దరాబాదు: ఈనెల 10వ తేదీన నగరంలో ఎటువంటి ప్రదర్శనలు, ర్యాలీలు జరపడానికి అనుమతిలేదని ఐజి అనురాధ చెప్పారు. రేపటి నుంచి హైదరాబాదుతో సహా అన్ని తెలంగాణ జిల్లాలలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. ఆ రోజు నగరంలో విద్యార్థులు ఆందోళన చేయతలపెట్టినందున తనిఖీలు ఎక్కువ జరుగుతాయన్నారు. ట్రాఫిక్ ఆంక్షలు కూడా విపరీతంగా ఉంటాయని, అందువల్ల ఇతర జిల్లాల వారు ఎవరూ ఇక్కడికి రావద్దని ఆమె కోరారు. ఒకవేళ ఎవరైనా వస్తే ఇబ్బంది పడతారని హెచ్చరించారు. ఆ రోజున విద్యార్థులను కూడా హైదరాబాదు పంపవద్దని తల్లిదండ్రులకు ఆమె విజ్ఞప్తి చేశారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొనకుండా తమ పిల్లలని అదుపులో ఉంచుకోవాలని కోరారు.
ఇతర జిల్లాల నుంచి విద్యార్థులు నగరంలోకి ప్రవేశించకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఎక్కడికక్కడ పోలీసు బలగాలు మోహరించి ఉంటాయని తెలిపారు.
|
jai telangan e poratani ewaru apaleru
Spice andhra ఒక్క గొప్ప online ‘తెలుగు న్యూస్ పొర్టల్ ఇక్కడ మీరు కొత్తగ వస్తున రాజకియ వార్తలు సినీమ వార్తలు celebrities గొస్సిప్స్, videos, photographs, అన్నీ సినీమ trailers మరియు interviews అన్నీటి గురించి తెలుసుకొవచ్చు.