jump to navigation

విద్యార్థులపై జులుం వద్దు: సిపిఐ డిసెంబర్ 8, 2009

Posted by Telangana Media in Telangana Articles.
trackback

హైదరాబాదు: విద్యార్థులు చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమానికి సిపిఐ పూర్తి మద్దతు ప్రకటిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ చెప్పారు. విద్యార్థులపై పోలీసుల జులుం ప్రదర్శించవద్దన్నారు. ప్రత్యేక తెలంగాణ వాదం రాజద్రోహం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. మంత్రి దానం నాగేందర్‌ని అదుపులో పెట్టండని ఆయన కాంగ్రెస్‌ నేతలను కోరారు.

ప్రకటనలు

వ్యాఖ్యలు»

1. sureshdevla - జనవరి 29, 2010

ఇదా సమైక్యాంధ్ర..! ఇదా విశాలాంధ్ర..!!
ఫ్రజాస్వామ్య భారతం లొ ప్రతి ఒక్కరికి తమ అభిప్రాయాన్ని తెలిపే హక్కు ఉంది. తమ హక్కుల కోసం పొరాడే భాద్యత వుంది. సమైక్యాంధ్ర కోసం ఆందొళన చేస్తున్న ప్రతి ఆంధ్రునికి… భగ్గుమంటున్న తెలంగాణ కడుపు మంట తెలుసా?? 50 ఏళ్ళుగ గుండె కోస్తున్న వ్యధ తెలుసా?

1956 లొ ఆంధ్ర ఫ్రదేశ్ మొట్ట మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడక ముందే.. తెలంగాణ ఒక రాష్ట్రం. నిజాం నిరంకుశ పాలన అంతమయ్యాక, హైదరాబాద్ రాజధానిగా 1948 సెప్టెంబర్ 17 న తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడింది. స్వతంత్ర భారతంలొ తెలంగాణ ఒక సుభిక్ష రాష్ట్రం. అప్పటి గనాంకాల ప్రకారం 400 ఏళ్ళ చరిత్ర కలిగిన హైదరాబాద్, భారతదెశం లొ ఐదవ మహా నగరం. 1953 లొ తమిళులతొ కలిసి వుండలేక.. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలని.. మహానుభావుడు శ్రీ పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష చేసారు. దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం.. 1953 అక్టొబర్ 1 న, ఆంధ్ర & రాయలసీమలని కలిపి కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుచేసింది. 1956 వరకు తెలంగాణ మరియు ఆంధ్ర రెండు వెరు వెరు రాష్ట్రాలు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చెయ్యాలన్న కేంద్రం నిర్ణయం తొ ఆంధ్ర పాలకులు, పుష్టిగా జలవనరులతొ వున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రా లొ కలుపుకొని.. విశాలాంధ్రగా అవతరించాలని సమాలొచనలు జరిపారు.

పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలం ఆంధ్ర రాష్ట్రం.. ఆయన ప్రతిపాదించిన రాష్ట్రంలొ తెలంగాణ లెనేలెదు. మరి ఎందుకు సమైక్య ఆంధ్ర కోసం ఆయన ప్రాణాలిచ్చినట్టు చరిత్రను వక్రీకరిస్తున్నారు ??

ఆప్పటి తెలంగాణ రాష్ట్ర ప్రజలు… ఆంధ్ర తొ కలిస్తె తమ అభివౄద్ధి కుంటుపడుతుందని .. అనిచివేయ బడతామని.. విశాలాంధ్ర కు వ్యతిరేకంగా తమ వాణిని దెశ వ్యాప్తంగ వినిపించారు. ఆప్పటి ప్రధాని శ్రీ నెహ్రూ.. తెలంగాణ అభిప్రాయాలని మన్నించి.. “కలసి వుండడం కుదరక పోతె మళ్ళి విడిపొవచ్చు” అన్న వెసులుబాటుతొ విశాలాంధ్ర కు సమ్మతించారు. అప్పటి State Reorganization Committee కూడా దీనితొ ఎకీభవించి తెలంగాణ & ఆంధ్ర రాష్ట్రాల మిళితాన్ని ప్రొత్సహించింది.

కలిసుండడం కుదరకపొతే విడిపొవచ్చన్న వెసులుబాటు తొనె ఏర్పడిన ఆంధ్ర ఫ్రదేశ్ నుండి నిర్లక్షానికి గురైన మేము విడిపొతామంటె అంగీకరించరెందుకు ??
ఆంధ్ర రాష్ట్రం ఏర్పడక ముందే, హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రం. ఇప్పుడు మేము విడిపొతమంటె మీకెందుకు బాధ??

రెండు రాష్ట్రాలని కలిపేముందు.. ఆంధ్ర రాష్ట్ర పాలకులు తెలంగాణకు ఎన్నో ప్రమాణాలు చేసారు. తెలంగాణ ప్రాంతాన్ని మరింత అభివౄద్ధి చెస్తామని.. భీడు భూములని పంటపొలాలుగా మారుస్తామని.. సమైక్యఆంధ్రలొ తెలంగాణ ప్రజలను గౌరవిస్తామని.. వారి సంస్కౄతి కి సమున్నత ప్రాధాన్యమిస్తామని.. ఉద్యోగలిస్థామని.. వాగ్దానాలు చెసారు.. కలల ప్రపంచంలొ విహరింప చెసారు. ఆఇష్టంగానె.. తెలంగాణ ప్రజలు ఆంధ్ర రాష్ట్రం తొ కలవడానికి అంగీకరించారు. అదే సమైక్య ఆంధ్ర కు నాంది. అదే తెలంగాణ అదోగతికి పునాది. విశాలాంధ్ర ఎర్పడిన తరవాత, ఇచ్చిన వాగ్దానాలని నెరవేరుస్తారని తెలంగాణ ప్రజలు ఎదురు చుస్తూనే వున్నారు. 1956 లొ ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడినది మొదలు నేటికి అవి తెలంగాణ కు ఎండమావులె. ఇచ్చిన ఏ ఓక్క వాగ్దానము నెరవేర్చలెదు సరి కదా.. తెలంగాణని కరువు కోరల్లొకి నెట్టేసారు. గత 50 ఏళ్ళుగా తెలంగాణ పై సవతి ప్రేమ చూపిస్తూనే వున్నారు. పక్షపాతంతొ ప్రజల పొట్ట కొడుతూనే ఉన్నారు..

వీడు పాయె వాడు పాయె
చూసి చూసి రెప్ప వాలి పొయె
ఇంకెప్పుడు ఇంకెప్పుడు…
తెలంగాణకు మొక్షమెప్పుడు

దక్షిణ భారతం లొ ప్రఖ్యాత నదులు కృష్ణా & గోదావరి తెలంగాణ గుండా ప్రవహిస్థున్నాయి. ఈ రెండు నదులకి మూడింట రెండు (2/3) వొంతుల నీళ్ళు తెలంగాణ నుండె సమకూరుతున్నాయి. ఈ నీళ్ళతొనె తెలంగాణ భూములను పచ్చటి పంట పొలాలుగ మారుస్తామని, ఆనకట్టలు కట్టి సేద్యానికి సాయం చెస్తామని ఆంధ్ర నాయకులు చెసిన ప్రమాణాలు నీటి మీద రాతలె అయ్యాయి. కృష్ణా నది పై ఇచ్చంపల్లి, అప్పర్ కృష్ణా, తుంగభద్ర లెఫ్ట్ కెనాల్, గోదావరి వ్యాలి ప్రాజెక్ట్, దెవనూర్ ప్రాజెక్టులు కడతామని ఆశలు చుపారు. ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడగానె…. అన్ని ప్రాజెక్టులు నిలిచిపొయాయి, అప్పటికె మొదలు పెట్టిన ప్రాజెక్టులు ఆగిపొయాయి. మొదలు కాని ప్రాజెక్టులు అటకెక్కాయి. వీటికి నేటికి మొక్షం కలగలేదు.

తెలంగాణ కు నిళ్ళిమ్మన్నప్పుడు ఏమైంది సొదరాంధ్ర
కృష్ణా జలాలడిగినప్పుడు ఎమైంది విశాలాంధ్ర
ఏమాయె ఏమాయె గొదావరి, తుంగబద్ర
ఏందిర ఈ బాధ.. ఇదేనా సమైక్యాంధ్ర.

1956 లెఖ్ఖల ప్రకారం, తెలంగాణ లొ సాగు భుమి 20 లక్షల ఎకరాలు. ఇప్పుడు అది 12 లక్షల ఎకరాలకు పడిపోయింది. పొంగి పొర్లె కృష్ణా నదిలొ నీరు 900 TMC. అందులొ తెలంగాణ వంతు 550 TMC. కాని ప్రస్తుతం తెలంగాణ వినియొగించుకుంటున్న నీరు 100 TMC మాత్రమె. మిగిలిన 800 TMC ఆంధ్ర కు తరలిపొతుంది. తెలంగాణ లొ వ్యవసాయం కోసం ఆంధ్ర ఫ్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నదిపై ఎన్నొ ప్రాజెక్టులని కడతామని హామిలు ఇచ్చింది. దశాబ్దాలుగా భీమ, కల్వకుర్తి, నెట్టెంపాడు, SLBC, నాగార్జున సాగర్ టేల్ పాండ్ వాగ్దానాలకే పరిమితమయ్యాయి. ఈ ప్రాజెక్టులు కాగితాలు దిగి కళ్ళముందుకి ఇంకెప్పుడు వొచ్చెను ???.

కాల్వలొ నీటి బొట్టు లేక.. …పంటలొకి చుక్క నీరు రాక..
వాన దేవుడు కరునించక……పంట పండించ లేక.
బుక్కెడు బువ్వ లేక…… గుక్కెడు నీరు లేక..
మింగ లేక కక్క లేక…… బిగుసుకున్న ఉచ్చులెక్క..
గుండె కోస్తున్న కడుపు మంట లెక్క.
ఇదేం లెఖ్ఖ…… అదేం లెఖ్ఖ..
ఇదె ఇదె సమైక్యాంధ్ర లెఖ్ఖ..

తెలంగాణ లొ 5 లక్షల ఎకరాలకు నీటిని అందిస్తామని ఎన్నడో ప్రారంభించిన శ్రీశైలం ప్రాజెక్టు ఇంకా పూర్తి కూడ కాలెదు. శ్రీశైలం ఎడమ కాల్వకు ఇంకా మోక్షం లభించకపొవడం తొ ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణ పండిచిన పంట నిండు సున్నా!!. దేశం లోనె ప్రఖ్యాతిగాంచినది నాగార్జున సాగర్ డ్యాం. మొదటగ తెలంగాణకు సాగు నీరు అందిచాలన్న ఉద్దెషం తొ ఈ ప్రొజెచ్త్ ను తెలంగాణ లొని ఐలెష్వరం లొ ప్రతిపాదించారు. నాగార్జున సాగర్ జలాలు ఆంధ్రాకు మాత్రమె అందాలన్న కుట్ర తొ ఈ ప్రాజెక్టును దాదాపు 90 కిలొ మీటర్లు జరిపి గుంటూరులొ కట్టారు. ఇదేనా న్యాయం ?? సోదరున్నే దొచుకున్న ధర్మం సమైక్యాంధ్ర కే చెల్లింది !!! ప్రతిపాదిత నాగార్జున సాగర్ తెలంగాణ లొ 15 లక్షల ఎకరాలకు సాగు నీరందివ్వాల్సి వుండగా ప్రస్తుతం 5 లక్షల ఎకరాలకు మాత్రమె నీరందుతుంది. నాగార్జున సాగర్ కు గుంటూరు నల్లగొండలు ఇరు వైపుల వున్నా..పచ్చని పైరుతొ గుంటూరు కిటకిట లాడుతూ వుంటె… సాగు నీరు కాదు కదా గుక్కెడు మంచి నీరందక నల్లగొండ కటకట లాడుతుంది.

రెజర్వాయరు నల్లగొండలొ.. కాల్వలు గుంటూరు లొ..
డ్యాములు మహబూబ్ నగరు లొ పంటలు కర్నూల్ లొ
ఇచ్చంపల్లి ఎమాయె… దెవాదుల ఎమాయె..
చెతుల బెల్లం కాకి ఎత్తుకపాయె
ఏమాయె సమైక్యాంధ్ర…. ఏమాయె విశాలంధ్ర.

దక్షిణ గంగ.. గోదావరి, తెలంగాణలొ 1000 కిలొ మిటర్ల పైగా ప్రవహిస్తుంటె… దాని మీద ఇక్కడున్న ఏకైక ప్రాజెక్ట్ శ్రీరాం సాగర్. 16 లక్షల ఎకరాలకు సాగు నీరందిస్తామని గోదావరి మీద నిర్మించ తలపెట్టిన యెల్లంపల్లి. దెవాదుల, దుమ్ముగూడెం, లెండి, గుత్ప, అలీ సాగర్, ప్రాణహిత & పెనుగంగ ఇప్పటికి అందని ద్రాక్షపళ్ళె. ఇందులొ కొన్ని మొదల్లయ్యి ఆగి పొయాయి.. కొన్ని శంకుస్థాపనలకే పరిమితం అయ్యాయి. గోదావరి జలాల్లొ తెలంగాణ వొంతు 1154 TMC, కాని తెలంగాణకు ఇస్తున్న నీళ్ళు 100 TMC మాత్రమె. 16 లక్షల ఎకరాలు కాదు కదా… కనీసం 6 లక్షల ఎకరాలకు కూడా నీరు విధిలించడానికి మనసు రావడం లేదు.

తెలంగాణ లొ పారుతున్న నదులెన్ని… నదుల మీద ఆయకట్ట లెన్ని.
కాలువ లెన్ని…. సారవంత భూములెన్ని..
సాగు చేస్తున్న నేలలెన్ని….. తడుపుతున్న గొంతులెన్ని
కాలుతున్న కడుపులెన్ని…. తీసుకున్న ప్రాణాలెన్ని.
పెట్టిన పరిశ్రమలెన్ని… ఇస్తున్న ఉద్యోగాలెన్ని…
ఇదా సమైక్యాంధ్ర.. ఇదా విశాలాంధ్ర..

తెలంగాణ లొ త్రాగు నీటికి ఆధారం భూగర్భ జలం.
వర్షాలు లేక.. నదుల నీరు నిలువక.
నేల కింది నీరు ఇంకిపొయే. అందిన కొన్ని నీళ్ళెమో ఫ్లొరిన్ మయమాయే.
నీరందక ఎండిన గొంతులు కొన్నైతే.. అందిన నీళ్ళతొ క్రుంగిన శరీరాలు మరెన్నో.

ఉద్యోగాల విషయం లొ కూడా తెలంగాణ కు చుక్కెదురె. సెక్రెటేరియట్ లొ తెలంగాణ కోటా ఉద్యొగాలు 8%. హై కొర్ట్ లొ 20%. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమె. ఆంధ్ర ఫ్రదేశ్ లొ 42% జనాభ తెలంగాణ లోనె. వారికి ఉద్యోగాల వాటా ఇంతేనా?? ప్రాంతీయులకు ప్రాధాన్యం ఇవ్వాలని 1985 లొ ఇచ్చిన 610 జి.వొ. ఇంకా ఎందుకు అమలుకు నోచుకోలేదు ?? ప్రైవెటు సంస్థల్లొను ఇదే తీరు… ఫ్యక్టరీలు పెట్టేది తెలంగాణ లొ… కలుశితం చేసెది తెలంగాణ నీళ్ళని, ఆరోగ్యం పాడు చెసెది తెలంగాణ ప్రజలది…. కాని ఆ పరిశ్రమలలొ ఉద్యోగాలు మాత్రం ఆంధ్రొల్లవి.
మా వాటా ఉద్యొగాలు కావలన్నప్పుడు ఏమైంది సమైక్యాంధ్ర?
610 జి. వొ. అమలు చేయమన్నప్పుడు ఏమైంది విశాలాంధ్ర ?

తెలంగాణ నుండి రాష్ట్ర ఖజానకు 45 % ఆదాయం వెల్తుంటె, తెలంగాణ అభివౄధికి చెస్తున్న కర్చు 28%. రంగారెడ్డి జిల్లాలొ వున్న భూములను అమ్మగా వొచ్చిన ఆదాయం 20000 కొట్లకు పైనె. అందులొ తెలంగాణ కోసం ఖర్చు చెసింది నయా పైస లేదు. పంటలు ఆంధ్ర లొ పండిస్తరు.. తెలంగాణ లొ రియల్ ఎస్టెట్ చెస్తరు.

అన్న తమ్ముళ్ళలా కలిసుండాలనె వాళ్ళు.. తెలంగాణ తమ్ముడికి అన్యాయం జరుగుతుంటె చూస్తూ ఎలా ఊరుకుంటున్నారు ??
ఇదా సమైక్యాంధ్ర.. ఇదా విశాలంధ్ర..??

బండెనక బండి కట్టి… పదహారు బండ్లు కట్టి
తెలంగాణ కడుపు కొట్టి.. మా కష్టం దొచి పెట్టి
బండ్ల నిండ సొమ్ము పెట్టి.. ఆంధ్రా బాట పట్టి..
ఏ బండ్లె పొతవ్ తమ్ముడా… ఆంధ్ర సర్కరొడా.

ఎన్నాళ్ళు.. ఎన్నేళ్ళు.. ఈ దొపిడి.. ఈ పీడిత..
మెమాగం మెమొర్వం.. సహించం సహకరించం..
మా నీళ్ళు.. మా భూములు.. మా ఆకలి.. మా కడుపులు…
మా పంటలు.. మా రాసులు….మా రాజ్యం.. మా ప్రభుత్వం..
జై ర తెలంగాణ… జై జై ర తెలంగాణ …

2. sureshdevla - జనవరి 29, 2010

తెలంగాణ… పరిష్కారమా?.. ప్రత్యామ్నాయమా??
తెలంగాణ వేర్పాటే పరిష్కారమా??…. పరిష్కారం కాదు, ప్రత్యామ్నాయం మాత్రమే. మరి ఎక్కడుంది ఈ సమస్యకు పరిష్కారం ??? భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు శ్రీ నెహ్రూ ఉధ్ఘాటించిన నిజాల్లో వుంది. ప్రాంతీయ అసంతృప్తులు పెళ్ళుబుకుతాయేమో అన్న SRC అనుమానాల్లో వుంది. ఆంధ్ర ఫ్రధేశ్ అవతరణకి ముందు చేసిన పెద్ద మనుషుల ఒప్పందంలో వుంది. జై తెలంగాణ ఉద్యమం ఎగిసిపడ్డప్పుడు ఇందిరమ్మ చేసిన ఆరు సూత్రాల ప్రణాళికలో వుంది. ప్రాంతీయులకు ఉద్యోగాలివ్వాలని నందమూరి జారీ చేసిన 610 జి.వొ. లో వుంది.

“ప్రాజెక్టులన్నీ పడ్వవడేను, ఎస్సార్సి ఎన్నడో ఎండిపాయెను,
మట్టిల కలిసే పెద్దోల్ల సౌద, ఆరొందలపది ఆవిరయ్యేను,
మా ఆశలన్నీ తేలిపాయెను, ఏమున్నదింక మా బతుకు తేల.”

ఇన్ని పరిష్కారాలు ఇచ్చినా ఏఒక్కటీ అమలుకు నోచుకోలేదెందుకు ??? 50 ఏళ్ళుగ తెలంగాణ ఇంకా ఎందుకు వెనకబడివుంది? తమ వనరుల కోసం ఇంకా ఎందుకు పోరాడుతుంది? ఇన్ని పరిష్కారాలలో ఏఒక్కటి అమలు జరిగినా నేడు అన్నదమ్ముల మధ్య అగ్గి రాజుకునేదా ??? దేశంలోని ప్రతీ సమస్యపై ఔన్నత్యాన్ని చూపే తెలుగోడికి, తోటి తెలంగాణ గోడు పై శీతకన్నేయడం శోచనీయం.

మొదలు పెట్టిన ఏఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేసివుంటే నేడు నీళ్ళ కోసం మోకరిల్లె వారమా? చేస్తామని చెప్పిన అభివృద్ధిలో వీసమంతైనా జరిగివుంటె నేడు వెనకబడి వున్నామని అర్ధించే వాల్లమా? ప్రాంతీయులకు ఉద్యోగాలివ్వడంలొ చొరవ చూపించి వుంటే పొట్టచేత పట్టుకొని అరబ్ దేశాలాకు వలసలుండేవా? మరి నేడు ప్రాంతీయ అసమానతలు పొడచూపుతున్నాయంటే ఎవరిది తప్పు… ఆదుకోండని అలమటిస్తున్న ప్రజలదా?? లేక చెవిన నీరు పోసుకున్న పాలకులదా?? 50 ఏళ్ళుగా చేస్తున్న ప్రభుత్వ విధానాలదా? పక్షపాత బుద్దులతొ తెలంగాణ తమ్ముడికే అన్యాయం చేస్తున్న నాయకులదా?? దోశం ప్రభుత్వాలదైనప్పుడు, మా కష్టాలెరిగిన నిశ్పక్షపాత పరిపాలన కావాలని కోరుకోవడం నేరమా?? ఇది నేరం అయితే.. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసిన మహానుభావుల త్యాగాలు ప్రశ్నార్ధకమే !!!!

“బీడువారిన భూమినిడిసి, బర్ల గొర్లనమ్ముకొని,
పొట్ట చేతపట్టుకుని, సంకల మూటెత్తుకోని,
పిల్లజల్లనొదిలేసి, పుట్టినూరునొదులుకుని,
గుండెల్ల ఆశ నింపుకొని, దుబాయికేశి పైనమయ్యి,
నూనెబాయి కావలున్న, కూలినాలి చేసుకున్న,
దినారెమో కూడదాయె, బానిస బతుకీడ్సుడాయె,
అప్పులింక కూడ్పపోతి, ఈడనే ఇరికిపోతి.”

హైదరాబాద్ రాజధాని కావడంతో అన్ని ప్రాంతాల వారు వలసలొచ్చి జీవనోపాధిని వెతుక్కుంటున్నారు. వ్యాపారాలు చేసుకుంటున్నారు. రాష్ట్రం నుండే కాకుండా దేశం నలుమూలల నుండొచ్చిన ప్రజలు హైదరాబాద్ లోనే తమ సొంతూరిని చూసుకుంటున్నారు. ప్రత్యేక రాష్ట్రం అడిగినంత మాత్రాన వీరందరిని గెంటేస్తారని అర్ధమేనా? ఇప్పటికీ మద్రాసులో ఉంటూ ఉద్యోగ, వ్యాపారాల్లో రానించిన తెలుగు వారు లెక్కకు మిక్కిలి. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక వాళ్ళందరిని పొమ్మనలేదు కదా!! సీమాంతరాలు దాటెల్లి వున్నత స్తానాలు చేరుకున్న ప్రవాసాంధ్రులు ఎందరో. వీరంతా స్థానికేతరులయినా కీలక పదవులు పొందలేదా !! ఒక తెలుగువాడిగా “జాగో – భాగో” నినాదాలని ఖండిస్తున్నాను. ఇలాంటివి తొందరపాటు వాఖ్యలే తప్ప తోటి తెలుగు వారిని తరిమివేయాలన్న దురాలోచన కానే కాదు. రాష్ట్ర విభజన, పరిపాలనలోనే తప్ప మనుషుల మధ్య కాదు. ప్రత్యేక రాష్ట్రం ఆకలి కడుపుకు అన్నం పెట్టడం కోసమే తప్ప సాటి తెలుగోడి నోటి ముందు కూడు దూరం చెయ్యడంకోసం కాదు. తెలంగాణ వేర్పాటు, ఎండిపోయిన నేలమీద నీటి చుక్కలేయాలనే తప్ప ఈ నేల మాది మాత్రమే అన్న దురహంకారం కాదు. ఏప్రాంత వాసులైనా, ఏమూల నుండి వొచ్చినా, హైదరాబాద్ అక్కున చేర్చుకుంటుందే కానీ, కాదు పొమ్మని దూరం చేసుకోదు. తెలంగాణ వేరుపడితే వలసొచ్చిన వారికి విలువ వుండదేమో అన్న అపోహలు వీడండి.

ఇక కొందరు వేర్పాటు వాదుల రెచ్చగొట్టే ఉపన్యాసాలతొనే నేడు తెలంగాణ ప్రజలు వీధుల్లోకి వొచ్చారని భావిస్తే అది సమస్య కి ఒక కోణం మాత్రమే. రాజకీయ ప్రయోజనాలకోసమే అయితే కార్యకర్తలే ముందుంటారు తప్ప, బలి దానాలిచ్చే విధ్యార్ధులు కాదు. ఆత్మార్పణ చేసుకున్న 40 మంది, తెలంగాణ కోసం ప్రాణాలర్పించారే తప్ప పార్టీల కోసం కాదు. 50 ఏళ్ళ క్రితమే ఈ ఉద్యమం ప్రజల నుండి పుట్టుకొచ్చింది. ప్రజాగ్రహానికి ప్రధాన మంత్రులే కదిలి వొచ్చారు. నాటి నుండి నేటి వరకు ఇది ప్రజా ఉద్యమమే కాని రాజకీయ నాటకం కాదు. ఈ సమస్యని ప్రతీ పార్టీ తమ రాజకీయ ప్రయోజనాలకోసం ఉపయొంగించుకుందే కానీ, ఉపశమనం చూపలేక పోయింది. ఇంతకముందు తెలంగాణ ఉద్యమాన్ని అనిచివేసిన అదే నాయకులు, నేడు తమ స్వార్ధ రాజకీయాలకు పావుగా వాడుకుంటున్నారు. పదవుల కోసం కొందరయితే, అధికారం కోసం మరికొందరు. ఎన్నికల కోసం కొందరయితే, సామాజిక అవసరాల కోసం ఇంకొందరు. నేడు సమైక్యాంధ్ర కోసం పొరాడుతున్న వీరే… నాడు ఓట్ల కోసం తెలంగాణ జై అన్నారు. సభలు పెట్టి తెలంగాణకు సై అన్నారు. ఎన్నికలు ముగిసాక జాంతా నై అంటున్నారు. అధికారం వొచ్చాక ఓడ మల్లన్నను బోడ మల్లన్నను చేసారు. నాడు వేదికలెక్కి తెలంగాణ కోసం ఉపన్యాసాలతొ ఊదరగొట్టినవాల్లె నేడు సమైక్య రాగంతొ రోడ్లెక్కారు. శ్రుతితప్పుతున్న ఈ రాగం వ్యాపార సామ్రాజ్యాలు కూలిపొతాయన్న భయంతొ కొందరు స్రుష్టించినదన్న వాదన కొట్టి పారేయలేని పార్శ్వం.

“కళ్ళంల రాశి కంటికానక,
జేబుల కాసు చెజారిపోగ,
అంగట్ల సరుకు ఇంట్లకు రాక,
కురాడు గంజి ఇంకిపోగ,
అప్పులొల్లు ఇక్కట్లు పెట్టంగ,
నేసిన నూలె గొంతు కోయగ.
దున్నిన నేలల్నే దహనం చెస్తిరి.”

ఆకలి కడుపుకి వేదాంతం రుచించదు. పట్టెడన్నం పెట్టకుండా “కలిసుంటే కలదు సుఖమని” పాఠాలు వల్లె వేస్తారేం?? కలిసుండడం తెలుగు వాళ్ళందరికీ శ్రేయస్కరం అయినప్పుడు తోటి తెలుగువాడు కరువు తో ఆత్మహత్యలకు పూనుకుంటుంటే సాయానికి చెయ్యియ్యరేం? ఈ అన్యాయాన్ని గొంతెత్తి ప్రశ్నించరేం?? కష్టాన్ని పంచుకుంటాం అనరేం? ఓఅన్నగా మా సమస్యలని తీరుస్తాం అని భరోసా ఇవ్వరేం? 50 ఎళ్ళుగా కలిసుండడంలో రాని సుఖం, ఇంకెప్పుటికొస్తుంది?? ఇంత జరుగుతున్నా, తెలంగాణ సమస్యల పై ఏ ఒక్కరు స్పందించరేం?? ఆమోదయోగ్యమైన ఏ ఒక్క పరిష్కారం కూడా అమలుకు నోచుకోనప్పుడు, ప్రత్యామ్నాయం కాక మరేదీ మార్గం.

“ఉమ్మడిగుంటే సుఖమున్నదనీ, అన్నగ కష్టం తీరుస్తనంటివి,
ఆశగ చూస్తీ ఆకలికి పిలిస్తి, ఏమాయె అన్నా చెయ్యియ్యవెమీ,
ఒక్క తల్లికి ముగ్గురు బిడ్డలం, తమ్మున్ని ఇట్లా గాలికొదిలితివి,
ఏడంగపుట్టే ఈ సవితి ప్రేమ, ఇదేమి న్యాయం ఇదేమి ధర్మం.”

వేరుపడితే మనుగడెలా అని ప్రశ్నించే వారికి డెసెంబర్ చివరి వారం వరంగల్ లో జరిగే మెధావుల సదస్సే సమాధానం.ఇది ఆరంభం మాత్రమే. నిపుణుల మార్గదర్శకంలొ ఇంకెన్నొ సమావేశలు రానున్నాయి. ఇవి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది బాటలో నడిపించడానికి ఏర్పాటు చేస్తున్న తురుపుముక్కల సమావేశాలు. సుభిక్ష తెలంగాణ కోసం ప్రణాళికలు రూపుదిద్దుకునేదిక్కడే. ఆకలి కడుపుకు అన్నం పెట్టే అలొచనలు అంకురించేదిక్కడే. ఆత్మహత్యలు మాని హలమే బలమని, అప్పుల బాధలు మరిచి నేత మగ్గాలే పండగ ముగ్గులని నమ్మేరోజులు మన ముందేవున్నాయి.

3. citizen - మార్చి 24, 2011

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: