పుడు. మనుషులు మాత్ర మే.. గుర్తుంటారు. పాతికేళ్ల వనవాసం తర్వాత ఒంటరిగా ఖనన మవుతున్న వీరుని మృతదేహం. దిక్కూ దశలేని నిర్వేదం. సంపూ ర్ణ వైఫల్యం. పదఘట్టనలు, పటాటోపాలు, కవాతులు తీరిన బారు ఎర్రజెండాలు అవనతమైన దృశ్యాలు. వీధులు నిస్సత్తువ లో మూర్ఛనలు పోతున్నప్పుడు.

సుదీర్ఘకాలపు అజ్ఞాతం. జ్ఞాత అజ్ఞాతాల ఆగడ్తల మధ్య. అమ రత్వానికీలేని… ఎందుకులే.. అనామకుడి మరణం. జైలునుంచి కోర్టుకు, కోర్టునుంచి జైలుకు ఇక రక్త ‘చక్కెర’ సంగీత శృతి. మిత్ర మా. విప్లవం వర్దిల్లడం లేదు. అదొక చేదు జ్ఞాపకం. అది ఊర్లకు ఊర్లను తట్టిలేపింది. అది పల్లెల గానాలను పరివ్యాప్తం చేసింది. కాళ్ల కింది నేలను ఎగసిన సుడిగాలి ఇసుక తపానులు చేసింది. బాంచెన్‌దొరా బతుకులను అది ప్రశ్నల కొడవళ్లుగా సాన బెట్టిం ది. అది దండోరా మోగించిన దళాల కవాతు అయింది. కానీ ఎక్కడో బిస తప్పింది. ఎక్కడో మర చెడింది. ఎక్కడో దారి తప్పింది.ఎక్కడో ఏదో దారపుఉండవలె చిక్కుబడి పోయింది.

త్యాగాల చాళ్లలో జిల్లెల్లు మొలిచినయి. వెన్నుపోటు వెన్నంటి న శత్రువు. మందలో తోడేలు. ఎడతెగని మౌనభాష. ఏకధృవం. మూడున్నర దశాబ్దాలు. ఎన్నెన్ని జ్ఞాపకాలు.. ముంజేతిని ఖండించిన పిడికిట కత్తివదలని మనోస్థైర్యం. గూడలు జారిన పాతతరం. శాంతీ యుద్ధమే.. యుద్ధం కోసమూశాంతి అంటూ ఆ చిన్న ఆరుట్ల ఐ మూల అడవుల నుంచి నువ్వూ నీతో పాటు నీ ఏకేఫార్టీ సెవెన్‌ మోసిన భుజబలమూ వచ్చి మంజీర గెస్ట్‌హౌస్‌లో విడిది చేసినప్పుడు కలలేకలలు. కొన్ని కన్నీళ్ల వరదలు. భూమీ దాని చుట్టూ తిరిగిన చర్చోపచర్చలు. కమ్ముకునే దాకా తెలియని ఫ్యూహాత్మక తప్పిదం తర్వాత ఏమి మిగిలింది? ఏమి ఒరిగింది. ఏమి జరిగింది. అదంతా ఇప్పు డొక చరిత్ర.

నల్లమల మూలమూలనా భౌతిక కాయాల సాక్షిగా… చెట్టూ చేమా సాక్షిగా. గుర్తుందా మిత్రమా.. సరిగ్గా ముప్పదేండ్ల క్రితం. జగిత్యాల వీధుల్లో కలెదిగిన జైత్రయాత్ర కవాతు. ప్రజాపంథా. ప్రజల భాగస్వామ్యంతో నిర్మితమయ్యే ప్రజాదండు. ముప్పదేళ్ల అనంత రం. బూడిద మిగిలిన పల్లెల్లో ఫీనిక్స్‌ పక్షుల గురించి ఇంకా ఏమి కలలు మిగిలుంటాయని. అవునూ ఎర్రజెండా ఒక చిహ్నం. తలుపులు బార్లా తెరిచి ఉన్న శిథిల గృహం ముందు ఒక యాది. అమరవీరుని జ్ఞాపకం ఇప్పుడొక సగం కూలిన ఎర్రెర్రని స్థూపం.

పేరుకొకరుగా, ఊరు కొకరుగా, చెట్టుకొకరుగా, పుట్టకొకరుగా చెదిరిన జ్ఞాపకం. మిత్రమా… దుఃఖమూ సుదీర్ఘమైందే. ఇదెంత పొడవు. గోదావరి అటు ఇటుగా ప్రవహించిన మేరా విషాదాల కన్నీటి పొర ఇంకా ఏం మిగిలిందని. కలలు కూలుతున్న చప్పడు. ఇంకెంత మాత్రం ఊరు మీద విప్లవం ఒక పతాక కాదు. మారిపోయింది కదా పల్లె. ఆ మనుషు లున్నారంటారా! ఆ ప్రేములున్నాయంటారా. పరులకోసం ప్రాణాలిచ్చే ఆ సంస్క­ృతీ… ఆ త్యాగమూ… భుజాలు ఒరుసు కొని ప్రవహించే ఆ ఉమ్మడి జీవనధార. పల్లెమిగిలందంటావా కామ్రేడ్‌. తన సమస్త బాహువులతో విస్తరించిన ఆ కలెగలిపిన కట్టుతాడు మిగిలి ఉందంటావా.. కటకటాల వెనక జైలులో… కలలు భగ్నమైన ఫీనిక్స్‌ పక్షి. ఇక చాలు మిత్రమా… ఆ దూరభారం మోయలేం.

ఆ గాయాలను తడుముకొన్న ప్పుడల్లా మిగిలిన కన్నీటి గుండాలల్లో మునగలేం. తడి ఆరని ఆ కన్నీటి సుడి యవ్వన గీతాలకు.. కలలకు,కన్నీళ్లకు… ఇప్పుడెందుకో హఠాత్తుగా ఆ హియాలయ సానువుల్లో రగిలిన మంటల అనంతర పరి ణామాలు గుర్తొస్తున్నాయి. బహుశా ప్రచం డ, బాబూరామ్‌ భట్టారాయ్‌లు కూడా.. విప్లవాలు సుదీర్ఘ మైనప్పుడు కలలు కూలి నప్పుడు.. వైఫల్యం ముసిరి నప్పుడు. సెల వు మిత్రమా. ఇక అలసి పోయాం. .నేపాల్‌ ఎందుకో మనాదగా మారింది. సెలవు.. ఇక ఈ దారికి విరామం.. బహుశా నేపాల్‌ ఒక దారి కూడా… కావొచ్చు. నెత్తు రోడిన ఒక పల్లె సంభాషణ..కూడా అదే కావచ్చు..

వ్యాఖ్యలు»

1. K srikanth - డిసెంబర్ 4, 2009

Great article by allam narayana sir. I am huge fan of him. Reading his article is air raising. He gives voice to poor, suppressed people.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: